________________
కూడ అతనికి నిరాశే కలిగింది. తర్వాత హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడ అతనికి సంతోషం కలగలేదు. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. అక్కడా అతనికి తృప్తి లేదు. ఆఖరుగా ప్రసిడెంట్ కి అప్పీల్ చేశాడు. అక్కడ కూడ అతనికి మేలు కల్గలేదు. ఇన్ని కోర్టుల్లోనూ వ్యవహారం నడిపినంద్కు లాయరు తన ఫీజును డిమాండ్ చేశాడు. లాయరుకి ఫీజు చెల్లించలేదు. అది కూడ న్యాయమే.
న్యాయం : సహజం మరియు అసహజము
న్యాయం రెండురకాలు. ప్రశ్నలను పెంచి బాధలను కల్గించేది ఒకరకం. ప్రశ్నలను నిర్మూలించేది రెండవరకం. పరిపూర్ణమైన న్యాయం ఏమంటే, జరిగిందేన్యాయం, ఇది వికల్పాలను తొలగిస్తుంది. మనం న్యాయం కోసం
ప్రాకులాడే కొద్దీ ప్రశ్నలు పెరుగుతూ ఉంటాయి. ప్రకృతి న్యాయం ప్రశ్నలను తొలగించి నిర్వికల్ప స్థితిని కల్గిస్తుంది. జరిగినది, జరుగుచున్నది ఏదైనా న్యాయమే. దీనిని స్వీకరించకుండా అతను ఎంతమందిని ఆశ్రయించినా ఎవరు చెప్పిన న్యాయాన్నీ అతను అంగీకరించలేడు. ఆ విధంగా అతని సమస్యలు మరింతగా పెరుగుతాయి. తనకు తానే స్వయంగా సమస్యల వలయంలో చిక్కుకుని అధిక దు:ఖానికి గురి అవుతాడు. ముందే జరిగిన దానిని న్యాయంగా స్వీకరించటం అన్నిటికంటే ఉత్తమం.
ప్రకృతి సదా న్యాయమే చేస్తుంది. ఆ న్యాయం నిరంతరమూ స్థిరమూ. కాకపోతే అది న్యాయమేనని ప్రకృతి నిరూపించలేదు. అది ఏ విధంగా న్యాయం అనే విషయాన్ని జ్ఞాని మాత్రమే నిరూపించగలడు. నిన్ను సమాధానపరచగలడు. ఒకసారి సమాధానపడితే నీ పని పూర్తి అయినట్లే. ప్రశ్నలన్నీ పరిష్కరింపబడితే, నీవు నిర్వికల్పస్థితిని పొందుతావు.
జయ సచ్చిదానంద్