________________
నేను ఎవరిని ?
అయితే భగవంతుణ్ణి ఎవరు తయారు చేసారు? భగవంతుడే నిజమైన సృష్టికర్త అని మేము చెప్పినట్లయితే భగవంతుణ్ణి ఎవరు తయారు చేసారు? అనే లాజికల్ ప్రశ్నవేస్తారు ప్రజలు. ఇంకా ఎన్నో ప్రశ్నలూ తలెత్తుతాయి. ప్రజలు నా వద్దకు వచ్చి ఇలా అంటారు. "భగవంతుడే కర్త అని మేము తలుస్తాము. కానీ అది సరికాదని మీరు చెప్తున్నారు. దీనిని అంగీకరించటం మాకు కష్టంగావుంది.” అపుడు నేను “భగవంతుడే కర్త అని నేను అంగీకరించాలంటే, ఆ భగవంతుని ఎవరు తయారు చేసారు? భగవంతుని సృష్టించిన వాడిని ఎవరు సృష్టించారు? ఇంతమాత్రం నాకు చెప్పండి” అని వాళ్లని అడుగుతాను. దీనిని తార్కికంగా విచారించి తెలుసుకోవచ్చు. సృష్టికర్త ఒకరు ఉన్నట్లయితే ఆ సృష్టికర్తను సృష్టించిన సృష్టికర్త వేరొకరు ఉండాలి. ఇక దీనికి అంతం అనేది వుండదు. అందువల్ల ఇది నిజం కాదు.
జగత్తుకు ఆదిగానీ అంతంగానీ లేదు. ఎవరూ సృష్టించకుండానే ఈ జగత్తు ఏర్పడింది. దీనిని ఎవరూ సృష్టించలేదు. ఎవరూ దీనిని సృష్టించలేదు గనుక దీనిగురించి మనం ఎవరిని అడగగలం ? ఇంత అస్తవ్యస్తంగా దీనిని సృష్టించిన వారెవరు? దీనికి బాధ్యులెవరు? అని తెల్సుకోవాలని నేనూ అన్వేషిస్తున్నాను. ఆవ్యక్తి కోసం ప్రతిచోటా నేను వెదికాను, కానీ ఎక్కడా కన్పించలేదు.
భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడనే వారిని తమ వాదనను ఋజువు పర్చుకోవటం కోసం నాతో చర్చలు జరపమని విదేశీ శాస్త్రవేత్తలకు చెప్పాను. అతడు సృష్టికర్త అయినచో ఏ సంవత్సరంలో దానిని సృష్టించాడో చెప్పమని నేను వారిని అడిగాను. ఏ సంవత్సరమో తమకు తెలియదని వారు అన్నారు. “అయితే ప్రపంచం
మొదలు అనేది అయిందా” అని అడిగాను. అప్పుడు వారు "మొదలు అయింది” అని చెప్పారు. సృష్టికర్త ఒకరున్నట్లయితే ఆ సృష్టికి మొదలు ఉండి తీరాలి. మొదలు అనేది ఉన్నట్లయితే దానికి అంతం అనేది కూడ ఉండి తీరాలి.
కానీ వాస్తవానికి ఈ జగత్తు అనాది-అనంతము. జగత్తు అంతం లేకుండానే కొనసాగుతుంది. అందువల్ల దానికి ఆదీ అంతమూ లేదు. దేనికి ఆదిలేదో దానికి సృష్టికర్తకూడ లేడు.