________________
నేను ఎవరిని ?
ప్రశ్నకర్త : చాలానే వున్నాయి ?
దాదాశ్రీ : 'నేను' కాని చోట 'నేను' ను నువ్వు ఎక్కడెక్కడ ఆరోపిస్తున్నావో అది రాంగ్ బిలీఫ్. ఈ రాంగ్ బిలీఫ్స్ అన్నింటినీ తొలగించుకోవాలి. ఇన్ని రాంగ్ బిలీఫ్స్ నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు ? ఇప్పుడు చెప్పు. ఎటువంటి బిలీఫ్ మనిషికి సంతోషాన్నిస్తుంది?
ప్రశ్నకర్త : ఏ నమ్మకాలూ లేని వ్యక్తి ఆనందంగా వుంటాడు.
దాదాశ్రీ : కాదు. ఏ బిలీఫ్ లేకుండా ఎవరూ ఉండలేరు. కాని ఉండవలసింది రైట్ బిలీఫ్. ప్రశ్నకర్త : ఏ
నమ్మకాలు లేకుండా ఉండటం సాధ్యమేనా?
దాదాశ్రీ : మనం లాస్ ఏంజెల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లవలసిఉన్నది అనుకొందాం. కానీ మనం పొరపాటుగా శాంటియాగో వెళ్లే మార్గంలో వెళ్లాం. అపుడు మనం శాంటియాగో మార్గం నుంచి లాస్ ఏంజెల్స్కి (ఒరిజినల్స్ లేదా బయలుదేరిన చోటుకు) వెనక్కి రావాలా లేదా? అదే విధంగా మనం మన ఒరిజినల్ స్థానానికి తిరిగి రావటానికి రైట్ బిలీఫ్ ని నిలుపుకోవలసిన అవసరం వుంది. బయలుదేరిన చోటునుంచి ఎంతదూరం తప్పు మార్గంలో ప్రయాణించామో అంతదూరం తిరిగి వెనక్కి రావాలి. ఆ తర్వాత సరియైన దారిలో ప్రయాణించటం ద్వారా గమ్యాన్ని చేరగలం. ఒకసారి నీవు రాంగ్ బిలీఫ్స్ నుండి బయటపడి కొంతకాలం రైట్ బిలీఫిని నిలుపుకొన్నట్లయితే నీవు ఒరిజినల్ స్థానాన్ని చేరగలవు. ఆ తర్వాత ఏ బిలీధీనీ నిలుపుకోవలసిన అవసరం ఉండదు. ఇక నీ పని పూర్తి అయినట్లే.
ఇప్పుడు నీవీ రాంగ్ బిలీఫ్స్ అన్నింటినీ ఎలా తొలగించుకోగలవు?
ప్రశ్నకర్త : నాకు తెలియదు. అందుకు మీ మార్గదర్శనం నాకు అవసరం.
దాదాశ్రీ : నిజమే. అనంత జన్మలుగా లక్ష్యరహితంగా ప్రపంచంలో పరిభ్రమిస్తున్న మనిషికి రాంగ్ బిలీఫ్్న తొలగించుకోగల పరిజ్ఞానం లేదు. తనది రాంగ్ బిలీఫ్ అని మనిషి తెలుసుకొన్నప్పటికీ దానిని ఎలా తొలగించుకోవాలో అతనికి తెలియదు. ఒక్కరాంగ్ బిలీఫ్ని కూడ తొలగించుకోకుండానే అనేక జన్మలు గడిచిపోయాయి.