________________
నేను ఎవరిని ?
జ్ఞాన విధి అంటే ఏమిటి ? జ్ఞానిచే నిర్వహించబడే ఆత్మ అనాత్మల ప్రత్యేక
విభజన ప్రక్రియయే జ్ఞానవిధి ప్రశ్నకర్త :
జ్ఞానవిధి అనగానేమి ? దాదా శ్రీ : జ్ఞానవిధి అనగా ఆత్మను అనాత్మ (దేహం) నుంచి వేరుచేసే ప్రక్రియ. ఇది జడ తత్త్యం నుంచి చేతనతత్వాన్ని వేరు చేయటం.
ప్రశ్నకర్త : ఈ సిద్ధాంతము సరియైనదే, కాని వేరుచేసే పద్ధతి ఏమిటి ? దాదా శ్రీ : ఈ పద్ధతిలో యిచ్చుట, పుచ్చుకొనుట వంటిదేమీ జరగదు. కేవలం కూర్చుని నేను చెప్పినది చెప్పినట్లుగా తిరిగి చెప్పాలి. (“నేను ఎవరిని?” అనే జ్ఞానం ఒక్క రెండు గంటల ప్రక్రియలో లభిస్తుంది. ఇందులో 48 నిమిషాలు ఆత్మ అనాత్మలను వేరు పరచే భేదజ్ఞాన వాక్యాలను (విభజన విజ్ఞానం) పలుకవలసివుంటుంది. ఆ తర్వాత ఒక గంట సమయం ఐదు ఆజ్ఞలను మీకు సోదాహరణముగా వివరించటం జరుగుతుంది. తద్వారా మీరు నిత్యజీవితంలో ఎలా ప్రవర్తిస్తే కొత్త కర్మలు ఛార్జికాకుండా ఉంటాయో, గతకర్మలను ఏవిధమైన ఉద్వేగానికి లోను కాకుండా సమతతో ఎలా పూర్తిచేసికోగలరో మీకు తెలుపబడుతుంది. మీరు శుద్ధాత్మ అనే ఎరుక మీకు స్థిరంగా నిల్చి ఉంటుంది.)
గురువు అవసరమా లేక జ్ఞాని అవసరమా ? ప్రశ్నకర్త : ఒక వ్యక్తి దాదాజీని కలవకముందే ఒకరిని గురువుగా స్వీకరించినట్లయితే అతడు ఏమి చేయాలి?
దాదా శ్రీ : ఇప్పటికీ మీరు ఆ గురువు వద్దకు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు. లేకుంటే లేదు. నిర్బంధం ఏమీ లేదు. మీరు అతనిని
గౌరవించితీరాలి. కొంతమంది నా వల్ల జ్ఞానం పొందిన తర్వాత, తమయొక్క పూర్వపు గురువును వదలివేయాలా అని నన్నడుగుతుంటారు. నేను వారితో “అలా వదలి పెట్టకూడదు. ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే మీరు యిక్కడకు రాగలిగారు” అని చెప్తాను. వారు