________________
నేను ఎవరిని ?
(5) జగత్తులో కర్త ఎవరు?
ఈ జగత్తులో కర్తయొక్క యదార్థ స్వభావము
14
సత్యాన్ని గురించిన జ్ఞానం లేకపోవటమే ఈ ఆవరణ, అస్పష్టత, ఆందోళన, కలతల కన్నింటికీ కారణం. ఇంతవరకూ మీకు తెలిసిన వాటిని గురించే ఇపుడు కూడ మీరు తెల్సుకోగోరుతున్నారా లేక మీకు తెలియనిదానిని తెలియగోరుతున్నారా?
ప్రపంచం ఏమిటి? ఇది ఎలా ఏర్పడింది? దీని సృష్టికర్త ఎవరు? ఈ జగత్తులోని ప్రతి ఒక్కరితో మనకు గల పాత్ర, సంబంధము ఏమిటి? దేనికైనా కర్తను నేనేనా? లేక వేరే ఎవరైనా కర్త ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెల్సుకోవలసిన ప్రాముఖ్యత ఉన్నదా? లేదా?
ప్రశ్నకర్త : ఉంది.
దాదాశ్రీ : ముందుగా దేని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉన్నదో దాని గురించి మాట్లాడుకొందాం. ఈ జగత్తును ఎవరు సృష్టించారని నీవు తలుస్తున్నావు? ఇంత సంక్లిష్టమైన, కష్టాలలో నిండిన ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? నీ అభిప్రాయం
ఏమిటి?
ప్రశ్నకర్త : భగవంతుడే తప్పక దీనిని సృష్టించి ఉండొచ్చు.
దాదాశ్రీ : అయితే ప్రపంచం అంతా చింతలతో ఎందుకు నిండి వుంది? ప్రతి ఒక్కరికీ చింతలున్నాయి. వాటి నుంచి ఎవరూ ముక్తి పొందలేదు.
ప్రశ్నకర్త : అందరూ చింతిస్తుంటారు కనుక ప్రపంచం చింతలతోనిండివుంది.
దాదాశ్రీ : అవును. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించివుంటే చింతలతో కూడిన దానినిగా ఎందుకు సృష్టించాడు? ఇట్టి దుఃఖాలన్నింటినీ సృష్టించిన నేరం ఆయనదే అయితే ఆయనను మనం అరెస్టు చేయించాలి. వాస్తవానికి ఆ నేరం ఆయనది కాదు. భగవంతుడు నిర్దోషి, ప్రపంచానికి సృష్టికర్త భగవంతుడే అని చెప్పటంద్వారా ప్రజలు అతనిని నేరస్థుణ్ణి చేసారు.