________________
నేను ఎవరిని ?
తెలుసు. సూక్ష్మ భాగాలను కూడ వేరుచేయాలి. తర్వాత సూక్ష్మతర, సూక్ష్మతమ భాగాలను కూడ వేరు చేయాలి. అగ్రాహ్యమైన ఈ స్థాయిలలోని భాగాలను వేరుచేయటం జ్ఞాని పురుషునికి మాత్రమే సాధ్యమౌతుంది.
'నేను' నుంచి 'నాది' అని పేర్కొనబడే ప్రతి స్పేర్ పార్ట్ ని వేరుచేస్తూ వాటినన్నింటిని ఒక ప్రక్కన పెట్టటం ద్వారా 'నేను' నుంచి 'నాది' వేరు చేయటం సాధ్యమే కదా! అలా 'నాది' అనే వాటినన్నింటిని వేరు చేసిన తర్వాత ఏమి మిగులుతుంది?
ప్రశ్నకర్త : 'నేను.” దాదాశ్రీ : ఆ 'నేను' అనేది ఏదో అదే నువ్వు. ఆ 'నేను' నే నీవు తెలుసుకోవలసి వుంది.
ప్రశ్నకర్త : ఆ విధంగా సెపరేట్ చేసిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో అదే నిజమైన 'నేను' అని అర్ధం చేసుకోవాలా?
దాదా శ్రీ : అవును, ఆ సెపరేషన్ తర్వాత ఏమి మిగిలిఉంటుందో అదే నీ నిజమైన ఆత్మ. ఆ ఆత్మే 'నేను' అనబడే నిజమైన నువ్వు. దీనిని గురించి నీవు విచారించవలసి లేదా? 'నాది' నుంచి 'నేను' ను వేరుచేసే ఈ పద్ధతి చాలా సరళమైనది కదూ!
ప్రశ్నకర్త : సరళంగా కన్పిస్తుంది కానీ సూక్ష్మతర, సూక్ష్మతమ స్థాయిల్లో మేము ఎలా వేరుచేయగలం?
జ్ఞాని లేకుండా ఇది సాధ్యం కాదు అవునా? దాదా శ్రీ : అవును, మీ
కోసం జ్ఞానిపురుషుడు ఆ పని చేస్తాడు. అందువల్లనే జ్ఞానియొక్క సెపరేటర్ ద్వారా 'నేను', 'నాది' వేరుచేయాలని చెప్తున్నాను. ఈ సెపరేటర్ ని వేదశాస్త్రాలు లేదా ధర్మగ్రంధాలు ఏమని చెప్తున్నాయి?
శాస్త్రాలు దానిని భేదజ్ఞానమని చెప్తున్నాయి. ఇది విభజన గురించిన విజ్ఞానము. భేదజ్ఞానం లేకుండా 'నాది' అనబడే వాటిని నీవు ఎలా విభజించగలవు? 'నాది' అనే విభాగంలోకి ఏవేవి వస్తాయో, 'నేను' అనే విభాగంలోకి ఏమి వస్తాయో నీకు సరైన అవగాహనలేదు. భేదజ్ఞానం అంటే 'నాది' అనే వాటి అన్నింటికంటె 'నేను' పూర్తిగా వేరు అని తెలిపే జ్ఞానం. ఎవరైనా సరే జ్ఞానిపురుషుని ప్రత్యక్షంగా కల్సుకోవటం ద్వారా మాత్రమే ఈ భేద
జ్ఞానాన్ని పొందగలరు.