________________
15
నేను ఎవరిని ?
వాస్తవానికి, భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంతమాత్రము సృష్టించలేదు. సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ వల్లనే ప్రపంచం ఏర్పడింది. అందువల్ల ఇది స్వాభావికంగానే ఏర్పడింది. గుజరాతి భాషలో దీనిని నేను వ్యవస్థిత్ శక్తి (సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్) అని పేర్కొంటాను. ఇది చాలా సూక్ష్మ సత్యము.
దీనిని మోక్షము అనటానికి వీలులేదు ఒక చిన్నపిల్లవాడు కూడ భగవంతుడే ప్రపంచాన్ని తయారు చేసాడని చెప్తాడు. ఎంతో ఖ్యాతి గడించిన ధార్మికుడు లేదా సంత్ పురుషుడు కూడ భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్తాడు. ఇది లౌకికి దృష్టి మాత్రమే. ఇది అలౌకిక దృష్టి లేదా సత్యదృష్టి కాదు.
భగవంతుడు సృష్టికర్త అయినచో, అతడే మనకి శాశ్వతంగా బాస్ అయ్యేవాడు; అపుడు మోక్షం వంటిది ఏమీ ఉండేది కాదు. కానీ మోక్షంవుంది. భగవంతుడు ప్రపంచసృష్టికర్త కాదు. మోక్షం అంటే ఏమిటో గ్రహించిన వారు ఎవరైనా భగవంతుని సృష్టికర్తగా అంగీకరించరు. 'మోక్షము' మరియు 'భగవంతుడు సృష్టికర్త' ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన మాటలు. సృష్టికర్త అనగా, ఎవరు నీకు శాశ్వతమైన ఉపకారం చేసారో అతడు. అట్టి ఉపకారం చేసినది భగవంతుడే అయినచో నీవు ఎప్పటికీ అతనికి ఋణపడివుండాలి. సృష్టికర్తగా భగవంతుడు సదానీకు యజమానిగా (బాస్) ఉంటాడు; నీవు సదా అతనికి దాసునిగా (సబార్డినేట్ గా) నే వుంటావు. నీవు మోక్షాన్ని పొందినప్పటికీ, అతను నీ పై అధికారిగానే వుంటాడు. అవునా కాదా?
ప్రశ్నకర్త : అవును, అతడు శాశ్వతంగా మన పై అధికారి అవుతాడు. దాదా శ్రీ : అవును. అతడు మనకు శాశ్వతంగా బాస్ అవుతాడు కాబట్టి మోక్షం అనేదే లేదు. మన పైన ఒక అధికారివున్నపుడు ఆ మోక్షం మోక్షం అన్పించుకోదు. అటువంటి మోక్షంకంటె ఒకామెకు భర్తగా వుండటం మేలు. కొన్ని సమయాలలో అవమానించినా కనీసం నీకు వంటయినా చేసి పెడ్తుంది. అవసర సమయంలో సేవచేస్తుంది.