________________
నేను ఎవరిని?
తప్పు స్థానంలో 'నేను' దాదా శ్రీ : 'నేను చందూలాల్' ని అనే విశ్వాసము అహంకారం. 'నేను' కాని చోట 'నేను' ను ఆరోపించటం అహంకారం.
ప్రశ్నకర్త : 'నేను చందూలాల్' ని అని చెప్పటం అహంకారం ఎలా అవుతుంది? 'నేను చాలా గొప్పవాడిని' లేక 'నేను అందరికంటె స్మార్ట్' అని చెప్తే అది వేరే విషయం . నేను చాలా సహజంగా 'నేను చందూలాల్' అని చెప్తే దానిలో అహంకారం ఎక్కడుంది?
దాదాశ్రీ : నువ్వు ఎంత సహజ భావంతో చెప్పినప్పటికీ అహంకారం వెళ్ళిపోతుందా? 'నా పేరు చందూలాల్' అని నువ్వు సహజంగా చెప్పినప్పటికీ అది అహంకారమే అవుతుంది. నీవు ఎవరివో నీకు తెలియకపోవటం నీవు కాని దానిని నీవుగా ఆరోపణచేయటం అహంకారమే. 'నేను' కాని దానిని 'నేను' అనుకోవటం అహంకారం. 'నేను చందూలాల్' అనేది సంసారరూప నాటకంలో నీ పాత్ర పేరు మాత్రమే. 'నేను చందూలాల్' అని వ్యావహారిక దృష్టిలో చెప్పినచో నష్టం లేదు. కాని 'నేను చందూలాల్' అనే బిలీఫ్ నీలో దృఢంగా పాతుకొని పోకూడదు. లౌకిక వ్యవహారంలో గుర్తింపు కోసం మాత్రమే 'చందూలాల్' అనే పేరు ఉద్దేశింపబడింది.
ప్రశ్నకర్త : నిజమే. లేకుంటే 'నేను చందూలాల్' అనే అహం చోటుచేసుకుంటుంది. దాదా శ్రీ : 'నేను' నేను యొక్క నిజస్థానంలో ఉన్నచో అది అహంకారం కాదు. 'నేను చందూలాల్' అని నీవు నమ్మినట్లయితే 'నేను' ను చందూలాల్ పై తప్పుగా ఆరోపించినందువల్ల అహంకారం అవుతుంది. 'నేను' ఆరోపిత స్థానం (చందూలాల్) నుంచి మూలస్థానానికి వస్తే అహంకారం పోతుంది. అందువల్ల నీవు 'నేను'ను తొలగించనవసరం లేదు కానీ దానిని సరియైన స్థానంలో ఉంచాలి.
రైట్ బిలీఫ్, రాంగ్ బిలీఫ్ 'మిథ్యాత్వం' అనే పదాన్ని ప్రజలు తరచుగా ప్రయోగిస్తుంటారు కాని దాని అర్ధం ఎవరికీ తెలియదు. అందువల్లనే ప్రపంచం ఇటువంటి కోలాహల పూరితమైన ఉపద్రవస్థితిలో కొనసాగుతుంది. రాంగ్ బిలీఫ్ అంటేనే మిథ్యాత్వం. ఫ్యాషన్ వస్త్రాలు ధరించటం, వివాహం చేసికోవటం మిథ్యాత్వం కాదు. మిథ్యాత్వం అంటే రాంగ్ బిలీఫ్స్