Page #1
--------------------------------------------------------------------------
________________
జరిగిందే న్యాయం
- దాదా భగవాన్
NRinn
Page #2
--------------------------------------------------------------------------
________________
Telugu translation of the English book "Whatever Happened is Justice"
జరిగిందే న్యాయం
ગા
సంపాదకులు నీరూబెన్ అమీన్
Page #3
--------------------------------------------------------------------------
________________
Publisher
: Mr. Ajit C. Patel
Dada Bhagwan Aradhana Trust Dada Darshan, 5, Mamta Park Soc, B/h. Navgujrat College, Usmanpura, Ahmedabad-380014, Gujarat, India. Tel. : +91 79 3983 0100
All Rights reserved - Deepakbhai Desai Trimandir, Simandhar City, Ahmedabad-Kalol Highway, Adalaj, Dist.-Gandhinagar-382421, Gujarat, India. No part of this book may be used or reproduced in any manner whatsoever without written permission from the holder of the copyright
First Edition Second Edition
: 1000 copies, · 1000 copies,
July 2007 July 2015
Printer
: Amba Offset
Basement, Parshwanath Chambers, Nr. RBI, Usmanpura, Ahmedabad-380014, Gujarat, India. Tel.: +91 79 27542964
Page #4
--------------------------------------------------------------------------
________________
త్రిమంత్రము
(సర్వవిఘ్న నివారణ చేసే త్రిమంత్రములు)
నమో అరిహంతాణం
తమ అంత:శత్రువులైన క్రోథ, గర్వ, లోభ, మోహములను నాశనము చేసిన వారందరికి నా నమస్కారము. నమో సిద్ధాణం
ఆత్యంతిక మోక్షమును పొందిన వారందరికీ నేను నమస్కరించుచున్నాను.
నమో ఆయరియాణం
ఆత్మసాక్షాత్కారమును పొంది మోక్షమార్గమును చూపిన ఆచార్యులందరికీ నా నమస్కారము. నమో వజ్జాయాణం
ఆత్మ జ్ఞానమును పొందిన ఆధ్యాత్మిక మార్గ గురువులందరికి నా నమస్కారము.
నమో లోయే సవ్వసాహుణం
ఆత్మ జ్ఞానమును పొంది ఆ మార్గంలో పురోగమించుచున్న ఈ విశ్వంలోని సాధువులందరికీ నేను నమస్కరించుచున్నాను. ఏసో పంచ నముక్కారో ఈ ఐదు నమస్కారములు సవ్వ పావప్పనాశనో
సమస్త పాపములను నాశనము చేయును.
మంగళానాం చ సవ్వేసిం మంగళప్రదమైన వాటి అన్నింటిలో
పఢమం హవయి మంగళం
ఇది సర్వోత్కృష్టము.
ఓం నమో భగవతే వాసుదేవాయ
మానవుని నుంచి మాధవునిగా మారిన వారందరికి నా నమస్కారము.
ఓం నమ: శివాయ
మానవాళి మోక్షార్థమై సాధనాలుగా మారిన విశ్వంలోని మంగళస్వరూపులందరికీ నా నమస్కారము.
జై సత్ చిత్ ఆనంద్
శాశ్వతమైన దానియొక్క ఎరుకే ఆనందము.
Page #5
--------------------------------------------------------------------------
________________
M
జ్ఞాని పురుషుని యొక్క పరిచయం అది 1958వ సంవత్సరం జూన్ నెలలో ఒకనాటి సాయంత్రం సుమారు ఆరు గంటల సమయం, పశ్చిమ భారత దేశంలోని దక్షిణ గుజరాత్ లోని ఒక పట్టణమైన సూరత్ రైల్వే స్టేషను. అంబాలాల్ మూ' భాయ్ పటేల్ నామధేయుడు, వృత్తి రీత్యా కాంట్రాక్టరూ అయిన ఒక గృహస్థుడు జనసమూహంతో రద్దీగా వున్న సూరత్ స్టేషన్లోని మూడవ నెంబరు ప్లాట్‌ఫాం బెంచి పైన కూర్చుని ఉ న్నారు. ఆ సమయంలో నలభై ఎనిమిది నిమిషములపాటు ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అంబాలాల్ మూజ్ భాయ్ పటేల్ లోని ఆత్మ సాక్షాత్కారమైంది. ఆ సమయంలో అతని అహంకారం సమూలంగా దగ్ధమైపోయింది. ఆ క్షణం నుంచి అతను అంబాలాల్ యొక్క ఆలోచనలు, వాక్కు మరియు క్రియలన్నింటినుంచి పూర్తిగా వేరుచేయబడి, జ్ఞానమార్గం ద్వారా మానవాళికి ముక్తిని ప్రసాదించే నిమిత్తం భగవంతుని చేతిలో సజీవ పరికరంగా మారారు. ఆయన తనకు ప్రకటితమైన పరమాత్మని దాదాభగవాన్ అని పిలిచారు. “ఈ పరమాత్మ, దాదాభగవాన్ నాలో పూర్ణరూపంలో వ్యక్తమైనాడు; మీలో అవ్యక్తంగా ఉన్నాడు. భేదం ఇంతమాత్రమే. ఆయన జీవులందరిలోను విరాజమానుడై ఉ న్నాడు.” అని తనను కలిసిన ప్రతి ఒక్కరితోనూ చెప్పేవారు.
మనం ఎవరము? భగవంతుడంటే ఏమిటి? జగత్తును ఎవరు నడిపిస్తున్నారు? కర్మ ఏమిటి? మోక్షం ఏమిటి? ఇత్యాది సమస్త ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఆ సందర్భంలో సమాధానం లభించింది. ప్రకృతి శ్రీ అంబాలాల్ మూజ్ భాయ్ పటేల్ ద్వారా ప్రపంచానికి సంపూర్ణ తత్త్య రహస్యాన్ని వెల్లడిచేసింది.
శ్రీ అంబాలాల్ జన్మస్థలం బరోడాపట్టణ సమీపంలోని తారాసలి; పెరిగింది గుజరాత్ లోని బాదరణ్ గ్రామం. ఆయన ధర్మపత్ని హీరాబా. వృత్తిరీత్యా కాంట్రాక్టరు అయినప్పటికీ ఆత్మసాక్షాత్కారం పొందటానికి ముందు కూడా అతని వ్యావహారిక జీవనం ఇంట్లోను, చుట్టు ప్రక్కలవారితోను కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేది. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత జ్ఞానిగా ఆయన జీవితం ప్రజలకే అంకితమైంది.
వ్యాపారంలో ధర్మం ఉండాలి, ధర్మంలో వ్యాపారం ఉండకూడదు అనే నియమాన్ని ఆయన జీవితమంతా అమలుపరచారు. భక్తులచే దాదా శ్రీగా
Page #6
--------------------------------------------------------------------------
________________
పిలువబడే ఆయన ఎన్నడూ ఎవరినుంచీ స్వంత ఖర్చుల నిమిత్తం ధనాన్ని స్వీకరించలేదు. పైగా తనకు వ్యాపారంలో లభించిన లాభాలను, భక్తులను భారతదేశంలోని వివిధ యాత్రా స్థలాలకు తీసికొనివెళ్లటానికి వినియోగించేవారు.
దాదాజీ మాటలు అక్రమవిజ్ఞాన్ గా పిలువబడే కొత్త, డైరెక్ట్ మరియు మెట్లదారికాని లిఫ్ట్ మార్గమైన ఆత్మానుభూతి మార్గానికి పునాది అయ్యాయి. అతడు తన దివ్య ప్రాచీన విజ్ఞాన ప్రయోగం (జ్ఞాన విధి) ద్వారా కేవలం రెండు గంటలలో ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందచేశారు. వేలకొలది ముముక్షువులు ఈ విధానం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందినారు, ఇప్పటికీ వేలకొలది ముముక్షువులు పొందుతూనే ఉన్నారు. అక్రమమార్గం అంటే మెట్లు లేనిది, లిఫ్టే మార్గం లేక షార్ట్కట్ మార్గం. క్రమ మార్గం అనగా మెట్టుతర్వాత మెట్టు క్రమంగా ఎక్కే ఆధ్యాత్మిక మార్గం. ఇపుడు అక్రమమార్గం ఆత్మానుభూతి నిమిత్తం డైరెక్ట్, షార్ట్కట్ మార్గంగా గుర్తింపబడింది.
దాదా భగవాన్ ఎవరు?
దాదా భగవాన్ ఎవరు? అనే విషయాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు.
“మీకు కన్పించేది 'దాదాభగవాన్' కాదు. మీరు చూస్తున్నది ఎ.ఎమ్. పటేలిని. జ్ఞానిపురుషుడనైనా నాలోపల పూర్ణరూపంలో వ్యక్తమైన భగవంతుడు ‘దాదాభగవాన్’. ఆయన చతుర్దశ భువనాలకు ప్రభువు. ఆ దాదాభగవాన్ మీలోను, ప్రతి ఒక్కరిలోను కూడా ఉన్నారు. మీలో అవ్యక్త రూపంలో ఉంటే, ఇక్కడ (ఎ.ఎమ్. పటేల్ దేహంలో) సంపూర్ణంగా అభివ్యక్తమైనాడు. నేను దాదా భగవాన్ కాదు. నాలోపలి దాదాభగవానికి నేను కూడా నమస్కరిస్తాను.
జ్ఞాన (ఆత్మజ్ఞాన) ప్రాప్తికై వర్తమానలింక్
"నేను స్వయంగా సిద్ధులను (ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులను) కొద్దిమందికి ప్రసాదించబోతున్నాను. నేను వెళ్లిపోయిన తర్వాత వాటి అవసరం ఉండదా ? భవిష్యతరాల ప్రజలకు ఈ మార్గం యొక్క అవసరం ఉంటుంది, అవునా?” • దాదాశ్రీ
పరమపూజ్య దాదాశ్రీ గ్రామ గ్రామమూ, దేశవిదేశాలు పర్యటించి ముముక్షువులకు సత్సంగంతోపాటు ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలిగించారు. దానితోపాటు
Page #7
--------------------------------------------------------------------------
________________
సంఘీభావంతో కూడిన ప్రాపంచిక వ్యవహార జ్ఞానాన్ని కూడా తనను కలిసిన వారందరికీ అందించారు. ఆయన తన అవసానదశలో, 1987 చివర్లో తన కార్యాన్ని కొనసాగించే నిమిత్తం డాక్టరు నీరుబెన్ అమీన్ కి సిద్ధులను అనుగ్రహించారు.
