________________
నేను ఎవరిని ?
అనేది సంయోగస్వరూపం (పరిస్థితుల సంయోగం వల్ల ఏర్పడింది). మూలతత్వము, సంయోగస్వరూపము ఎప్పుడూ వేరుగానే వుంటాయి. 'నేను' అన్నది సహజమూల స్వరూపము.
'నేను' అంటే భగవంతుడు, 'నాది' అనేది మాయ (భ్రమ). నాది అని చెప్పబడే ప్రతిదీ మాయే. అనేక రకాలైన మాయ 'నాది' అని వ్యవహరించబడుతుంది. నువ్వు దేనినైనా 'నాది' అని చెప్పిన క్షణంలోనే మాయ ప్రభావానికి లోను అవుతున్నావు. 'నాది' అని నీవు వేనిని పేర్కొంటున్నావో వాటితో నీవు మమత్వం కల్గి ఉంటున్నావు.
ఆ విధంగా 'నేను', 'నాది' అనే దానికి జత అవుతుంది. కానీ 'నాది' అనేది 'నేను'తో జత (Attach) కాలేదు. 'నేను' కు సంబంధించినది 'నాది'.
'నేను' మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తి కల్గి ఉంది. 'నాది' అని చెప్పబడే ప్రతిదీ భిన్న స్వభావం కలది మరియు అనాత్మ విభాగానికి చెందినదే గాని ఆత్మకు సంబంధించినది కాదు. 'ఈ దేహంనాది' అని, 'ఇదినాది' అని నువ్వు వ్యావహారికదృష్టిలో చెప్పవలసివుంటుంది. కానీ నీ అంతరంగంలో నిజానికి 'ఇది నాది కాదు' అనే అవగాహన ఉండాలి. ఏ వ్యక్తి అయినా ఇటువంటి వివేకపూర్వక జ్ఞానాన్ని సంతరించుకున్నట్లయితే ఏ విషయమూ అతనిని బాధించదు. వ్యవహార దృష్టిలో 'నేను చందూలాల్' అని, 'ఇదినాది' అని చెప్పటంలో తప్పులేదు గానీ లోలోపల నిజానికి నీవెవరివో, నిజంగా నీది ఏమిటో నీకు నిశ్చయాత్మకంగా తెలిసివుండాలి. ఒకపోలీసు నీయింటికి వచ్చి 'ఇది ఎవరిఇల్లు' అని ప్రశ్నిస్తే 'ఇది నాయిల్లు' అని నీవు జవాబు చెప్పవలసి వుంటుంది. కానీ అంతరంగంలో 'ఇది నాయిల్లు కాదు' అనే ఎరుక ఉండాలి. ఈ అంతరంగ జ్ఞానమే అశాంతిని తొలగించి శాంతికి, ఆనందానికి
హేతువు అవుతుంది. అంతరంగం యొక్క స్థితి ఈ జ్ఞానంపై ఆధారపడివుంది. నిజమైన 'నేను' కు ఏ సంపత్తి లేదు.
'నాది' అనాత్మ విభాగానికి చెందినది, అశాశ్వతమైనది. 'నేను' ఆత్మవిభాగానికి చెందినది, శాశ్వతమైనది. 'నేను' ఎన్నటికీ అశాశ్వతం కాజాలదు. అందువలన 'నేను', 'నాది' అనే రెంటిలో నీవు అనుసరించవలసినది, లక్షింపదగినది 'నేను' నే.