________________
19
నేను ఎవరిని ?
మరియు ప్రజలు అందరూ ఈ పజిల్ ను విడదీయలేకపోయారు పైగా వారే దానిలో చిక్కుకొన్నారు. ఈ చిక్కుముడిని విప్పటంలో నేను మీకు సహాయపడగలను. ఒకే ఒకగంట సమయంలో నేను మీకోసం ఆ పనిచేయగలను. ఆ తర్వాత ఈ చిక్కు ప్రశ్న మరల తలెత్తదు.
ఈ జగత్తును ఉన్నదానిని ఉన్నట్లుగా అర్ధంచేసికోవటం మాత్రమే నీవు చేయవలసింది; ఆ తర్వాత, నీవు జ్ఞప్తిలో ఉంచుకోవలసినది కూడ ఏమీ లేదు. ఒకసారి అర్థం చేసికొంటే చాలు. ఈ జగత్తు ఎలా ఏర్పడింది? భగవంతుడెవరు? జగత్తును ఎవరు నడిపిస్తున్నారు? ఇదంతా ఏమిటి? మన నిజస్వరూపం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవటంవలన ఈ చిక్కు ముడులన్నీ శాశ్వతంగా విడిపోతాయి.
సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ మనం ఈ విషయాన్ని గురించి చర్చిద్దాం. నీవు అడగదల్చుకొన్న ప్రశ్నలు ఏవైనా సరే అడిగి సమాధానాలు పొందవచ్చు.
ప్రశ్నకర్త : సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. దాదాశ్రీ : దీని కంతటికీ ఆధారం ఈ సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్, అదిలేకుండా ఈ జగత్తులో ఒక్క పరమాణువు కూడ మార్పు చెందలేదు. నీవు భోజనానికి కూర్చోవటానికి ముందు ఏఏ పదార్ధాలను వడ్డించబోతున్నారో నీకు తెలుసా? భోజన పదార్ధాలను తయారు చేసే వ్యక్తికి కూడ రేపు ఆమె/అతను ఏమి తయారు చేయబోతున్నారో తెలియదు. నీవు ఎంత ఆహారం తినవలసి ఉన్నదోకూడ పరమాణువు స్థాయివరకు అంతా నిర్ణయింపబడివుంటుంది. వీటి నన్నింటినీ ఒక చోట చేర్చి అది జరిగేలా చేసేది ఎవరు? అదే వ్యవస్థిత్ శక్తిగా నేను పేర్కొనే సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ అనే ఒక అద్భుతము.
ఇప్పుడు మన యిద్దరి మధ్య కలయికకు ఆధారం ఏమిటి? సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్సెస్ పై మాత్రమే మన కలయిక ఆధారపడివుంది. ఈ కలయిక