________________
నేను ఎవరిని ?
ప్రశ్నకర్త : స్వేచ్ఛను పొందవలసిన అవసరం లేదు కానీ స్వేచ్ఛను పొందవలసిన ఆవశ్యకతను గురించి తెలుసుకోవలసి ఉన్నదని నా అభిప్రాయం.
32
దాదాశ్రీ : అవును. దానిని అర్ధం చేసుకోవటం అవసరమే. ఒకే ఒక్కసారి దీనిని గ్రహిస్తే చాలు. నీవు స్వతంత్రుడవు కాలేకపోయినప్పటికీ, కనీసం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అవునా ? స్వాతంత్ర్యము తర్వాత వస్తుంది కానీ ప్రస్తుతం దాని గురించి తెలుసుకుంటే చాలు.
స్వస్వరూపానుభూతికి ఏ ప్రయత్నమూ అవసరం లేదు.
మోక్షం అంటే నీ నిజ స్వరూపానికి రావటమే. సంసారం అంటే నీ నిజ స్వరూపం నుంచి దూరంగా పోవటము. ఈ రెండింటిలో ఏది తేలిక? నీ నిజ స్వరూపానికి రావటం కష్టం కాదు కానీ నీ నిజ స్వభావానికి నిన్ను దూరం చేసే ప్రాపంచిక జీవనమే సదా కఠినమైనది. కిచిడీ తయారు చేయటం కంటే మోక్షం చాలా తేలిక. కిచిడీ తయారు చేయడానికి వివిధ పదార్ధములు కావాలి : బియ్యం, పప్పు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, నీళ్లు, వంటపాత్ర, ఇంధనం, స్టౌ మొదలైనవి. అపుడు మాత్రమే నీవు కిచిడీ తయారు చేయగలవు. కానీ మోక్షమో కిచిడీ కంటే తేలిక. అయితే మోక్షప్రదాత అయిన జ్ఞాని పురుషుడు లభించాలి. లేకుంటే మోక్షం ఎప్పటికీ లభించదు. నీవు అనేక జన్మలు ఎత్తలేదా?
అప్రయత్నంగా లభించేదే మోక్షం
నా వద్దకు వచ్చి మోక్షాన్ని పొందవలసినదిగా నేను మీకు చెప్తున్నాను. కాని ప్రజలు “మా ప్రయత్నం ఏమీ లేకుండా ఎవరైనా మాకు మోక్షాన్ని ఎలా యివ్వగలరు?” అని సంశయాత్మకులై అడుగుతున్నారు. అయితే మంచిదే, స్వప్రయత్నం ద్వారానే మీరు దాన్ని పొందండి. ప్రయత్నంతో, పనికిరానివిషయాలను మాత్రమే నీవు పొందుతావు. ప్రయాసపడి మోక్షమును ఇంతవరకు ఎవరూ పొందలేదు.
ప్రశ్నకర్త : మోక్షాన్ని ఇవ్వటం లేక పుచ్చుకోవటం సాధ్యమా?
దాదాశ్రీ : మోక్షం అంటే ఒకరు ఇచ్చేది ఇంకొకరు పుచ్చుకొనేది అయిన వస్తువు కాదు. కానీ నీకు ఒక నిమిత్తుడు అవసరం. (జ్ఞాని నీకు నిమిత్తుడు. నీవు మోక్షాన్ని