________________
జరిగింది న్యాజీరి
ప్రశ్నకర్త : వాళ్ళు ఎప్పుడూ ప్రతి విషయంలోనూ నన్ను విమర్శిస్తుంటారు. చివరికి నా వస్త్రధారణ విషయంలో కూడ.
దాదాశ్రీ : అదే ఖచ్చితమైన న్యాయం. ఇటువంటి విషయాలలో నువ్వు న్యాయం కోసం వెదికితే దానికి మూల్యంగా బాధపడవలసి వస్తుంది. అందువల్ల న్యాయం కోసం వెతకవద్దు. నేను సరళమైన సత్యాన్ని కని పెట్టాను. న్యాయాన్ని వెదకటం వల్లనే ప్రజలు కష్టాల పాలవుతున్నారు. న్యాయంకోసం వెతికినా చివరికి ఫలితం శూన్యం. ఈ విషయాన్ని ముందే ఎంద్కు గ్రహించరు? ఇదంతా అహంకారం యొక్క ప్రతాపం వల్లనే.
జరిగిందే న్యాయం. న్యాయంకోసం వెదకవద్దు. మీ తండ్రి మిమ్మల్ని విమర్శిస్తే అదే న్యాయం. “ఎంద్కు నన్ను విమర్శించారు?” అని వివరణ కోరవద్దు. నా అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైనా నీవు ఈ న్యాయాన్ని
అంగీకరించక తప్పదు. తండ్రి విమర్శను స్వీకరించటంలో తప్పేమిటి? జరిగిందే న్యాయం అని నీ మనసులో మాత్రమే అనుకో మీ తండ్రికి మాత్రం చెప్పవద్దు. ఎందుకంటే ఆయన దానిని అలుసుగా తీసికోవచ్చు.
ఇది మొదలు నీవు బుద్ధిని ఉపయోగించకు. జరిగిన న్యాయాన్ని స్వీకరించు. బుద్ధి ప్రశ్నిస్తూనే వుంటుంది. “నీకెవరు చెప్పారు? ఎందుకు వేడినీళ్ళు పెట్టావు?” అపుడు దానికి నువ్వు “జరిగిందేన్యాయం” అని చెప్పాలి. దీనిని అమలు పరుస్తూ వుంటే ఇక బుద్ధి ఫిర్యాదు చేయటం మానేస్తుంది.
ఆకలితో ఉన్న వ్యక్తికి నువ్వు భోజనం పెట్టావు. తిన్న తర్వాత అతను “నిన్నెవరు అడిగారు భోజనం పెట్టమని, నా సమయం వృధా చేసావు.” అని నీపై కోపగిస్తే అదే న్యాయం.
భార్యా భర్తలలో ఒకరు బుద్ధిని ఉపయోగించటం మానేస్తే ఇంట్లో వ్యవహారాలన్నీ సజావుగా నడుస్తాయి. కాని వారి బుద్ధి వారి మాటను వినకపోతే (వారు బుద్ధికి లొంగిపోతే) వారు భోజనం కూడ ప్రశాంతంగా చేయలేరు. అనావృష్టి సంభవిస్తే అది న్యాయమే. ఆ పరిస్థితుల్లో భగవంతుడు అన్యాయం చేసాడని ఒకరైతు ఫిర్యాదు చేస్తాడు. అతను అజ్ఞానం వల్ల అలా మాట్లాడతాడు. అతని ఫిర్యాదు వర్షాన్ని రప్పించగలదా? అక్కడ వర్షం లేకపోవటమే న్యాయం. కొన్ని