________________
నేను ఎవరిని ? మార్గం క్లియర్ అవుతుంది. 'నాది' ని వేరుచేయటం వల్ల లేదా 'నాది' వినష్టం అవ్వటం వల్ల 'నేను ఎవరు?' అనే అనుభూతి తనంత తానుగా అత్యంత సహజంగా కల్గుతుంది. స్వరూపానుభూతి 'నాది' యొక్క వినష్టం పై లేదా విభజన పై ఆధారపడివుంది.
(4) విశ్వానికి బాస్ ఎవరు? జ్ఞాని మాత్రమే నిజమైన 'నేను' ను చూపగలడు
ప్రశ్నకర్త : ఈ సంసార జీవనం సాగిస్తూ నిజమైన 'నేను' ను గ్రహించటం మరియు అనుభూతి చెందటం ఎలా సాధ్యమవుతుంది?
దాదా శ్రీ : మరి, వేరే ఎక్కడకు వెళ్ళి నిజమైన 'నేను' ను గుర్తిస్తావు? ఈ ప్రపంచం కాకుండా వేరే ఏదైనా చోటు ఉన్నదా జీవించటానికి? ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇందులోనే జీవించాలి. ఈ ప్రపంచంలో ఇక్కడే నీవు నీ నిజస్వరూపాన్ని తెల్సుకోగలవు. 'నేనెవరిని?' ఇది గ్రహించవలసిన విజ్ఞానము. నావద్దకురండి, నేను మీ నిజస్వరూపాన్ని మీకు అనుభూతం చేస్తాను.
దీనిని తెలుసుకొనే విధానంలో నేను మిమ్మల్ని ఏమీ చెయ్యమని చెప్పటంలేదు. అది మీ శక్తి పరిధిలోనిది కాదు కనుక. అందువల్ల నేనే మీకోసం అన్నీ చేస్తాను అని చెప్తున్నాను. మీరు దేని గురించి చింతించవలసిన పనిలేదు. మనం మొదట తెలుసుకొనవలసింది 'నిజంగా మనం ఎవరము?' అనే విషయాన్ని. శాశ్వత సత్యం ఏమిటి? ప్రపంచం ఏమిటి? ఇదంతా ఏమిటి? భగవంతుడంటే ఏమిటి లేదా భగవంతుడు ఎవరు ? ఈ విషయాలు తెలిసికొన యోగ్యమైనవి.
భగవంతుడున్నాడా? అవును భగవంతుడున్నాడు పైగా అతడు మీలోనే వున్నాడు. అతనికోసం మీరు బయట ఎందుకు వెదుకుతున్నారు? ఎవరైనా మీకోసం ఆ ద్వారాన్ని తెరిస్తే మీకు భగవంతుని దర్శనం అవుతుంది. ఆ తలుపులు చాలా గట్టిగా మూయబడివున్నాయి. అందువల్ల మీకు మీరుగా దానిని తెరవటం సాధ్యంకాదు. ఆత్మజ్ఞానిపురుషుడు మాత్రమే మీకు దారి చూపి ఆ ద్వారాన్ని మీకోసం తెరవగలడు.