________________
9
నేను ఎవరిని ?
ప్రశ్నకర్త : అవును, విరుద్ధంగా ఉన్నట్లుతోస్తుంది.
దాదాశ్రీ : ఇపుడు నీవు చందూలాల్. ఈ చందూలాల్ లో 'నేను', 'నాది' అనేవి రెండూవున్నాయి. అవి రెండూ రైల్వేలైన్ల వంటివి; అవి సదా సమాంతరంగా వుంటాయే తప్ప ఎప్పటికీ ఒక్కటికావు. 'నేను', 'నాది' అనేవి కలిసి ప్రయాణిస్తాయే కానీ సదా వేరుగానే వుంటాయి. అయినప్పటికీ ఆరెంటినీ నీవు ఒకటే అని నమ్ముతున్నావు. దీనికి కారణం అజ్ఞానం లేదా నీ నిజమైన గుర్తింపు (Identity) నీకు తెలియకపోవటమే. దీనిని అర్ధంచేసికొని 'నాది' అని చెప్పబడే వానినన్నింటిని వేరుచేసి ఒక ప్రక్కన పెట్టు. ఉదాహరణకి 'నాగుండె', నీ గుండెను ఒక ప్రక్కన పెట్టు. ఇంకా ఏఏ భాగాలను ఈ శరీరం నుంచి మనం వేరు చేయవలసి వున్నది?
ప్రశ్నకర్త : పాదాలు మరియు అన్ని జ్ఞానేంద్రియాలు.
దాదాశ్రీ : అవును, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇంకా మిగిలినవన్నీ. 'నామైండ్' అంటావా లేక 'నేను మైండ్' అంటావా?
ప్రశ్నకర్త : ‘నామైండ్' అనే అంటాము.
దాదాశ్రీ : 'నా బుద్ధి' అని కూడ అంటావు కదా!
ప్రశ్నకర్త : అవును.
దాదాశ్రీ : మరి ‘నా చిత్తం' అంటావా?
ప్రశ్నకర్త : అవును.
దాదాశ్రీ : 'నా అహంకారం' అంటావా లేక 'నేను అహంకారం' అంటావా?
ప్రశ్నకర్త : ‘నా అహంకారం' అంటాము.
దాదాశ్రీ : 'నా అహంకారం' అనటంవల్ల అహంకారం కూడ నీ కంటే వేరని, దానిని నీ నుంచి వేరు చేయవచ్చని తెలుస్తుంది కదా! ఇవి కాక ఇంకా ఏఏ భాగాలు ‘నాది' అని చెప్పబడేవి వున్నాయో నీకు తెలియదు. కనుక నీవు పూర్ణరూపంలో సెపరేషన్ చేయలేకపోతున్నావు. నీ జ్ఞానము పరిమితమైనది. స్థూల భాగాలు మాత్రమే నీకు