________________
నిలబడుతుంది. బుద్ధికి తెల్సు ఆ సమయంలో తన పాత్ర అవసరమని, తనులేకుంటే జరగదని. కాని ఎప్పుడైతే మనం 'ఇది న్యాయమే' అని చెప్తామో అపుడు అది 'ఇక్కడ మన ఆటలు సాగవు' అని గ్రహించి మకాం ఎత్తివేస్తుంది. దాని ఆటలు ఎక్కడ సాగుతాయో ఆ వ్యక్తిని ఆశ్రయిస్తుంది. అశక్తులైనవారే బుద్ధిని ఆశ్రయిస్తారు. బుద్ధిని పెంచటం కోసం ప్రజలు ఎన్నో తపశ్చర్యలు, ఉ పవాసాది వ్రతాలు చేస్తారు. అదే సమయంలో బుద్ది ఎంతగా పెరుగుతుందో అంతగా వేదన కూడ పెరుగుతుంది. బుద్ధిని బాలెన్స్ చేయటానికి అదే మోతాదులో దు:ఖం కూడ ఉండాలి. అపుడే రెండూ సరిసమానంగా ఉంటాయి. నా బుద్ధి నశించిపోయింది. అందువల్లనే నా బాధలు కూడ అంతమైనాయి.
నందేహాల అంతమే మోక్ష మార్గం. 'ఏమి జరిగితే అదే న్యాయం' అని నీకు నీవు చెప్పుకుంటే నీవు నిర్వికల్పస్థితిని పొందుతావు. సందేహమే తలెత్తదు. కానీ మనుష్యులు ఒక వైపు న్యాయం కోసం వెదుకుతూనే, మోక్షం కూడ కావాలని కోరుకొంటారు. ఇది పరస్పర విరుద్ధం. రెండూ కావాలంటే సాధ్యం కాదు. ప్రశ్నలు ఎపుడు అంతమౌతాయో అపుడు మోక్షం మొదలౌతుంది. ఈ అక్రమ విజ్ఞాన మార్గంలో వికల్పం (ప్రశ్న) అన్నదే తలెత్తదు. అందువల్లనే ఇది చాలా సులువైన మార్గం. ఏమి జరిగితే అదే న్యాయం అన్న సూత్రం వల్ల బుద్ధి నిర్వివాదం అవుతుంది. బుద్ధి ఎంతగా నిర్వివాదం అయితే అంతగా నిర్వికల్పస్థితి కల్గుతుంది. అన్ని టెన్షన నుంచి విముక్తి కల్గుతుంది.
సమస్త ప్రపంచం న్యాయంకోసం వెదుకుతూనే వుంది. దానికి బదులు జరిగిందే న్యాయం అని మనం స్వీకరిస్తే లాయర్లు, జ, ఎవరూ అవసరం లేదు. ఎంత ప్రాకులాడినా చివరకు బాధ అనుభవించక తప్పదు కదా?
ఏ న్యాయస్థానంలోనూ తృప్తి లభించదు. ఒక వ్యక్తి న్యాయాన్ని కోరుతూ క్రింది కోర్టుకు వెళ్ళాడు. లాయరు వాదించాడు. జడ్జిమెంటు వచ్చింది. న్యాయం వెలువడింది. ఆ వ్యక్తికి ఆ న్యాయం వల్ల తృప్తి లభించలేదు. అందువల్ల జిల్లా కోర్టుకు వెళ్ళాడు. అక్కడ