పరమపూజ్య దాదాశ్రీ జనవరి 2, 1988న దేహత్యాగం చేసిన తర్వాత డా॥ నీరుబెన్ భారతదేశ గ్రామాలలోనూ, పట్టణాలలోనూ, ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలలోనూ పర్యటిస్తూ దాదా శ్రీ కార్యాన్ని కొనసాగించారు. మార్చి 19, 2006న దేహత్యాగం చేసేవరకు ఆమె అక్రమవిజ్ఞాన్ కి దాదాశ్రీ ప్రతినిధిగా వున్నారు. దేహ త్యాగానికిముందు ఆమె ఆ కార్యభారాన్ని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ కి అప్పగించారు. ఆధునిక కాలంలో ఆత్మానుభూతికి సరళమూ మరియు డైరెక్ట్ మార్గంద్వారా అక్రమ విజ్ఞానాన్ని వ్యాపింపచేయటంలో డా. నీరుబెన్ సాధనం అయి ప్రముఖ పాత్రను పోషించారు. లక్షల కొలది ముముక్షువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. వారు తమ సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా స్వేచ్ఛను, శాంతిని, ఆత్మరమణత యొక్క అనుభూతిని పొందుతున్నారు.
అక్రమ విజ్ఞాన సత్సంగం నిర్వహించే నిమిత్తం జ్ఞాని పురుష్ దాదా శ్రీ పూజ్య నీరుబెన్ అమీన్ సమక్షంలో శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ కి సిద్ధిని ప్రదానం చేశారు. 1988-2006 మధ్యకాలంలో దాదా శ్రీ దిశానిర్దేశానుసారం, డా. నీరుబెన్ అమీన్ నాయకత్వంలో దేశవిదేశాలలో శ్రీ దీపక్ భాయ్ సత్సంగ్ నిర్వహించారు. ఈ అక్రమ విజ్ఞాన్ యొక్క జ్ఞానవిధులు, సత్సండ్లు ఇపుడు పూర్తిస్థాయిలో ఆత్మజ్ఞాని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ మాద్యమం ద్వారా కొనసాగుతున్నాయి.
శాస్త్రాలలోని శక్తివంతమైన పదాలు మోక్షకాంక్షను వృద్ధి చేయటంలో సహకరిస్తూ ఆ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ముముక్షువులందరికీ
ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యం. స్వరూప జ్ఞానం లేకుంటే మోక్షం లేదు. ఈ జ్ఞానం పుస్తకాలలో లభించదు. అది జ్ఞాని హృదయంలో వుంటుంది. కనుక
ఆత్మజ్ఞానాన్ని ప్రత్యక్షజ్ఞాని నుంచి మాత్రమే పొందగలం. అక్రమ విజ్ఞాన్ యొక్క విజ్ఞాన ప్రయోగం ద్వారా ప్రత్యక్ష జ్ఞానినుంచి నేడుకూడ ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఒక జ్యోతి మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు.
Page #8
--------------------------------------------------------------------------
________________
అనువాదకుని విజ్ఞప్తి
అంబాలాల్ ఎమ్. పటేల్ నామధేయులైన జ్ఞానిపురుషుని దాదా శ్రీ లేక దాదా లేక దాదాజీ గా భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ విజ్ఞాన సంబంధమైన మరియు ప్రపంచ వ్యవహార జ్ఞాన సంబంధమైన తన సత్సంగాన్ని యధాతధంగా అనువదించటం సాధ్యం కాదని ఆయన తరచూ చెప్పేవారు. అనువాద క్రమంలో లోతైన, సహేతుకమైన అర్ధం ముముక్షువులకు అందకపోవచ్చు అనికూడా దాదాశ్రీ చెప్పేవారు. గుజరాతీ భాషని నేర్చుకోవటంలోని ప్రాముఖ్యతను ఆయన నొక్కి వక్కాణించేవారు. తద్వారానే దాదాశ్రీ అమూల్యమైన బోధల సంపూర్ణసారాన్ని యధాతధంగా గ్రహించే అవకాశం ఉంటుందని దాదా మాటల సారాంశం.
అయినప్పటికీ దాదాశ్రీ తన బోధలను ఇంగ్లీషు మరియు ఇతర భాషలలోకి అనువదించటానికి, తద్వారా ప్రపంచంలోని యావత్తు ప్రజానీకానికి అందించటానికి తమ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. తనలో ప్రకటితమైన ఈ అక్రమ విజ్ఞానాన్ని ప్రపంచంలోని మానవాళి పొంది తమ బాధలనుంచి విముక్తి పొందాలని, జీవన్ముక్తిని అనుభవించాలని దాదాజీ యొక్క ప్రగాఢమైన వాంఛ. ఈ విజ్ఞానం యొక్క అద్భుతమైన శక్తులను ప్రపంచం గుర్తించి ప్రణమిల్లే రోజు వస్తుందని కూడా దాదాజీ చెప్పారు.
జ్ఞానిపురుషులైన దాదాశ్రీ బోధలను తెలుగుభాష ద్వారా తెలుగు ప్రజలకు అందించటం కోసం చేసిన చిన్న ప్రయత్న ఫలమే ఈ పుస్తకం యొక్క అనువాదం. యధాతధంగా అందించలేకపోయినా సత్సంగ సందేశాన్ని, భావాన్ని ఎటువంటి చెఱుపు లేకుండా అందించడంకోసం ఎంతో శ్రద్ధ వహించటం జరిగింది.
అనంతమైన దాదాజీ జ్ఞాన ఖజానాకి ఇది ప్రాధమిక పరిచయం మాత్రమే. ఈ అనువాదంలో ఏమైన తప్పులు దొర్లివుంటే అవి పూర్తిగా అనువాదకులవే అని గమనించగలరు. వాటినిమిత్తమై మేము మీ క్షమను అర్ధిస్తున్నాము.
Page #9
--------------------------------------------------------------------------
________________
సంపాదకీయం వేలకొలది యాత్రికులు భారతదేశంలోని బదరీనాధ్ మరియు కేదారనాధ్ వెళ్తూ అక్కడ మార్గమధ్యంలో అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా వందలమంది సజీవంగా సమాధి అయ్యారు. ఇటువంటి వార్త విన్నపుడు ఎవరి హృదయమైన ద్రవీభూతమౌతుంది. “ఎంతో భక్తి భావంతో భగవద్దర్శనానికై వెళ్తున్న వారిని భగవంతుడు ఎంత అన్యాయంగా చంపివేశాడు” అనే భావం చాలా మందికి కలుగుతుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని ఇద్దరు సోదరులు పంచుకొనే విషయంలో ఒకనికి ఎక్కువభాగం, రెండవ వానికి తక్కువ భాగం లభిస్తుంది. అపుడు బుద్ది న్యాయం కోసం అర్ధిస్తుంది. ఆ పోరాటం క్రింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. లభించిన వాటిలో అధికభాగం కోర్టు ఖర్చుల నిమిత్తం పోగా వారికి లభించే ఫలం దు:
ఖమే అవుతుంది. నిర్దోషి జైలు శిక్షననుభవింప వలసి వస్తుంది. దోషి సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతాడు. ఇదెక్కడి న్యాయం? నిజాయితీ పరుడు దు:ఖితుడు కాగా, అవినీతి పరుడు భవంతులు నిర్మించి, వాహనాలలో తిరుగుతుంటాడు. ఏ విధంగా ఇది న్యాయం అనిపించుకొంటుంది?
బుద్ది న్యాయానికై ప్రాకులాడటం, ఫలితంగా దుఃఖితుడైన వ్యక్తి మరింత దు:ఖితుడు కావటం, ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. పరమ పూజ్య దాదా శ్రీ అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని కనుగొన్నారు. అది ఏమంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడ అన్యాయం అనేది జరగనే జరగదు. ఏమి జరిగినా న్యాయమే జరుగుతుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా న్యాయాన్ని అధిగమించదు. ఏ ప్రభావానికైనా లోను కావటానికి ప్రకృతి ఒక వ్యక్తిగాని భగవంతుడు గాని కాదు. ప్రకృతి అంటే సైంటిఫిక్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్. ఒక కార్యం పూర్తి అగుటకు ఎన్నో పరిస్థితులు సక్రమముగా (సరియైనవిగా) ఉండాలి. వేల కొద్దీ ఉన్న యాత్రికులలో వారు మాత్రమే ఎందుకు మరణించారు? ఎవరెవరి ప్రారబ్దంలో ఆ విధంగా లిఖించబడివుందో వారు మాత్రమే ఆ దుర్ఘటనకు గురి అయి హిమపాత కారణంగా మృత్యువాత పడ్డారు. ఒక సంఘటనకు దారి తీసే కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక దుర్ఘటనకు దారితీసే కారణాలూ ఎన్నో ఉంటాయి. మన ప్రారబ్దం లేకుండా ఒక దోమ కూడ కుట్టదు. పూర్వ కర్మల ఫలమే ఇప్పటి శిక్ష. అందువల్ల మోక్షాన్ని కాంక్షించేవారు అర్ధం చేసికోవలసిన విషయం ఏమంటే తనకి జరిగినది ఏదైనా న్యాయమే అని.
“ఏది జరిగితే అదే న్యాయం” ఇదే జ్ఞాని యొక్క సూత్రము. ఈ జ్ఞాన సూత్రాన్ని తమ జీవితంలో ఎంతగా అన్వయించుకుంటే అంతగా శాంతి లభిస్తుంది. ప్రత్యేకించి ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడ అంతరంగంలో శాంతికి ఎటువంటి చలనం కలగదు.
డా|| నీరూబెన్ అమీ
Page #10
--------------------------------------------------------------------------
________________
జరిగిందే న్యాయం
విశ్వం యొక్క విశాలత శబ్దాతీతం .... శాస్త్రాలలో జగత్తును గురించి వర్ణించబడినది చాలా స్వల్పం, అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. జగత్తు వాస్తవంలో శబ్దాలలో వర్ణించటానికి, వ్యక్తం చేయటానికి వీలులేనిది. శబ్దాతీతమైన జగత్తును ఏ విధంగా వర్ణించగలరు? నేను స్వయంగా విశ్వవిశాలతను దర్శించాను. గనుక దాని గురించి మీకు చెప్పగలుగుతున్నాను.
