________________
11
నేను ఎవరిని ?
ఒకసారి 'నేను', 'నాది' అనే వాటి విభజనజరిగితే ఇది చాలా సులువు అవునా? ఈ మార్గంలో ఆత్మానుభూతికి సంబంధించిన విజ్ఞానం సరళం అవుతుంది. అవునా? నేను చూపిన ఈ పద్ధతి ఆత్మజ్ఞానాభివృద్ధిని సులభతరం చేస్తుంది. లేకుంటే ఈ రోజుల్లో, ఈ కాలంలో ఎవరైనా శాస్త్రాలు చదివి చదివీ అలసిపోతారే తప్ప ఆత్మాను భూతిని పొందలేరు.
ప్రశ్నకర్త : ఇదంతా గ్రహించటానికి మాకు మీవంటి వారి సహాయం అవసరం లేదా?
దాదా శ్రీ : అవును, అది చాలా అవసరం. జ్ఞాని పురుషులు చాలా అరుదుగా వుంటారు. వారిని కల్సుకోవటం ఇంకా చాలా చాలా అరుదు. అటువంటి అరుదైన జ్ఞాని పురుషుడు లభించినప్పుడు ఆ అవకాశాన్ని జారవిడవకుండా అతని నుంచి స్వస్వరూపానుభూతిని పొందాలి. దీనికై ఏ మూల్యమూ చెల్లించవలసిన పనిలేదు. దీని నిమిత్తం మీకు ఏమీ ఖర్చుకాదు. పైగా ఒక గంట సమయంలో జ్ఞాని మీకు ఈ విభజన చేసి యిస్తారు. ఒక సారి మీరు నిజమైన 'నేను' ను గురించిన
జ్ఞానాన్ని పొందినచో, అన్నింటిని సాధించినట్లే. ఇది సమస్త శాస్త్రాల పూర్ణసారము.
నీవు ప్రాపంచిక విషయాలను కావాలనుకొంటే 'నాది' ని ఉంచుకోవాలి. కాని ముక్తిని పొందదల్చుకొన్నట్లయితే 'నాది' అనబడే వాటి అన్నింటిపై యాజమాన్యాన్ని త్యజించాలి లేదా వాటినన్నింటినీ మానసికంగా సమర్పణ చేయాలి. ఆ విధంగా 'నాది' అనేవాటినన్నింటిని జ్ఞానిపురుషునికి సమర్పించు. అపుడు నీకు 'నేను' మాత్రమే మిగిలివుంటుంది. 'నాది' పోయినప్పుడు 'నేనెవరిని' అనేది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. 'నాది' వేరయితే అపుడు అంతా విభజింపబడినట్లే. 'నేను', 'ఇదంతానాది' అనే నమ్మకదశ జీవాత్మదశగా నిర్వచింపబడింది. ఒక వ్యక్తి ఈ నమ్మకంతో (స్వస్వరూపానుభూతికిముందు) జీవాత్మగా ఉంటాడు. ఆత్మజ్ఞాన ప్రాప్తి తర్వాత జ్ఞానఫలంగా ఆ వ్యక్తి 'నేను మాత్రమే ఉన్నాను'; 'ఏదీ నాది కాదు, ఇదంతా నాది కాదు' అనే అవగాహనపూర్వకమైన నమ్మకంతో పరమాత్మ దశను పొందుతాడు. 'నాది' అనే ప్రతివస్తువూ మోక్షమార్గంలో అవరోధము. 'నేను' నుంచి 'నాది' ఒకసారి వేరయితే