________________
21
నేను ఎవరిని ? అందువల్ల, మీ నమ్మకాలన్నీ సత్యదూరమైనవే. నీవుయిక్కడకు రాగలగటం ఎన్నో భిన్న పరిస్థితుల పై ఆధారపడివుంది. ఎన్నో పరిస్థితులు నీకు సరైన క్రమంలో అనుకూలించినపుడే నీవు యిక్కడకు రాగలవు.
నీవు సరైన సమయంలో ఇక్కడకు వచ్చినప్పటికీ నీకు తలనొప్పి వస్తే వెనక్కి వెళ్లవలసి రావచ్చు. నీవు నిజంగా స్వతంత్రంగా యిక్కడకు నీ యిష్టంతో వచ్చినపుడు
నీ తలనొప్పి నీకు ఆటంకం కాకూడదుకదూ! లేదంటే నీవు యిక్కడకు వస్తుండగా దారిలో నీ స్నేహితుడు కలిసి అతనితో రమ్మని నిన్ను బలవంతం చేస్తే నీవు వెనక్కి వెళ్లిపోవచ్చు. అందువల్ల ఎన్నో పరిస్థితులు అనుకూలిస్తేనే గాని ఒక పని జరగదు. ఏవిధమైన అవరోధాలు లేకుంటేనే నీవు యిక్కడకు రాగలవు.
మనస్సుకి అనుకూలించే సిద్ధాంతం ఎన్నో పరిస్థితులు అనుకూలించినపుడు మాత్రమే ఒక కార్యం పూర్తవుతుంది. సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్సెస్ వల్లనే ఆ పని జరిగింది.
కానీ నీవు అహంకారంతో 'నేను చేసాను' అని ఆ గొప్పతనాన్ని నీకు ఆపాదించుకొంటావు. అంతా సవ్యంగా జరిగితే 'నేను చేసాను' అని, అనుకొన్న ప్రకారం జరగకపోతే దురదృష్టం అని చెప్తావు లేదా ఇతరులను నిందిస్తావు.
ప్రశ్నకర్త : అవును.
దాదా శ్రీ : డబ్బు సంపాదించినపుడు మనిషి అది తనఘనత అని గర్వపడతాడు. కానీ నష్టం వచ్చినపుడు లేదా విఫలమైనపుడు ఏవో కారణాలు చెప్తాడు లేదా 'భగవంతుడు నాకు అనుకూలించలేదు' అంటాడు.
ప్రశ్నకర్త : ఇది సులభమయిన క్షమాపణ, అనుకూల సిద్ధాంతము. దాదా శ్రీ : అవును అనుకూలమే కావచ్చు.
కానీ ఏవిషయంలోనూ ఎవ్వరూ భగవంతుని పై నేరం మోపకూడదు. మనం ఒక లాయర్ ని గాని లేక మరెవరినైనా నిందిస్తే కొంతవరకు ఫర్వాలేదు కాని మనం భగవంతుని ఎలా నిందించగలం? లాయర్ ని నిందిస్తే అతడు నీపై కేసు పెట్టి నష్టపరిహారం కోరతాడు,
కానీ భగవంతుని