ప్రకృతి సదా న్యాయమే
ప్రకృతి యొక్క న్యాయంలో ఇసుమంతైనా అన్యాయం అనేది జరగనే జరగదు. ప్రకృతి సదా న్యాయమే. కోర్టులో అన్యాయం జరిగితే జరగవచ్చును గాక కాని ప్రకృతి న్యాయం చాలా ఖచ్చితంగా వుంటుంది. ప్రకృతి న్యాయం
యొక్క ప్రకృతి ఏమిటి? ఒక నిజాయితీపరుడైన వ్యక్తి అంతకుముందెప్పుడూ ఏ నేరమూ చేయకుండా, ఈ రోజు దొంగతనానికి పాల్పడితే అతను వెంటనే పట్టుబడిపోతాడు. అవినీతి పరుడైన, నేరాలకు అలవాటుపడిన వ్యక్తి నేరానికి పాల్పడితే ప్రకృతి అతనిని స్వేచ్ఛగా వదలి పెడ్తుంది. నిజాయితీ పరుడైన వ్యక్తి నేరస్తునిగా మారటాన్ని ప్రకృతి సమర్ధించదు. అతని నిజాయితీని పవిత్రతను రక్షించే ఉద్దేశ్యంతో అతను మొదటి ప్రయత్నంలోనే పట్టుబడేలా చేస్తుంది. అవినీతిపరుడైన వ్యక్తికి ప్రకృతి సహకరిస్తూనే వుంటుంది. ఒకానొకదశలో ప్రకృతి అతనిని ఎటువంటి దెబ్బ కొడుందంటే అతను తిరిగి ఎప్పటికీ పైకి లేవలేడు, అధోగతికి పోతాడు. ప్రకృతి ఇసుమంతైనా అన్యాయం చేయదు,
Page #11
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీురి
అన్యాయం అనే మాటకి అవకాశమే లేదు. ప్రజలు నన్ను ఇలా అడిగేవారు? "మీ కాలు ఫ్రాక్చరు అయింది కదా దాని విషయం ఏమిటి?" అపుడు నేను చెప్పేవాడిని. "ప్రకృతి న్యాయమే చేసింది”.
TEL
2
ప్రకృతి న్యాయాన్ని అంగీకరించగలిగితే, “జరిగింది ఏదైనా న్యాయమే” అని అర్ధం చేసికోగల్గితే మీరు ముక్తిని పొందుతారు. ప్రకృతి న్యాయాన్ని మీరు ప్రశ్నించినట్లయితే, ప్రకృతి న్యాయాన్ని కొంచెమైనా సందేహించినట్లయితే సమస్యలను, బాధలను ఆహ్వానించినట్లే. 'ప్రకృతి సదా న్యాయమే' అని నమ్మటమే నిజమైన జ్ఞానం. ఉన్నదానిని ఉన్నట్లు గ్రహించటమే జ్ఞానం. ఉన్నదానిని ఉ న్నట్లు స్వీకరించకపోవడమే అజ్ఞానం.
ఒక వ్యక్తి మరొక వ్యక్తి గృహాన్ని తగులబెట్టాడు. ప్రజలు దానిని అన్యాయంగా భావిస్తారు. కాని వాస్తవంలో అది న్యాయమే. ఇల్లు తగలబడిన వ్యక్తి దానికి కారకుడైన వ్యక్తిని దూషిస్తాడు. అతను చేసిన పనిని నేరంగా పరిగణిస్తాడు. అతని పట్ల ఉద్రిక్తుడౌతాడు. ఆ సమయంలో ఒకరు భగవంతుని ఇలా అడుగుతారు. "ఆ వ్యక్తి ఇంకొకని యిల్లు తగలబెట్టడం న్యాయమా? అన్యాయమా?" అపుడు భగవంతుడు ఇలా సమాధానం చెప్తాడు. “ఇల్లు తగులబెట్టటం న్యాయమే". ఏ వ్యక్తి యిల్లు తగులబెట్టబడిందో ఆ వ్యక్తి తగులబెట్టిన వ్యక్తిపట్ల ఉద్రేక పూరితుడై ప్రవర్తించినందుకు, దూషించినంద్కు ఫలితాన్ని అనుభవించవలసి వుంటుంది. ఎందుకంటే ప్రకృతిన్యాయాన్ని అతను అన్యాయంగా పేర్కొన్నాడు, దానికి ఫలం అనుభవించక తప్పదు. ఇల్లు తగులబడటం ఒక దు:ఖం కాగో ప్రకృతి న్యాయాన్ని ప్రశ్నించినంద్కు ఫలితాన్ని అనుభవించటం మరోదు:ఖం. ప్రకృతిలో కించితామాత్రమైనా అన్యాయం జరుగనే జరగదు.
ఈ విశ్వంలో న్యాయంకోసం వెదకకూడదు. అలా న్యాయంకోసం వెదుకుతున్న కారణం గానే, ఈ ప్రపంచంలో కక్షలు, విభేదాలు ఏర్పడుతున్నాయి. జగత్తు న్యాయస్వరూపమే, న్యాయంకోసం వెదకవలసిన పనిలేదు. జరిగిందే న్యాయం. ఏమి జరిగిందో అదే న్యాయం. అలా న్యాయం కోసం అన్వేషించటం వల్లనే ప్రజలు కోర్టులు వగైరాలను ఏర్పాటుచేసికొన్నారు. కాని ఆ కోర్టుల్లో న్యాయం లభిస్తుందని భావించటం తెలివితక్కువతనం. జరిగిన ప్రతిదీ, జరుగుచున్న ప్రతిదీ న్యాయమే. ఏమి జరిగితే దానిని కేవలం చూస్తూండాలి. అదే న్యాయం.
Page #12
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
లౌకిక దృష్టిలో న్యాయం, ప్రకృతిన్యాయం వేరువేరుగా వుంటాయి. ప్రకృతి న్యాయం గత జన్మలో మనం చేసిన కర్మల ఖాతా మీద ఆధారపడివుంటుంది. ఆ ఫలమే ఇపుడు మనకి లభిస్తుంది. కాని ప్రజలు తమ దృష్టికోణం నుంచి చూసి, తమ అభిప్రాయమే న్యాయమన్న భావనతో కోర్టును ఆశ్రయించి తిరిగి తిరిగి అలసిపోతారు. లభించే ఫలం అదే చివరకు. మనం ఒకరిని అవమానిస్తే వాళ్లు కోపంతో ఉద్రేకంతో అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మనల్ని అవమానిస్తారు. మనం దానిని అన్యాయంగా భావిస్తాం. ఎందుకంటే మనం ఒకటే తిట్టాం. కాని అతను మనల్ని పది తిట్టాడు. కాని మన గత జన్మ ఖాతా ఈ విధంగా బాలెన్స్ అయిందని, జరిగింది న్యాయమని గ్రహించాలి. మీరు ఒక స్నేహితుని తండ్రికి కొంత ధనం అప్పుగా యిచ్చారనుకోండి. ఆ మొత్తాన్ని మీ స్నేహితుని నుంచి వసూలు చేయకుండా ఉంటారా అవకాశం ఉంటే? మీ స్నేహితుడు దానిని అన్యాయంగా భావిస్తే భావించవచ్చు. అలాగే ప్రకృతి కూడ. గత(జన్మల) ఖాతా యొక్క పూర్తి ఆధారాలతో ప్రకృతి న్యాయమే చేస్తుంది.
ఒక భార్య భర్తను వేధిస్తూ ఉందనుకోండి అయినప్పటికీ ప్రకృతి న్యాయమే. భార్యమంచిది కాదని భర్త భావించవచ్చుగాక!. భర్త మంచివాడు కాదని భార్య భావించెను గాక! కాని వర్తమానంలో పరిస్థితి అంతా ప్రకృతి న్యాయమే.
దాదాశ్రీ : నీవు ఏదైనా ఫిర్యాదుతో నా దగ్గరకి వచ్చావనుకో. నీ ఫిర్యాదును నేను వినను. దానికి కారణం ఏమిటి? ప్రశ్నకర్త : ఇపుడు అర్ధమైంది ఎందుకంటే జరిగిందే న్యాయం కనుక.
చిక్కులను వరిష్కరిస్తుంది ప్రకృతి దాదాత్రీ : “బాధపడేవానిదే తప్పు”, “ఎవరితోనూ ఘర్షణ పడవద్దు”, “ఎక్కడైనా సర్దుకొనిపోవాలి”, “జరిగిందే న్యాయం” ఇవన్నీ నా అన్వేషణలు. ఈ అన్వేషణ ఎంతో అద్భుతమైనది కదా!
ప్రకృతి నియమం ఏమంటే ఏ విధంగా దారం చుట్టబడిందో అదే మార్గంలో వెనక్కు తిప్పి ఆ దారాన్ని వేరుచేయటం. అన్యాయానికి అన్యాయమే పరిష్కారం. న్యాయానికి న్యాయమే పరిష్కారం. చేసే పని అన్యాయమార్గంలో చేసి
Page #13
--------------------------------------------------------------------------
________________
జరిగింద న్యాజీురి
ఫలితం లభించేటపుడు న్యాయం కావాలంటే ఎలా? దానికై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏమి లాభం? నీకు లభించినది ఏదైనా దానికి నీవే బాధ్యుడవు. ఒక సంఖ్యను వేరొక అంకెతో గుణించామనుకోండి. మరల తిరిగి మొదటి సంఖ్యను పొందాలంటే గుణించగా వచ్చిన సంఖ్యను ఏ అంకెతో అయితే గుణించామో దానితోనే భాగించాలి కదా! అపుడే మొదటి సంఖ్య లభిస్తుంది. నేను చెప్పినది అర్ధం చేసికోగలిగితే ఏ విషయమైనా ఎలా ఏర్పడిందో అలాగే విడిపోతుందని గ్రహిస్తావు.
4
ప్రశ్నకర్త : అవును. మీ మాటలు ఏ వ్యక్తినైనా క్లిష్ట సమయంలో సమాధానపరుస్తాయి. ఆ వ్యక్తి ఆ మాటలను అర్ధంచేసికోగలిగితే అతని పని పూర్తి అయినట్లే.
దాదాశ్రీ : అవును. అతను తన వ్యక్తిగత ప్రయోజనంకోసం అతి తెలివిని ప్రదర్శించనంతకాలం అతని పని సజావుగా సాగుతుంది.
ప్రశ్నకర్త : నేను నిత్య జీవితంలో “జరిగిందే న్యాయం”, “బాధపడే వానిదే తప్పు”. ఈ రెండు సూత్రాలను అన్వయించుకొంటున్నాను.
:
దాదాశ్రీ : న్యాయం కోసం వెదకవద్దు. దీనిని జీవితంలో అమలు పరచగలిగితే ఏ ఉద్వేగాలూ ఉండవు. న్యాయంకోసం అన్వేషించటంవల్లనే సమస్యలు తలెత్తుతాయి.
హంతకుడు అతను గత జన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలంగా నిర్దోషిగా బయటపడవచ్చు.
ప్రశ్నకర్త :ఒక వ్యక్తి ఎవరినైనా హత్యచేస్తే అది న్యాయమనిపించు కొంటుందా? దాదాశ్రీ : న్యాయానికి భిన్నంగా ఏమీ జరగదు. భగవంతుని పరిభాషలో అది న్యాయమే కాని అది మానవుల పరిభాషలో న్యాయంకాదు, చట్ట పరిధిలోనూ అది న్యాయం కాదు. చట్టపరిధిలో హత్యచేసిన వ్యక్తి దోషిగానే పరిగణింపబడతాడు. కాని భగవంతుని భాషలో హత్యచేయబడిన వాడే దోషి హత్యచేసిన వ్యక్తి అతని పాపకర్మ పరిపాకం అయినపుడు పట్టుబడతాడు. అపుడే అతడు దోషిగా లెక్కింపబడతాడు.
