Book Title: Whatever Happens Justice
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ జరిగింది న్యాజీురి అన్యాయం అనే మాటకి అవకాశమే లేదు. ప్రజలు నన్ను ఇలా అడిగేవారు? "మీ కాలు ఫ్రాక్చరు అయింది కదా దాని విషయం ఏమిటి?" అపుడు నేను చెప్పేవాడిని. "ప్రకృతి న్యాయమే చేసింది”. TEL 2 ప్రకృతి న్యాయాన్ని అంగీకరించగలిగితే, “జరిగింది ఏదైనా న్యాయమే” అని అర్ధం చేసికోగల్గితే మీరు ముక్తిని పొందుతారు. ప్రకృతి న్యాయాన్ని మీరు ప్రశ్నించినట్లయితే, ప్రకృతి న్యాయాన్ని కొంచెమైనా సందేహించినట్లయితే సమస్యలను, బాధలను ఆహ్వానించినట్లే. 'ప్రకృతి సదా న్యాయమే' అని నమ్మటమే నిజమైన జ్ఞానం. ఉన్నదానిని ఉన్నట్లు గ్రహించటమే జ్ఞానం. ఉన్నదానిని ఉ న్నట్లు స్వీకరించకపోవడమే అజ్ఞానం. ఒక వ్యక్తి మరొక వ్యక్తి గృహాన్ని తగులబెట్టాడు. ప్రజలు దానిని అన్యాయంగా భావిస్తారు. కాని వాస్తవంలో అది న్యాయమే. ఇల్లు తగలబడిన వ్యక్తి దానికి కారకుడైన వ్యక్తిని దూషిస్తాడు. అతను చేసిన పనిని నేరంగా పరిగణిస్తాడు. అతని పట్ల ఉద్రిక్తుడౌతాడు. ఆ సమయంలో ఒకరు భగవంతుని ఇలా అడుగుతారు. "ఆ వ్యక్తి ఇంకొకని యిల్లు తగలబెట్టడం న్యాయమా? అన్యాయమా?" అపుడు భగవంతుడు ఇలా సమాధానం చెప్తాడు. “ఇల్లు తగులబెట్టటం న్యాయమే". ఏ వ్యక్తి యిల్లు తగులబెట్టబడిందో ఆ వ్యక్తి తగులబెట్టిన వ్యక్తిపట్ల ఉద్రేక పూరితుడై ప్రవర్తించినందుకు, దూషించినంద్కు ఫలితాన్ని అనుభవించవలసి వుంటుంది. ఎందుకంటే ప్రకృతిన్యాయాన్ని అతను అన్యాయంగా పేర్కొన్నాడు, దానికి ఫలం అనుభవించక తప్పదు. ఇల్లు తగులబడటం ఒక దు:ఖం కాగో ప్రకృతి న్యాయాన్ని ప్రశ్నించినంద్కు ఫలితాన్ని అనుభవించటం మరోదు:ఖం. ప్రకృతిలో కించితామాత్రమైనా అన్యాయం జరుగనే జరగదు. ఈ విశ్వంలో న్యాయంకోసం వెదకకూడదు. అలా న్యాయంకోసం వెదుకుతున్న కారణం గానే, ఈ ప్రపంచంలో కక్షలు, విభేదాలు ఏర్పడుతున్నాయి. జగత్తు న్యాయస్వరూపమే, న్యాయంకోసం వెదకవలసిన పనిలేదు. జరిగిందే న్యాయం. ఏమి జరిగిందో అదే న్యాయం. అలా న్యాయం కోసం అన్వేషించటం వల్లనే ప్రజలు కోర్టులు వగైరాలను ఏర్పాటుచేసికొన్నారు. కాని ఆ కోర్టుల్లో న్యాయం లభిస్తుందని భావించటం తెలివితక్కువతనం. జరిగిన ప్రతిదీ, జరుగుచున్న ప్రతిదీ న్యాయమే. ఏమి జరిగితే దానిని కేవలం చూస్తూండాలి. అదే న్యాయం.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37