________________
నేను ఎవరిని? (1) నేను ఎవరిని?
ముక్తికి సరియైన మార్గము దాదాశ్రీ : మీ నామధేయం ఏమిటి?
ప్రశ్నకర్త : నా పేరు 'చందూలాల్." దాదాశ్రీ : నువ్వు నిజంగా 'చందూలాల్' వేనా?
ప్రశ్నకర్త : అవును. దాదా శ్రీ : 'చందూలాల్' నీ పేరు. అవునా కాదా? నీవు చందూలాల్ వా లేక నీ పేరు చందూలాలా?
ప్రశ్నకర్త : అదినా పేరు. దాదా శ్రీ : మరి నీవు ఎవరు? 'చందూలాల్' నీ పేరు అయినట్లయితే నీవు ఎవరు? నీవు,నీ పేరు వేరువేరు కాదా? నీ పేరు కంటే నీవు వేరయినట్లయితే మరి నీవెవరు? నేను ఏమిచెప్ప ప్రయత్నిస్తున్నానో నీవు గ్రహించావా? “ఇవి నాకళ్ళద్దాలు” అని నీవు చెప్పినచో నీవువేరు, అద్దాలు వేరు అవునా? అదేవిధంగా నీ పేరు కంటె నీవువేరు అని నీకు తెలియటం లేదా?
అదేవిధంగా ఒక దుకాణానికి 'జనరల్ ట్రేడర్స్' అని పేరు పెట్టటంలో తప్పులేదు. కానీ ఆ షాపు యజమానిని పిలువవలసి వచ్చినప్పుడు “ఓ జనరల్ ట్రేడర్స్ ఇలారా" అని పిల్చినట్లయితే “నా పేరు జయంతిలాల్. జనరల్ ట్రేడర్స్ నా షాపు పేరు” అని అతను సమాధానం చెప్తాడు. షాపు యజమాని, షాపు, షాపులోని వాణిజ్యసరుకులు ఇవన్నీ వేర్వేరు అవునా కాదా? నీకేమనిపిస్తుంది ?
ప్రశ్నకర్త : నిజమే. దాదా శ్రీ : కానీ నీ విషయంలో 'కాదు, నేనే చందూలాల్' అంటున్నావు. షాపు యజమాని, షాపుకు తగిలించిన బోర్డు రెండూ నేనే అని దాని అర్ధం కదా ! 'చందూలాల్' అనేది కేవలం గుర్తింపు సాధనం.