ప్రశ్నకర్త : ఒక హంతకుడు కోర్టులో నిర్దోషిగా పరిగణింపబడి విడుదల
Page #14
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
అయితే ఆ వ్యక్తి అతని పూర్వపు కర్మకు ప్రతీకారం తీర్చుకొన్నట్లా? లేక గతజన్మలో చేసిన పుణ్యకర్మల ఫలంగా నిర్దోషిగా విడుదల అయినట్లా?
దాదా: పూర్వపు కర్మకు ప్రతీకారం చేయటం, పుణ్యం రెండూ ఒకటే. అతని పుణ్యఫలంగానే నేరం నుంచి విముక్తి పొందాడు. గత జన్మయొక్క పాపకర్మల ఫలంగా జైలు పాలు అవుతాడు ఒక వ్యక్తి, అతను ఏ నేరమూ చేయకపోయినప్పటికీ, ఎవరూ కర్మఫలాన్ని తప్పించుకోలేరు.
మానవ నిర్మితమైన చట్టపరిధిలో అన్యాయం జరిగితే జరగవచ్చు కానీ ప్రకృతి మాత్రం ఎపుడూ అన్యాయం చేయదు. ప్రకృతి న్యాయ పరిధిని దాటి ఎప్పటికీ పోదు. ప్రకృతిలో ఒక తుఫాను సంభవించనీ, రెండు సంభవించనీ అది న్యాయమే అవుతుంది.
ప్రశ్నకర్త : అయితే మన చుట్టూ మనం చూస్తున్న వినాశమంతా మన శ్రేయస్సు కోసమేనా ?
దాదాశ్రీ : వినాశనాన్ని ఏ విధంగా శ్రేయస్సు అనగలం? కాని వినాశం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రకృతి వినాశం చేయవచ్చు. అది నిజమే. ప్రకృతి పోషణ కూడ చేస్తుంది అదీ నిజమే. ప్రకృతి ఒక పద్ధతి ప్రకారం నియంత్రణ చేస్తుంది. ప్రకృతి చేసే ప్రతికార్యం చాలా స్వచ్ఛమైనది.
కానీ మనిషి తన స్వార్ధంతో ఫిర్యాదు చేస్తాడు. వాతావరణం కారణంగా ఒక రైతు ఫలసాయం నాశనం కావచ్చు. ఇంకొక రైతుకి అదే వాతావరణం లాభకారి కావచ్చు. తత్కారణంగా అతను మంచి ఫలసాయాన్ని పొందవచ్చు. అంటే మనుషులు తమతమ స్వార్ధం కోసమే రోదిస్తుంటారు.
ప్రశ్నకర్త : ప్రకృతి సదా న్యాయమే అని మీరు చెప్తున్నారు. అయితే ఎంద్కు ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు? ఎంద్కు ఇన్ని భూకంపాలు, వరదలు, తుఫానులు వస్తున్నాయి?
దాదాశ్రీ : అంతా న్యాయమే జరుగుతుంది. వర్షం వస్తేనే కదా పంటలు పండేది. భూకంపాలు రావటం కూడ ప్రకృతి నియమం ప్రకారం న్యాయమే.
ప్రశ్నకర్త : అది ఏ విధంగా?
Page #15
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
దాదాత్రీ : ప్రకృతి దోషులనే శిక్షిస్తుంది గాని వేరే ఎవరినీ కాదు. జరిగే వినాశంలో దోషులే పట్టుబడతారు. ఈ ప్రపంచంలో ఎపుడూ ప్రకృతి న్యాయం కించిత్ మాత్రం కూడ డిస్టర్బ్ కాదు. ప్రకృతి ఒక సెకను కూడ న్యాయాన్ని అధిగమించదు.
పాములు, దొంగలూ ప్రపంచంలో అవసరమా?
ప్రపంచంలో దొంగలు, జేబు దొంగతనాలు వీటి అవసరం ఉందా అని ప్రజలు నన్ను అడుగుతుంటారు. అందుకే భగవంతుడు వారికి జన్మను ప్రసాదించి ఉంటాడు. వాళ్ళు లేకపోతే ప్రజల జేబులు ఎవరు ఖాళీ చేస్తారు.? ఆపని చేయటానికి భగవంతుడే స్వయంగా వస్తాడా? ప్రజలు అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని, నల్లధనాన్ని ఎవరు తీసికొని వెళ్ళాలి? ఆ దొంగలు నిమిత్త మాత్రులు. వారు అవసరమే.
ప్రశ్నకర్త : ఒకొక్కరి కష్టార్జితమైన ధనం కూడ దొంగిలించబడుంది
కదా!
దాదాశ్రీ : ఈ జన్మలో ఆ ధనం కష్టార్జితమే, కాని గత జన్మ ఖాతా కూడ ఉంటుంది కదా! అతని పెండింగ్ ఖాతాలు ఉండి ఉంటాయి. అటువంటి ఖాతాలు లేకుండా అతని సొమ్మును ఎవరూ తీసికొని పోలేరు. అలా తీసికొని వెళ్ళే శక్తి ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తీసికొని వెళ్తే అది అతని పూర్వపు ఖాతా ప్రకారమే. ఎవరికైనా హాని చేయగల సమర్ధత ఉన్న వ్యక్తి ఎవరూ ఈ ప్రపంచంలో పుట్టలేదు. ప్రకృతి దానిని చాలా బాగా నియంత్రిస్తుంది. అంతా నియమ బద్ధంగా జరుగుతుంది ప్రపంచంలో. మైదానాన్ని మొత్తం పాములతో నింపినా సరే ఒక పాము కూడ నిన్ను తాకదు నీ పూర్వపు ఖాతాలో లేకుంటే. ప్రపంచం అంతా లెక్క ప్రకారమే, నియమబద్దంగానే వుంటుంది. ప్రపంచం చాల సుందరమైనది. అది న్యాయ స్వరూపం. ప్రజలు దానిని గ్రహించలేరు.
పరిణామాన్ని బట్టి కారణాన్ని నిర్ణయించవచ్చు. ఇదంతా పరిణామమే, పరీక్షా ఫలితాలను పోలినదే. మీకు గణితంలో
Page #16
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
95%, ఆంగ్లంలో 25% మార్కులు వస్తే, అపుడు పొరపాటు ఎక్కడ జరిగిందో మీకు తెలియదా? అదే విధంగా జీవితంలో మన పొరపాటు ఎక్కడ వుందో, కారణం ఏమిటో పరిణామాన్ని లేక ఫలితాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఫలితం కారణాన్ని ప్రతిబింబింపచేస్తుంది. కొన్ని పరిస్థితుల కలయిక కారణంగానే ఏదైనా లభిస్తుంది. ఆ పరిణామం ఆధారంగానే కారణం ఏమిటో తెలుస్తుంది.
బాగా జన సంచారం ఉన్న రహదారిలో ఒక ముల్లు నిలువుగా పడివుంది. జనం వస్తూ పోతూనే ఉన్నారు. కాని ఆ ముల్లు అలాగే వుంది, ఎవరికీ గ్రుచ్చుకోలేదు. ఒకరోజు “దొంగ, దొంగ,” అని ఎవరో అరవటం విని బూటు గాని, చెప్పులు గాని వేసికోకుండా బయటకు పరుగుపెట్టారు. అనుకోకుండా మీ పాదం ముల్లు మీదపడి మీకు గుచ్చుకుంది. అది అలా జరగాలని మీ ఖాతాలో వుంది కాబట్టే జరిగింది. అది వ్యవస్థితమై వుంది అంటే నిర్ణయించబడివుంది (సైంటిఫిక్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్). అందువల్లనే అన్ని పరిస్థితులూ కలిసి ఆ సంఘటనకు దారి తీసాయి. ఆ పరిస్థితుల కూడికకు కారణం వ్యవస్థిత శక్తి. ఎవరో దొంగ దొంగ అని అరవటం, ఎపుడూలేని విధంగా చెప్పులు వేసికోకుండా మీరు పరుగెత్తటం, ఎప్పటినుంచో అక్కడ పడివున్న ముల్లు ఎవరికీ గ్రుచ్చుకోకుండా మీకు గ్రుచ్చుకోవటం అంతా మీ ప్రారబ్దం .
చట్టం అంతా ప్రకృతిదే బొంబాయి పట్టణంలో బంగారు గొలుసుతో కూడిన మీ గడియారాన్ని పోగొట్టుకొన్నారు. అది మీకు తిరిగి దొరికే అవకాశం లేదని నిరాశతో యింటికి వచ్చారు. కానీ రెండు రోజుల తర్వాత పోగొట్టుకొన్న గడియారాన్ని గురించిన ప్రకటనను మీరు పేపరులో చూశారు. ఆ వస్తువుకు సంబంధించిన ఆధారాలను చూపించి ఆ గడియారం తనదే అని నిరూపించుకొని, ప్రకటన ఖర్చులను చెల్లించి, యజమాని దానిని తీసికెళ్ళవచ్చునని ఆ ప్రకటనలో వుంది. ప్రకృతి నియమం ప్రకారం ఆ గడియారం మీకు తిరిగి దొరకాలని మీ ఖాతాలో వుంటే దానిని ఎవరూ ఆపలేరు. జరగవలసిన దానిని ఒక సెకనుకాలం కూడ ఎవరూ మార్చలేరు. ప్రపంచం అంత నియమబద్ధమైనది. ప్రకృతి అంతా నియమబద్దంగానే
Page #17
--------------------------------------------------------------------------
________________
Co
జరిగింది న్యాజీరి
వుంటుంది. మానవ నిర్మితమైన చట్టాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానం జరిమానా విధిస్తుంది. ప్రకృతి నియమాలను ఎప్పుడూ మనం ఉల్లంఘించకూడదు.
అంతా మీ స్వయం కృతమే అంతా మీ స్వయం కృతమే మరి ఇతరులను నిందించటం దేనికి?
ప్రశ్నకర్త : ఇది మన క్రియలకు ప్రతిక్రియా?
దాదాత్రీ : దీనిని ప్రతిక్రియ అనరు. కానీ దీని ప్రాజెక్షన్ అంతా మీదే. దీనిని మీరు ప్రతిక్రియ అంటే అపుడు యాక్షన్ మరియు రియాక్షన్ రెండూ సమానంగా, వ్యతిరేకంగా ఉండాలి. దీనికి పూర్తి బాధ్యత మీదే ఎవరి ప్రమేయమూ లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. అపుడు ఎంత జాగ్రత్తగా వుండాలో తెలుస్తుంది. పూర్తి బాధ్యత మీ భుజస్కందాల పైనే వుందని అర్ధమవుతుంది. దీనిని గ్రహించిన తర్వాత ఇంట్లో మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది?
ప్రశ్నకర్త : ఆ ప్రకారమే ప్రవర్తించవలసి వుంటుంది.
