________________
నేను ఎవరిని ? చందూలాల్ ని దూషిస్తే దానికి నీవు ప్రభావితుడవవుతావు. “నేనెవరిని?” అనేదానిని నీవు తెలుసుకొన్నపుడు మాత్రమే ఈ రాంగ్ బిలీఫ్ ఆగిపోతుంది. ఈ రాంగ్ బిలీఫ్ కారణంగానే నీవు ఒక జన్మనుంచి మరొక జన్మకి సంచరించవలసి వస్తోంది. నీ నిజమైన ఐడెంటిటీ నీకు తెలియదు పై పెచ్చు నీవు కాని దానిని నీవు అనే నమ్మకాన్ని నీ మనస్సు పై బలంగా ముద్రించుకొంటున్నావు. ఈ మూఢనమ్మకాన్ని నీకు నీవుగా ఆపాదించుకొని, అందుకు తగినట్లుగానే ప్రవర్తిస్తుంటావు. ఈ మిథ్యాభియోగం చాలా పెద్ద పొరపాటు. ఈ పొరపాటే జీవితంలోని అన్ని బాధలకూ, దు:ఖానికి, ఆంతరంగిక అశాంతికీ, అసంతృప్తికీ మూలకారణం. 'నేను చందూలాల్' అనే రాంగ్ బిలీఫ్ కారణంగానే వర్తమానంలో నీలో ఎన్నో చింతలు చోటుచేసికొని వున్నాయి. ఈ రాంగ్ బిలీఫ్ ని నీపై నీవు ఆరోపించుకోవటం అజ్ఞానమే కాక మరిన్ని బాధలకు హేతువౌతుంది.
(2) నమ్మకములు రాంగ్, రైట్
అనేక మూఢనమ్మకాలు దాదా శ్రీ : “నేను చందూలాల్" అనే నమ్మకం నిద్రించే సమయంలో కూడ నిన్ను వదలదు. నీ వివాహం జరిగినపుడు ప్రజలు నీతో “నీవు ఈ స్త్రీకి భర్తవు” అని చెప్పారు. నీవు ఆ పాత్రని అంగీకరించి భర్తలాగే ప్రవర్తిస్తావు. అది అలాగే కొనసాగి 'నేను భర్తను' అనే నమ్మకము నీలో బలపడిపోతుంది. ఎవరైనా ఎప్పటికీ భర్త కాగలరా? నీవు విడాకులు పొందినప్పటికీ ఆమెకు భర్తవు అవుతావా? ఇటువంటి మూఢనమ్మకాలు అన్నీ నీలో లోతుగా పాతుకొని పోయాయి.
మొదటి రాంగ్ బిలీఫ్ 'నేను చందూలాల్.' 'నేను ఈ స్త్రీ యొక్క భర్తను' అనేది రెండవ రాంగ్ బిలీఫ్. 'నేను హిందువుని' ఇది మూడవ రాంగ్ బిలీఫ్. 'నేను లాయర్ ని' అనేది నాలుగవ రాంగ్ బిలీఫ్. 'నేను ఈ బాలుని తండ్రిని' ఇది ఐదవ రాంగ్ బిలీఫ్. 'నేను ఇతని యొక్క అంకుల్ ని' ఇది ఆరవ రాంగ్ బిలీఫ్. 'నేను తెల్లగా వుంటాను' ఇది ఏడవ రాంగ్ బిలీఫ్. 'నా వయస్సు 45 సంవత్సరాలు' ఇది ఎనిమిదో రాంగ్ బిలీఫ్. 'నేను ఇన్ కంటాక్సు పేయర్ ని' అని నీవు చెప్పినట్లయితే అది ఇంకొక రాంగ్ బిలీఫ్. ఇటువంటి ఎన్ని రాంగ్ బిలీఫ్స్ నీకున్నాయి?.