________________
నేను ఎవరిని ?
20 వెనుక తెల్సికొన శక్యంకాని చాలా సూక్ష్మమైన కారణాలు వున్నాయి. ఆ కారణాలు ఏమిటో కని పెట్టు.
ప్రశ్నకర్త : వాటిని ఎలా కనుక్కోగలం? దాదా శ్రీ : నీవు యిక్కడికి సత్సంగానికి వచ్చినపుడు 'నేను ఈరోజు యిక్కడికి వచ్చాను' అని నమ్మావు. 'నేను వచ్చాను' మరియు 'నేను వెళ్తున్నాను' అని నీవు చెప్పటం నీ రాంగ్ బిలీఫ్ మరియు అహంకారం. నిన్న ఎందుకు రాలేదని నిన్ను నేను ప్రశ్నిస్తే నీవు నీ కాళ్ల పైపు చూపించవచ్చు. దీనిని నేనేమని అర్ధం చేసికోవాలి?
ప్రశ్నకర్త : నా కాళ్ళు నొప్పి పెడున్నాయి అని. దాదా శ్రీ : అవును, నీ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నీవు నీ కాళ్ళను నిందిస్తావు. నీ కాళ్ళు నొప్పిగా వున్నట్లయితే నీ కాళ్ళు నిన్ను ఇక్కడకు తెచ్చాయా? లేక నీ అంతట నీవే యిక్కడకు వచ్చావా?
ప్రశ్నకర్త : యిక్కడకు రావాలనే కోరిక నాకు ఉన్నది. కాబట్టి నేను యిక్కడ ఉన్నాను.
దాదా శ్రీ : అవును. నీ కోరిక కారణంగానే నీవువచ్చావు.
కానీ నీ కాళ్ళు ఇంకా మిగిలినవన్నీ బాగున్నాయి కనుకనే నీవు యిక్కడికి రాగలిగావు. నీ కాళ్ళు బాగా పనిచేయకుంటే నీవు రాగలిగే వాడివా?.
ప్రశ్నకర్త : అపుడు రాలేక పోయేవాడిని. దాదా శ్రీ : మరి అపుడు నీవు స్వశక్తితో రాగలిగినట్లా? ఉదాహరణకి పక్షవాతంతో ఉన్న వ్యక్తి ఒకరు ఎద్దుల బండిలో ఇక్కడకు వచ్చాడనుకో. అతడు “నేను వచ్చాను” అని చెప్తాడు. 'నీ కాళ్లు పక్షవాతానికి గురైనాయి కదా నీవు యిక్కడకు ఎలా వచ్చావు?' అని మేము అడిగినప్పటికీ అతడు తాను వచ్చాననే గట్టిగా చెప్తాడు.
కానీ నేను అతనిని 'నీవే వచ్చావా? లేక బండి నిన్ను యిక్కడకు తీసికొచ్చిందా?' అని అడిగినట్లయితే బండి తనను తీసికొనివచ్చిందని చెప్తాడు. అపుడు నేను అతనిని 'బండి ఇక్కడకు వచ్చిందా లేక ఎద్దులు బండిని యిక్కడకు తెచ్చాయా?' అని ప్రశ్నిస్తాను.