దాదాశ్రీ : వ్యక్తి తన బాధ్యతను తాను గుర్తించాలి. కొంతమంది భగవంతుని ప్రార్ధించటం ద్వారా కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. ఎంత
భ్రమ! ప్రజలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి భగవంతుని పేరు వాడుకొంటారు. మీ ప్రతి చర్యకు పూర్తి బాధ్యత మీదే, యు ఆర్ సూల్ & సోల్ రెస్పాన్సిబుల్. దాని సృష్టికర్తలు మీరే కదా.
ఎవరైనా మీ మనసుని గాయపరిస్తే లేక మీకు దు:ఖాన్ని కల్గిస్తే దానిని మీరు అంగీకరించి మీ ఖాతాలో జమచేసికోవాలి. కారణం లేకుండా ఒకరు ఇంకొకరికి దు:ఖాన్ని కల్గించలేరు. దాని వెనుక తప్పక కారణం ఉండి తీరాలి. అందువల్ల మనకి ఏదైనా జరిగితే దానిని మన ఖాతాలో జమవేసికోవాలి.
సంసారం నుంచి విముక్తి పొందాలంటే ఎపుడైనా కూరలో ఉప్పు ఎక్కువైతే అది కూడ న్యాయమే!
ప్రశ్నకర్త : ఏది జరిగినా దానిని చూస్తుండమని మీరు చెప్పారు. ఇంక అలాంటప్పుడు న్యాయం కోసం ప్రాకులాడే అవసరం ఏముంది?
Page #18
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
దాదాశ్రీ : న్యాయం గురించి ఇంకొక విధంగా వివరిస్తాను వినండి. నాకు గ్లాసుతో మంచి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చేతులకు కిరోసిన్ అంటి వుంటుంది. నేను ఆ నీళ్ళు త్రాగబోతే నాకు కిరోసిన్ వాసన వచ్చింది. అపుడు నేను జ్ఞాత, ద్రష్టగా ఉండిపోయాను. ఇలా నాకెంద్కు జరిగింది దాని వెనుక కారణం ఏమిటి? ఇంతకు ముందెపుడు ఇలా జరుగలేదు. ఈ రోజు ఎంద్కు జరిగింది? అది నా ఖాతా ప్రకారమే జరిగి ఉంటుందని నిశ్చయానికి వచ్చాను. నా
ఖాతాలో జమచేసికొన్నాను. కాని ఆ విషయం ఎవరికీ తెలియని విధంగా జమచేసికోవాలి. అదే ఘటన మరల మరునాడు జరిగితే ఎటువంటి వివాదానికి చోటుయివ్వకుండా ఆ నీరు త్రాగేవాడిని. ఒక అజ్ఞానికి ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏమి చేస్తాడు?
ప్రశ్నకర్త : పెద్దగా అరచి, గొడవను సృష్టించి వుండేవాడు. దాదాశ్రీ : అపుడు ఇంట్లోని వారందరికీ యజమాని త్రాగే నీళ్ళలో కిరోసిన్ కల్సిందని తెల్సి వుండేది.
ప్రశ్నకర్త : యిల్లంతా ఘర్షణ చెలరేగేది.
దాదాశ్రీ : ఇంట్లో వాళ్ళందర్నీ తన అరుపులతో పిచ్చెక్కించి వుండేవాడు. పాపం అతని భార్య ఈ రోజు టీలో చక్కెర వేయటం కూడ మర్చిపోయింది. ఇంట్లో ఏ కారణంగానైనా గొడవ జరిగి వత్తిడి పెరిగితే ఇంక ఆ రోజు పనులన్నీ మనసు వికలం అయిన కారణంగా, అలాగే జరుగుతాయి.
ప్రశ్నకర్త : దాదా! ఇటువంటి సంఘటన జరిగినపుడు ఇంట్లో వాళ్ళకి ఫిర్యాదు చేయకపోవటం సబబే. కాని ఇంట్లో వాళ్ళకి నీళ్లలో కిరోసిన్ కల్సిందని చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? భవిష్యత్తులో అలా జరగకుండా వాళు , జాగ్రత్త పడాలి కదా!
దాదాత్రీ : వాళ్ళకి నీవు ఎపుడు చెప్పాలి? అందరూ మంచి మూడ్ లో వున్నపుడు ఫలహారం, టీ తీసికొంటున్నపుడు సీరియస్ గా కాకుండా సరదాగా నవ్వుతూ చెప్పాలి.
ప్రశ్నకర్త : అంటే ఎదుటి మనిషికి బాధ కల్గకుండా చెప్పాలనే కదా అర్ధం.
Page #19
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
దాదాశ్రీ : అవును. ఆ విధంగా చెప్పటం వల్ల ఎదుటివ్యక్తికి మేలు కల్గుతుంది. అన్నింటికంటె ఉత్తమం ఏమంటే అసలు ఏమీ చెప్పకుండా ఉ ండటం. దానికంటె మంచి పని ఇంకొకటి లేదు. ఎవరైతే విముక్తి పొందాలనుకొంటారో వారు ఏ చిన్న ఫిర్యాదు కూడ చేయకూడదు.
ప్రశ్నకర్త : సలహా రూపంలో కూడ చెప్పకూడదా? మౌనంగా వుండి పోవాలా?
దాదాత్రీ : వాళ్ళు తమతో పాటు తమ స్వంత ఖాతాను తెచ్చుకున్నారు. దానితోపాటు తమ తెలివితేటల్ని కూడ తెచ్చుకున్నారు. నేను చెప్పేది ఏమంటే సంసారం నుంచి విముక్తి పొందదల్చుకొంటే మౌనమే మార్గం. రాత్రి పారిపోదల్చు కొంటే ఆ సమయంలో నువ్వు పెద్దగా అరిస్తే, నీవు పట్టుబడిపోతావు కదా.
భగవంతుని స్థానం ఏమిటి? భగవంతుడు న్యాయ స్వరూపుడు కాదు, అన్యాయ స్వరూపుడు కూడ కాదు. ఏ ప్రాణికీ కూడ దు:ఖం కళాకూడదు అనేదే భగవంతుని భాష. న్యాయా న్యాయాలు మానవపరిభాషలోనివి.
దొంగ దొంగతనాన్ని ధర్మంగా భావిస్తాడు. దాత దానం చేయటం ధర్మంగా భావిస్తాడు. ఇది లోక భాష, భగవంతుని భాష కాదు. ఇటువంటివి ఏమీ భగవంతుని వద్ద లేవు. దైవ లోకంలో ఉన్నది ఇంతమాత్రమే “ఏ జీవికీ దు:ఖాన్ని కల్గించకూడదు. ఇదే మా ఆజ్ఞ”.
న్యాయాన్యాయాలు నిర్ణయించేది ప్రకృతి. ప్రపంచంలో మానవులచే నిర్ణయించబడే న్యాయాన్యాయాలు ఖచ్చితంగా ఉండకపోవచ్చు. దోషిని స్వేచ్ఛగా విడుదల చేయవచ్చు. నిర్దోషిని శిక్షించవచ్చు. కాని ప్రకృతి న్యాయాన్ని ఎవరూ తప్పించుకోలేరు. దానిని ఎవరూ ప్రభావితం చేయలేరు. మనలోని దోషాలే ప్రవంచాన్ని మనకి అన్యాయంగా చూపిస్తాయి.
కేవలం మనలోని దోషాల కారణంగానే మనకు ప్రపంచం అంతా అన్యాయంగా కన్పిస్తుంది. కాని అన్యాయం అణుమాత్రం కూడ జరగదు. పూర్తిగా న్యాయమే జరుగుతుంది. న్యాయస్థానాల్లోని న్యాయంలో తేడాలు ఉ
Page #20
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
ండవచ్చు. ఎందుకంటే అది సాక్ష్యాలమీద ఆధారపడివుంటుంది. ఆ న్యాయాన్ని తప్పని నిరూపించే అవకాశం కూడ ఉంటుంది. కాని ప్రకృతి న్యాయం స్థిరమైనది దానిలో ఏ తేడా ఉండదు.
ప్రశ్నకర్త : అయితే కోర్టు న్యాయమూ ప్రకృతి న్యాయమూ ఒకటే
కాదా?
దాదాత్రీ : అది అంతా ప్రకృతిదే. కాని కోర్టు తీర్పులో ఈ జడ్జి ఇలా చేశాడు అనే భావన మనకి కల్గుతుంది. కాని ప్రకృతి విషయంలో మనకి అటువంటి భావన కళాదు. ఈ భేదాలను సృష్టించేది బుద్ధి మాత్రమే.
ప్రశ్నకర్త : మీరు ప్రకృతి న్యాయాన్ని కంప్యూటర్ తో పోల్చారు కాని కంప్యూటర్ మెకానికల్ కదా!
దాదాశ్రీ : ప్రకృతి న్యాయాన్ని వివరించటానికి సమానమైన వేరే సాధనం ఏమీ లేదు. అందుకే ఆ విధంగా పోలిక చెప్పాను. కంప్యూటర్ లో డేటా ఎలా ఫీడ్ అవుతుందో అలాగే మన అంతరంగంలోని భావాలు కూడ ఫీడ్ అవుతాయి.
ఈ జీవితకాలంలో ఒక వ్యక్తికి ఏఏ భావాలు అంతరంగంలో కల్గుతాయో ఆ భావాలు అతని భవిష్య జన్మకి కర్మను సృష్టిస్తాయి. దీనిని విత్తనాలు నాటడంతో కూడ పోల్చవచ్చు. అనగా ఈ జన్మలో అతను విత్తనాలు నాటుతున్నాడు అవి అతనికి వచ్చే జన్మలో ఫలాలను అందిస్తాయి. అతని అనుభవంలోకి వస్తాయి. అందువల్ల ఒక వ్యక్తికి ఈ జన్మలో కలిగే అనుభవాలు అన్నీ అతని గత జన్మ కర్మఫలాలు, అనగా గత జన్మకర్మల విసర్జన. ఈ విసర్జన వ్యవస్థిత్ (విధి) అధీనంలో వుంటుంది. అది ఎపుడూ న్యాయమే చేస్తుంది. ప్రకృతి న్యాయాన్ని వ్యవస్థిత్ (విధి) అమలు చేస్తుంది. ఒక తండ్రి తన కొడుకును చంపితే అది ప్రకృతి న్యాయమే. ఆ తండ్రి, కొడుకుల మధ్య గత ఖాతాలు ఏమి ఉన్నాయో అవిపూర్తి అవుతున్నాయి. ఆ అప్పు ఈ జన్మలో తిరిగి చెల్లించబడిందన్నమాట.
ఒక పేదవాడు లాటరీలో ఒక లక్ష రూపాయలు గెల్చుకున్నాడనుకోండి. అదీ న్యాయమే. ఎవరి జేబు అయినా కత్తిరించబడితే అది న్యాయమే.
