Book Title: Who Am I
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ నేను ఎవరిని ? మాత్రమే. రైట్ బిలీఫ్ ని పొందితే అది సమ్యక్ దర్శన్ లేక సమ్యకత్వ (జ్ఞానమయ ప్రాపంచిక దృష్టి, యదార్ధ జ్ఞానము) అని చెప్పబడుతుంది. ఏనమ్మకము ఒకరిని ఆత్మగా దర్శింపచేయగలదో అది సమ్యక్ దర్శనము. ప్రకాశమయ జ్ఞానదృష్టిని పొందవలసిన అవసరం ఎంతైనావుంది. ఈ రాంగ్ బిలీఫ్స్ అన్నీ నాశనం గావింపబడి రైట్ బిలీఫ్ స్థాపన జరిగినప్పుడు జ్ఞాన దృష్టి ప్రాప్తిస్తుంది. అపుడు మాత్రమే ఎవరైనా ప్రపంచాన్ని ఉన్నదానిని ఉన్నట్లుగా దర్శించగలరు. ఇప్పటివరకు నీవన్నీ రాంగ్ బిలీఫ్స్ అనే విషయమే నీకు తెలియదు. ఇంతవరకు నిన్ను నీవు 'నేను చందూలాల్' అని నమ్మావు. ఇవి అన్నీ వ్యావహారికమైన తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే. నీవు శాశ్వతుడవు. కానీ 'నేను శాశ్వతుడను' అనే ఎరుక నీకింతవరకూ కలుగలేదు. తనకు తానే అపరిచితుడు నీ ఆత్మనుంచి దాక్కొని ఉండటం కోసం నీవు అనేక జన్మలుగా చేసిన ప్రయత్నం ఇది. అనేక జన్మలుగా నీ నిజస్వరూపాన్ని గురించి నీవు తెలుసుకొనకుండా, అనాత్మను గురించిన అన్ని విషయాలలో పరిజ్ఞానం పొందటం వింత కాదా? నీ నిజస్వరూపం నుంచి నువ్వు ఎంతకాలం దాగి వుండగలనని అనుకుంటున్నావు? తానెవరో తాను అన్వేషించి తెలుసుకోవటం కోసమే మానవజన్మ ఉద్దేశింపబడింది. లేకుంటే జననమరణరూపంలో రాకపోకలు సాగించక తప్పదు. 'నేనెవరు?' అనే ప్రశ్నకు సమాధానాన్ని తెల్సుకోవటం అత్యంత ఆవశ్యకమని నీకు అన్పించటంలేదా? నీవు నిజానికి ఎవరివో విచారించవలసిన అవసరం నీకు లేదా? (3) 'నేను' మరియు 'నాది' వీటిని వేరు చేసే ప్రయోగం 'నాది' వేరు చేయటంవల్ల ప్రయోజనం స్వస్వరూపానుభూతి ప్రశ్నకర్త : దాదాజీ, నా నిజస్వరూపాన్ని నేను ఏ పద్ధతి లేక ఉపాయంవల్ల తెలియగలను? దాదాశ్రీ : 'నేను' అనేది మూల తత్త్యము (వస్తుస్వరూపం, శాశ్వతం). 'నాది'

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90