Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ 23 నేను ఎవరిని ? నీవు నిద్రలేచావా? లేక ఎవరైనా లేపారా? నువ్వు ఉదయాన్నే త్వరగా నిద్రలేచినప్పుడు 'నేనులేచాను' అని చెప్తావు. ఏ కారణం వల్ల నీవు త్వరగా లేవగలిగానని అనుకొంటున్నావు? రాత్రి సరిగా నిద్రపట్టకపోతే ‘నాకు నిద్రపట్టలేదు' అని చెప్తావు. ఎందుకు నిద్రించలేక పోయావు? నిజానికి దేనిమీదా నీకు నియంత్రణలేదు. ‘ఉదయం నన్ను ఎవరు నిద్రలేపారు?' అని ఎవరైనా నన్ను అడిగితే అతని నిద్రకర్మ పూర్తయింది కనుక అతను నిద్రలేచాడని చెప్తాను. అతనిని లేపింది అతని కర్మయే. నీ చేతుల్లో ఎంతవరకు ఉంది? నీవు, నిజమైన నీవు ఎన్నడూ తినలేదు. భోజనం చేసేది చందూలాల్. నీవెన్నడూ ఏమీ తినకపోయినప్పటికీ, ఎవరైతే తింటున్నారో అది నువ్వే అని నమ్ముతున్నావు. తినేది చందూలాల్, టాయిలెట్ కి వెళ్లేది కూడ చందూలాల్. నిష్కారణంగా నీవు యిందులో యిరుక్కొంటున్నావు. ఇది నీకు అర్ధమైందా? ప్రశ్నకర్త : దయచేసి వివరించండి. దాదాశ్రీ : విసర్జనక్రియకి కూడ స్వతంత్రశక్తిగల మనిషి ఇంత వరకు జన్మించలేదు. అతని ప్రేగులపైనే అతనికి స్వతంత్ర శక్తి లేనపుడు ఇంకా వేరే ఏ శక్తి అతనికి ఉంటుంది? మలబద్ధకం ఏర్పడినపుడు ఈ విషయం అతను గుర్తిస్తాడు. ఏవో కొన్ని విషయాలు అతని ప్లాన్ ప్రకారం జరగగానే అతనే వాటిని చేసినట్లు తలుస్తాడు. నేను బరోడాలో ఫిజిషియన్స్ బృందంతో ఒక సత్సంగం జరిపాను. అపుడు వారితో నేను “టాయ్లెట్కి వెళ్లటానికి కూడ మీకు స్వతంత్రశక్తిలేదు” అన్నాను. వారు దానిని అంగీకరించలేదు. మళ్లీ నేను “మలబద్ధకం ఏర్పడినపుడు ఆ విషయాన్ని మీరు గుర్తిస్తారు. అపుడు ఇంకొకరి సహాయం కోరవలసి వస్తుంది" అన్నాను. ఆశక్తి మీకు ఎన్నడూ లేదు కనుకనే సహాయంకోరవలసి వస్తుంది. అంటే విసర్జన క్రియ మీ కంట్రోల్లో లేదు. మీ రాంగ్ బిలీఫ్ వల్ల ప్రకృతి శక్తిని మీ శక్తిగా తలుస్తున్నారు. ఇంకొకరి శక్తిని మీ శక్తిగా పేర్కొనటం భ్రమ, అదే రాంగ్ బిలీఫ్. నేను ఏమి చెప్పదల్చుకొన్నానో నీవు అర్ధం చేసికొన్నావా? ఇప్పుడు విస్పష్టమయ్యిందా?

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90