Page #21
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
ప్రకృతి న్యాయానికి ఆధారం ఏమిటి? ప్రశ్నకర్త : ప్రకృతి న్యాయ స్వరూపమే అనటానికి ఆధారం ఏమిటి? న్యాయమే అని చెప్పటానికి ఒక ఆధారం ఉండాలి కదా!
దాదాశ్రీ : అది న్యాయమే. ఇది చాలు నీకు తెలియటానికి. ప్రకృతిది న్యాయమే అని నీకు విశ్వాసం కల్గించవచ్చు. కాని మిగిలిన ప్రజలు ప్రకృతి సదా న్యాయస్వరూపమే అని విశ్వసించరు. దానికి కారణం వారికి జ్ఞానదృష్టి లేకపోవటమే.
ప్రపంచము న్యాయ స్వరూపమే. అందులో అణుమాత్రమైనా సందేహం లేదు. పరిపూర్ణమైన న్యాయ స్వరూపము.
ప్రకృతిలో రెండు పదార్థాలు ఉన్నాయి. ఒక భాగం శాశ్వతం, సనాతనమైనది. రెండవది అశాశ్వతమైనది, మార్పుకు గురి అయ్యేది. ప్రకృతి నియమానుసారం అశాశ్వత వస్తువు యొక్క అవస్థ మారుతూనే ఉంటుంది. ఆ మార్పును దర్శించే వ్యక్తి తన వ్యక్తిగత బుద్ధితో దర్శిస్తాడు. అనేకాంతిక బుద్ధితో ఎవరూ ఆలోచించరు కేవలం తమ స్వార్ధంతోనే చూస్తారు.
ఒక వ్యక్తి యొక్క ఒక్కగానొక కుమారుడు మరణిస్తే అది న్యాయమే. ఇందులో ఎవరూ అన్యాయం చేయలేదు. భగవంతుడు గాని, ఇతరులెవ్వరు గాని అన్యాయం చేయలేదు. అది న్యాయమే. అందుకే జగత్తు న్యాయస్వరూపమే అని చెప్తున్నాను. నిరంతరం న్యాయస్వరూపమే.
ఎవరికైనా ఒక్కగానొక్క కుమారుడు మరణిస్తే ఆ కుటుంబసభ్యులు మాత్రమే దు:ఖితులౌతారు. వారి ఇరుగుపొరుగు వారు ఎంద్కు దు:ఖించరు? కుటుంబసభ్యులు తమ స్వార్ధం కారణంగా దు:ఖిస్తారు. ఆ సంఘటనను సనాతనతత్వంలో (ఆత్మ దృష్టితో) దర్శించగలిగితే ప్రకృతిది న్యాయమే.
నేను చెప్పిన విషయం చెప్పినట్లు అర్ధం చేసికొన్నావా! అర్ధం చేసికొంటే వాస్తవాన్ని గ్రహించు.
జ్ఞానాన్ని జీవితంలో ఎంతగా అన్వయించుకొంటే దు:ఖం అంతగా తగ్గిపోతుంది. ఒక్క సెకను కాలం కూడ న్యాయంలో తేడా రాదు. ఒకవేళ ప్రకృతి అన్యాయ స్వరూపమే అయితే ఒక్కరు కూడ ముక్తిని పొందలేరు.
Page #22
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజురి
13
మంచివారు కూడ ఎందుకు కష్టాల పాలవుతుంటారు అని కొంతమంది అడుగుతారు. వాస్తవానికి ఎవరూ వారి కష్టాలకు కారణం కాదు. ఏ విషయంలోనూ మనం జోక్యం చేసికోనంత వరకు ఎవరూ మన విషయంలో జోక్యం చేసికోరు. అటువంటి శక్తి ఎవరికీ లేదు. మన జోక్యం వల్లనే సమస్యలు అన్నీ తలెత్తుతున్నాయి.
ప్రాక్టికల్ గా ఉండాలి. “జరిగిందే న్యాయం” అని శాస్త్రకారులు చెప్పరు. వారు లౌకిక న్యాయాన్ని మాత్రమే న్యాయంగా పేర్కొంటారు. న్యాయస్థానం చెప్పిన న్యాయమే న్యాయం శాస్త్రకారుల దృష్టిలో. ఇది ధియొరెటికల్ మాత్రమే ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే “ఏది జరిగితే అదే న్యాయం”. ప్రాక్టికల్ కాకుండా ఈ ప్రపంచంలో ఏ పనీ జరగదు. కేవలం థియరీ వల్ల ప్రయోజనం లేదు. “ఏది జరిగితే అదే న్యాయం” అన్న దానిని తెలుసుకొన్నందువల్ల ప్రయోజనం లేదు, దానిని నిజజీవితంలో అన్వయించుకోవాలి.
అందువల్లనే జరిగింది ఏదైనా న్యాయమే. నిర్వకల్పస్థితిలో వుండాలంటే ఏది జరిగితే దానిని స్వీకరించాలి. అంటే భగవంతునిగా నువ్వు ఉండాలంటే “జరిగిందే న్యాయం”, లేదు లక్ష్యరహితంగా తిరగాలనుకుంటే న్యాయంకోసం వెదుకు.
లోఖని బాథించే నష్యాలు. ఈ జగత్తు మిధ్య కాదు. జగత్తు న్యాయ స్వరూపం. ప్రకృతి ఎప్పుడూ అన్యాయాన్ని జరగనివ్వదు. ప్రకృతి కారణంగా మనుషులు చనిపోయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా అది అంతా న్యాయమే. ప్రకృతి ఎప్పుడూ న్యాయ పరిధిని దాటదు. అజ్ఞాన కారణంగా ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించలేరు. జీవితాన్ని అనుభవించే కళ మనుష్యులకు తెలియదు. అందువల్లనే వారికి జీవితంలో చింత తప్ప మరేమి ఉండదు. జరిగినది ఏమైనా సరే అదే న్యాయం అని స్వీకరించటం నేర్చుకోవాలి.
నువ్వు ఒక దుకాణంలో ఐదు రూపాయల విలువగల వస్తువుకొని దుకాణ దారునికి వందరూపాయల నోటు యిచ్చావు. కస్టమర్స్ రద్దీవల్ల అతను నీకు ఐదురూపాయలు మాత్రమే యిచ్చి, మిగిలిన తొంభై రూపాయలు యివ్వటం
Page #23
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
మర్చిపోయాడు. వర్తకుని వద్ద చాలా వందనోట్లు వున్నాయి. చాలా పదిరూపాయల నోట్లు ఉన్నాయి. అపుడు నువ్వు ఏమిచేస్తావు? “నేను నీకు వందనోటు యిచ్చాను.
ఇంకా తొంభై రూపాయలు నాకు రావాలి” అని అడుగుతావు. అతను 'లేదు నాకు నువ్వు పదిరూపాయల నోటే యిచ్చావు' అంటాడు. అతను అబద్ధం చెప్పలేదు. అతనికి అలాగే గుర్తు వుంది. అపుడు ఏం చేస్తావ్?
ప్రశ్నకర్త : మనసులో అంతడబ్బు పోయిందే అని బాధ ఉంటుంది కదా! అది విచలితమౌతుంది.
దాదాశ్రీ : బాధపడేది మనస్సు, దానికి నిద్రరాదు. నీ నిజస్వరూపానికి దానితో ఏమిపని? నీలోపల ఉన్న లోభబుద్దిగల మనస్సు బాధపడుంది.
అందువల్లనే దానికి నిద్రరాదు. అపుడు దానికి ఇలా చెప్పాలి. “నిన్ను నష్టం బాధించినా నువ్వు నిద్రపోవాలి.” అపుడు రాత్రంతా అది నిద్రపోతుంది.
ప్రశ్నకర్త : అతనికి డబ్బులు పోయాయి? నిద్రా చెడింది కదా!
దాదాశ్రీ : అవును. అందుకే “జరిగిందే న్యాయం” అన్న జ్ఞానం అనుభవంలోకి వస్తే మనకి సుఖము, శాంతి దొరుకుతాయి. దీనిని (జరిగిందే న్యాయం) అర్ధంచేసికొని, అంగీకరిస్తే సంసారసాగరాన్ని సులభంగా దాటవచ్చు. ప్రపంచంలో ఒక్క సెకనుకాలం కూడ అన్యాయం అనేది జరగనే జరగదు. న్యాయం మాత్రమే జరుగుతుంది సదా! కాని “ఇది ఎలా న్యాయం”? అని ప్రకృతి న్యాయాన్ని బుద్ధి ప్రశ్నిస్తుంది. దానితో సమస్యలు మొదలౌతాయి. బుద్ధిపరిధి చాలా చిన్నది. బుద్ధిని అతిక్రమించాలి, లేకుంటే బంధాల్లో చిక్కుకొంటాం. ఒక్కసారి ప్రకృతి నియమాన్ని మనం అర్ధంచేసికొంటే, బుద్ధిచెప్పే దానిని మనం పట్టించుకోం. చట్టం పరిధిలో పొరపాట్లు జరగవచ్చు కానీ ప్రకృతి న్యాయంలో అలాంటి అవకాశమే లేదు. బుద్ధి నుంచి మనం వేరుగా ఉండడం నేర్చుకోవాలి. మన పాతఖాతా బాలెన్స్ ఏదో ఉండి ఉంటుంది అది ఈ విధంగా సెటిల్ అయింది అని గ్రహించాలి.
ఆస్తి వంవకంలో అనమానత - అదే న్యాయం
తండ్రి మరణానంతరం, ఆయన నల్గురు కుమారుల మధ్య భూమి
Page #24
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
పంపకంలో వివాదంతలెత్తింది. తండ్రి తదనంతరం ఆస్తి పెద్దకుమారుని హస్తగతం అయింది. అతను ఆస్తిని పంచటానికి యిష్టపడలేదు. నల్గురు అన్నదమ్ములకు ఆస్తిపంపకం సమానంగా జరగాలి. అలా జరిగితే ఒక్కొక్కరికి 50 ఎకరాల భూమి వస్తుంది. అలా జరగలేదు. ఒకరికి 25 ఎకరాలు, ఇంకొకరికి 50 ఎకరాలు, మరొకరికి 40 ఎకరాలు, మిగిలిన వానికి 5 ఎకరాలు మాత్రమే వచ్చింది.
అపుడు ఎవరైనా ఏమనుకొంటారు? లోకులు ఏమంటారు? పెద్దవాడు మోసగాడు, దగాకోరు అంటారు. అది లౌకిక న్యాయం. కాని ప్రకృతి న్యాయం ఏమంటే ఏమి జరిగితే అదే కరెక్ట్. వారికి నిర్ణయించబడిన ప్రకారం వారికి లభించింది. వారు వాస్తవంగా పొందిన భూమికి, తండ్రి ఇచ్చ మేరకు పొందవలసిన దానికి మధ్య ఉన్నభేదం వారి గత జన్మల ఖాతాలో జమ అయిందన్నమాట.
వివాదం వద్దనుకుంటే ప్రకృతి న్యాయాన్ని అనుసరించి నడచుకోవాలి. లేకుంటే ప్రపంచం అంతా జగడాలతో నిండిపోతుంది. న్యాయంకోసం వెదకవద్దు. జరిగిందే న్యాయం. నీ అంతరంగంలో ఏమైనా మార్పు వచ్చిందా? దానిని గమనించుకోవటమే న్యాయం. ' నేను న్యాయంగానే ఉన్నాను. నాకు న్యాయమే లభిస్తుంది' అని నిశ్చయించుకో. న్యాయం ఒక ధర్మామీటరు. ప్రకృతి న్యాయంతో మనిషి ఏకీభవిస్తే అపుడు అతడు పరిపూర్ణుడౌతాడు. అపుడు అతనికి అంతా న్యాయస్వరూపంగానే కన్పిస్తుంది. ప్రకృతి న్యాయంతో ఏకీభవించనంతవరకు అతడు సహజతకు దూరంగానే ఉంటాడు. శాంతి లభించదు. బిలో నార్మల్ లేక అబౌవ్ నార్మాలిటిలో ఉంటారు..
పెద్దకుమారుడు చిన్న కుమారునికి 5 ఎకరాలే ఇచ్చాడు, పూర్తివాటా యివ్వలేదు, అపుడు పెద్ద అతనిని దోషిగా ఆరోపిస్తూ న్యాయం కోసం వెళ్తారు. ఇదంతా తప్పు. ప్రజలు మిధ్యా జగత్తులో జీవిస్తూ మిధ్యనే సత్యమని భావిస్తారు.
భ్రాంతిని సత్యమని భావిస్తే దెబ్బతింటారు. ప్రకృతి న్యాయంలో ఎపుడూ దోషం ఉండదు. ఇటువంటి విషయాలలో నేను జోక్యం చేసికోను. అలా చేయాలి, ఇలా చేయకూడదు అని నేను చెప్పను. అలా చెప్తే నేను వీతరాగ్ అనిపించుకోను. వాళ్ళ పాతఖాతాలు ఏమిటి అని గమనించటం మాత్రమే చేస్తాను.
ఎవరైనా నా దగ్గరికి న్యాయం చెప్పమని వస్తే, నా న్యాయం ప్రపంచ
Page #25
--------------------------------------------------------------------------
________________
జరిగింద న్యాజీురి
నా
(లౌకిక) న్యాయానికి భిన్నంగా ఉంటుందని చెప్తాను. ప్రకృతి న్యాయమే న్యాయం. ఈ న్యాయం ప్రపంచం యొక్క “రెగ్యులేటర్” అందువల్ల అది ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ప్రకృతి న్యాయంలో ఒక్క క్షణ కాలం కూడ అన్యాయం జరగదు. అయినా ప్రజలు దానిని ఎందుకు అన్యాయంగా భావించి స్వంతన్యాయం కోసం వెదుకుతారు? కారణం ఏమంటే వాళ్ళకి ఏది లభించిందో అదే న్యాయం అని వారికి తెలియదు. నీకు రెండు ఎకరాలు ఎంద్కు యివ్వలేదు. 5 ఎకరాలు ఎంద్కు యిచ్చాడు? అతను ఏమి ఇచ్చాడో అదే న్యాయం. ఇపుడు జరిగిందంతా గత జన్మ తాలూకా ఖాతాతో ముడిపడివుంది. గత జన్మలో లావాదేవీలు ఇపుడు బాలెన్స్ అయ్యాయి. దానికై వ్యాకులపడితే అది కూడా ఖాతా ప్రకారమే. న్యాయం అంటే ధర్మా మీటరు. ఆ ధర్మామీటరు ద్వారా చూస్తే నేను క్రిందటి జన్మలో అన్యాయం చేసాను అందుకే యిపుడు నాకు ఈ అన్యాయం జరిగింది అని తెలుస్తుంది. ఆ దోషం ధర్మామీటరుది కాదు. నీకెలా అన్పిస్తుంది? నా ఈ మాటలు నీకు ఉపయోగకరంగా ఉన్నాయా?
ప్రశ్నకర్త : అవును. చాలా ఉపయోగపడ్తాయి.
దాదాశ్రీ : ప్రపంచంలో న్యాయంకోసం ప్రాకులాడవద్దు. ఏమి జరుగుతుందో అదే న్యాయం. ఏమి జరుగుతూ వుందో దానిని చూస్తూఉండాలి. అంతే. అన్నగారు తమ్ముడికి ఏభై ఎకరాలకు బదులు ఐదు ఎకరాలు ఇచ్చి తమ్ముడిని “సరిపోయిందా”? నీకు సంతోషంగా ఉందా?" అని అడిగినపుడు తనకు సంతోషంగా ఉందని సమాధానం చెప్తాడు. తర్వాత మర్నాడు ఇద్దరు కలసి భోజనం చేస్తారు. ఇదంతా లెక్క ప్రకారమే జరుగుతుంది. ఆ పరిధిని దాటి ఏమీ జరగదు. తండ్రి అయినా సరే కొడుకునుంచి వసూలు చేయాల్సింది చేయకుండా వదిలిపెట్టడు. ఇదంతా రక్తసంబంధం, బంధుత్వాలూ కాదు. కేవలం బాలెన్స్ ఆఫ్ అకౌంట్స్. మనం రక్త సంబంధం అని భ్రమపడ్తాం.
16
వేరొకరి నిర్లక్ష్యం వల్ల చంపబడితే అదీ న్యాయమే.
ఒక వ్యక్తి బస్కోసం ఎదురుచూస్తూ సరైన స్థలంలోనే నిలబడ్డాడు. ఇంతలో ఒక బస్ రాంగ్సైడ్ నుంచి వచ్చి అతని మీదుగా వెళ్లి అతనిని చంపేసింది. ఇది న్యాయం ఎలా అన్పించుకుంటుంది?
Page #26
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
ప్రశ్నకర్త : లోకం అతని మరణానికి డ్రైవరే కారణం అంటుంది.
దాదాశ్రీ : అవును, రోడ్ కి రాంగ్ సైడు నుంచి వచ్చి చంపేశాడు కనుక. ఒకవేళ రైట్ సైడ్ నుంచి వచ్చినా ఆ యాక్సిడెంట్ జరిగితే అపుడు కూడ
డ్రైవర్ దే తప్పు. కాని యిక్కడ రాంగ్ సైడులో వచ్చి చంపేశాడు కనుక అతనిది రెట్టింపు దోషం. ఒకటి రాంగ్ సైడ్ లో రావటం, రెండవది యాక్సిడెంట్ చేయటం. కాని ప్రకృతి దృష్టిలో అదీ న్యాయమే. ప్రజలు గొడవ చేసినా అది నిష్ఫలమే. గతంలోని ఖాతా ఇపుడు సెటిల్ అయింది. కాని దానిని ఎవరూ అర్ధం చేసికోరు. న్యాయపోరాటంలో తమ విలువైన జీవితాన్ని, డబ్బుని లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి వ్యర్ధం చేసికొంటారు. ఈ వ్యవహారంలో అపుడపుడు లాయర్ల చేత నానా చివాట్లు కూడ తింటారు. దీనికంటె దాదా వివరించిన ప్రకృతి న్యాయాన్ని ప్రజలు అర్ధం చేసికొంటే చాలా తేలికగా సమస్యల నుంచి బయటపడతారు.
వ్యవహారాన్ని కోర్టుకి తీసికెళ్ళడంలో తప్పులేదు. కాని ప్రతిపాదితో సత్సంబంధం కల్గి ఉండాలి. కోర్టులో అతనితో కల్సి టీ త్రాగాలి. మిగిలిన వ్యవహారాలన్నీ ఎప్పటిలానే ఉండాలి. అతను టీ త్రాగనని చెప్తే "పోనీ ప్రక్కన కూర్చో”మని చెప్పాలి. అతని పట్ల నీ ప్రేమ ఎప్పటిలాగే వుండాలి.
ప్రశ్నకర్త : అటువంటి వారు మన పట్ల విశ్వాసఘాతంగా ప్రవర్తించే
అవకాశం
ఉంది కదా!
దాదాశ్రీ : ఎవరూ ఏమీ చేయలేరు, అలా చేయగల మనుష్యులు కూడ లేరు. మనం పవిత్రంగా ఉన్నంతవరకు ఎవరూ హాని చేయలేరు. ఇది ప్రకృతి నియమం. అందువల్ల నీ పొరపాట్లు చక్కదిద్దుకో.
క్రోధాన్ని జయించిన వాడే విజేత నీవు ప్రపంచంలో న్యాయం కోసం వెదుక ప్రయత్నిస్తున్నావా? ఏమి జరిగినా అది న్యాయమే. నిన్ను ఎవరైనా ఒక చెంపదెబ్బకొడితే అది న్యాయమే. ఎపుడు ఈ విధంగా నువ్వు అర్ధం చేసికోగలవో అపుడు అన్ని సమస్యలను పరిష్కరించుకోగలవు.
'ఏమి జరిగితే అదేన్యాయం' అని నీకునువ్వు చెప్పుకోకపోతే, నీ బుద్ధి చాలా రెస్ట్ గా తయారవుతుంది. అనంత జన్మల నుంచి అయోమయాన్ని,
Page #27
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
విభేదాలను సృష్టిస్తున్నది బుద్ధే. వాస్తవానికి (బుద్ధి యొక్క జోక్యం లేకుంటే) పగ, ప్రతీకారం అనే సందర్భమే రాదు. నా మటుకు నాకు ఎవరినీ ఒకమాట అనవలసిన సందర్భం ఎదురుకాలేదు. ఎవరు క్రోథాన్ని వదలి పెడ్తారో వారు జయిస్తారు. ఎవరైతే క్రోధంతో ఎదురుదాడికి సిద్ధపడతారో వారు రిస్క్ ని కోరితెచ్చుకొన్నట్లే. బుద్ధి యొక్క ఉనికిని (బుద్ధినశించిందని) ఎలా తెల్సుకోవాలి? న్యాయం కోసం వెదకకుండా 'ఏది జరిగితే అదే న్యాయం' అని అంగీకరించగల్గితే అపుడు బుద్ధి వెళ్ళిపోయిందని అర్ధం. బుద్ధి ఏమి చేస్తుంది? అది ఎపుడూ న్యాయాన్ని వెదుకుతూ వుంటుంది. దాని కారణంగానే జనన మరణ రూప సంసారం కొనసాగుతుంది. అందువల్ల న్యాయంకోసం వెదుకవద్దు.
న్యాయంకోసం వెదకవలసిన పని ఉందా? “ఏమి జరిగితే అదే న్యాయం” సదా ఈ జ్ఞానం జ్ఞప్తిలో ఉండాలి. ఎందుకంటే వ్యవస్థిత్ (విధి) పరిధిని
దాటి ఏమీ జరగదు.
నీకు రావలసిన ఖాతాలే నిన్ను పట్టుకొంటాయి. బుద్ది భారీ తుఫానును సృష్టించి అంతా పాడు చేస్తుంది. బుద్ధి అంటే ఏమిటి? న్యాయాన్ని వెదికేది ఏదో అదే బుద్ధి. నువ్వు విక్రయించిన వస్తువులకు ఎవరైనా సొమ్ము చెల్లించకపోతే 'అతను వస్తువులను తీసికొన్నాడు కదా, డబ్బు ఎంద్కు యివ్వడు?” అని బుద్ధి పదే పదే నిన్ను అడుగుతుంది. ఎందుకు ఇవ్వలేదు అని అడిగేది ఏదో అదే బుద్ధి. ప్రపంచ దృష్టిలో అన్యాయం జరిగినా, నిజానికి అది న్యాయమే. నీకు రావలసిన డబ్బును రాబట్టుకోవటానికి నీవు ప్రయత్నించవచ్చు. 'నాకు ఆర్ధిక యిబ్బందులు ఉన్నాయి డబ్బు కావాలి' అని ప్రశాంతంగా అడగాలి. 'నువ్వు డబ్బు ఎలా యివ్వవో చూస్తాను' అని చెప్పవలసిన పని, శత్రుత్వాన్ని సృష్టించుకోవలసిన పని లేదు. అలా చేస్తే సత్సంగాన్కి రావటానికి బదులు లాయరుని వెదుక్కొని కోర్టు చుట్టూ తిరగటంలో సమయం అంతా వృధా అవుతుంది. జరిగిందే న్యాయం అని నీవు చెప్పుకోవాలి అపుడు బుద్ధి వెళ్ళిపోతుంది.
ఏది జరిగితే అదే న్యాయం అన్న ధృఢ విశ్వాసం నీకు ఉండాలి. అందువల్ల వ్యవహారంలో ఇంకొక వ్యక్తికి ఇలా అప్పుఇవ్వవలసి వచ్చినపుడు నీకు కోపంగాని, వ్యాకులత గాని కలగవు. నిత్య జీవితంలో నీకు రావలసిన
Page #28
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
19
సొమ్మును వసూలు చేసికోవటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ విధంగా సొమ్ము వసూలుకు వెళ్ళినపుడు నాటకంలో వలె పాత్రను చక్కగా పోషించాలి. నీకు అప్పు పడిన వ్యక్తితో శాంతంగా “నేను నీకోసం చాలాసార్లు వచ్చాను. కానీ దురదృష్టం కొద్దీ మీరు నాకు కలవలేదు. ఇపుడు నా పుణ్యఫలమో మీ పుణ్యఫలమో మనం కలవగలిగాం. నాకు ఆర్ధిక యిబ్బందుల కారణంగా డబ్బు చాలా అత్యవసరంగా కావలసివచ్చింది. మీరు యివ్వవలసిన పైకం యిస్తే నాకు చాలా సహాయకారిగా వుంటుంది. ఎవరినైన అడిగి అయినా సరే డబ్బు సర్దుబాటు చేయండి” అని మర్యాదపూర్వకంగా అభ్యర్ధించి పని పూర్తి చేసికోవాలి. మనిషిలో అహంకారం ఉంటుంది. దానిని మనం రెచ్చగొట్టకుండా సౌమ్యంగా వ్యవహరిస్తే ఆ వ్యక్తి మన కోసం ఏదైనా చేస్తాడు. మంచితనంతో పని పూర్తి చేసికోవాలి. కాని ఘర్షణ, రాగద్వేషాలకు చోటు యివ్వకూడదు. డబ్బు వసూలు చేసికోవటాన్కి వందసార్లు తిరుగు, అయినా డబ్బు యివ్వకపోతే పోనీ 'జరిగిందే న్యాయం' అని అర్ధం చేసికోవాలి. నిరంతరం న్యాయమే జరుగుతుంది. నీవు ఒక్కడివే అప్పు ఇచ్చావా?
ప్రశ్నకర్త : వ్యాపారస్తులందరికీ ఈ సమస్య ఉంటుంది.
దాదాశ్రీ : కొంతమంది నా దగ్గరకు వచ్చి తమకు రావలసిన డబ్బు వసూలు కావటం లేదని ఫిర్యాదు చేస్తారు. ఇంతకుముందు సరిగా వసూలు అయినపుడు ఎవరూ వచ్చి నాకు చెప్పలేదు. నీవు ఎప్పుడైనా ఊగ్రాని (అప్పు వసూలు) అనే మాట విన్నావా?
ప్రశ్నకర్త : ఎవరైనా మనల్ని అవమానిస్తే అది కూడ అప్పు వసూలే కాదా?
దాదాశ్రీ : అవును. అదంతా అప్పే (డెట్). అతను నిన్ను అవమానించినపుడు సరిగానే అవమానిస్తాడు. అతను ఉపయోగించిన పదాలకి అర్ధం డిక్షనరీలో కూడ దొరకదు, తలతిరిగిపోతుంది. అటువంటి భాషను ఉ పయోగించినందుకు బాధ్యత అతనే వహిస్తాడు. అందులో నీ బాధ్యత లేనందుకు సంతోషించాలి.
నీకు రావలసిన సొమ్ము తిరిగి రాకపోతే అదీ న్యాయమే. ఒకవేళ నీ సొమ్ము నీకు తిరిగి వస్తే అది న్యాయమే. ఇదంతా నేను చాలా సంవత్సరాల క్రితమే కనుక్కొన్నాను. నీకు యివ్వవలసిన సొమ్ము యివ్వకపోతే దానిలో
Page #29
--------------------------------------------------------------------------
________________
20
జరిగింది న్యాజీరి ఎవరిదోషమూ లేదు. నీ సొమ్ము నీకు యిచ్చినా అందులో మెహర్బానీ కూడ లేదు. ఈ జగత్తు పూర్తిగా ఒక ప్రత్యేక పద్ధతిలో నడపబడుతుంది.
వ్యవహారంలోనే దు:ఖానికి మూలం ఉంది.
న్యాయం కోసం ప్రాకులాడటం వల్లనే మనిషి అలసటకు గురవుతున్నాడు. “నేను వీరికి ఏమి అపకారం చేశాను? నా దోషం ఏమిటి? వీరెందుకు నా పట్ల యిలా ప్రవర్తిస్తున్నారు? నాదారికెంద్కు అడ్డు వస్తున్నారు?” అని మనిషి ఆలోచిస్తాడు.
ప్రశ్నకర్త : ఒక్కోసారి మనం ఎవరి విషయంలోనూ జోక్యం చేసికోకున్నా కనీసం వారి ప్రస్తావన కూడ తేకున్నా మన పట్ల శత్రువుల్లా వ్యవహరిస్తారెందుకు?
దాదాశ్రీ : అందుకే ఈ కోర్టులు, లాయర్లు అన్నీ నడుస్తున్నాయి. అటువంటివి ఏమీ లేకపోతే కోర్టులు ఎలానడుస్తాయి? లాయర్లకు క్లయింట్స్ కూడ ఉండరు. లాయర్లు ఎంత పుణ్యశాలురో చూడండి. తెల్లవారేసరికి క్లయింట్స్ లాయరు యింటికి వచ్చి ఆయన దర్శనం కోసం పడిగాపులు కాసి మరీ డబ్బు యిచ్చి వెళ్తారు. సలహా యిచ్చినంద్కు ఫోనులో మాట్లాడినంద్కు ప్రతి దానికీ ఫీజు వసూలు చేస్తారు. అది వారు తమ పుణ్యఫలాన్ని అనుభవించటం కాదా? నువ్వు న్యాయంకోసం ప్రాకులాడనంతవరకు అంతా సాఫీగానే జరుగుతుంది. న్యాయంకోసం ప్రాకులాడటం అంటే సమస్యలను ఆహ్వానించడమే.
ప్రశ్నకర్త : కాని దాదా! కాలం ఎలావుందంటే మనం ఎవరికైనా మంచి చేయాలని ప్రయత్నించినా, తిరిగి వారు మనల్ని బాధపెడ్తారు.
దాదాశ్రీ : ఎవరికైనా మేలు చేయటం వారు తిరిగి మనకు కీడు చేయటం దాని పేరే న్యాయం. వారితో ఏమీ చెప్పకూడదు. నువ్వు ఏమైనా అంటే వాళు • మనసులో నిన్ను సిగ్గుమాలిన వాడిగా భావిస్తారు.
ప్రశ్నకర్త : ఇతరుల పట్ల ఎంత నిజాయితీగా వ్యవహరించినప్పటికీ, వారు మనల్ని బాధిస్తుంటారు.
దాదాత్రీ : వాళ్ళు నిన్ను బాధించటం కూడ న్యాయమే.
Page #30
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
ప్రశ్నకర్త : వాళ్ళు ఎప్పుడూ ప్రతి విషయంలోనూ నన్ను విమర్శిస్తుంటారు. చివరికి నా వస్త్రధారణ విషయంలో కూడ.
దాదాశ్రీ : అదే ఖచ్చితమైన న్యాయం. ఇటువంటి విషయాలలో నువ్వు న్యాయం కోసం వెదికితే దానికి మూల్యంగా బాధపడవలసి వస్తుంది. అందువల్ల న్యాయం కోసం వెతకవద్దు. నేను సరళమైన సత్యాన్ని కని పెట్టాను. న్యాయాన్ని వెదకటం వల్లనే ప్రజలు కష్టాల పాలవుతున్నారు. న్యాయంకోసం వెతికినా చివరికి ఫలితం శూన్యం. ఈ విషయాన్ని ముందే ఎంద్కు గ్రహించరు? ఇదంతా అహంకారం యొక్క ప్రతాపం వల్లనే.
జరిగిందే న్యాయం. న్యాయంకోసం వెదకవద్దు. మీ తండ్రి మిమ్మల్ని విమర్శిస్తే అదే న్యాయం. “ఎంద్కు నన్ను విమర్శించారు?” అని వివరణ కోరవద్దు. నా అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైనా నీవు ఈ న్యాయాన్ని
అంగీకరించక తప్పదు. తండ్రి విమర్శను స్వీకరించటంలో తప్పేమిటి? జరిగిందే న్యాయం అని నీ మనసులో మాత్రమే అనుకో మీ తండ్రికి మాత్రం చెప్పవద్దు. ఎందుకంటే ఆయన దానిని అలుసుగా తీసికోవచ్చు.
ఇది మొదలు నీవు బుద్ధిని ఉపయోగించకు. జరిగిన న్యాయాన్ని స్వీకరించు. బుద్ధి ప్రశ్నిస్తూనే వుంటుంది. “నీకెవరు చెప్పారు? ఎందుకు వేడినీళ్ళు పెట్టావు?” అపుడు దానికి నువ్వు “జరిగిందేన్యాయం” అని చెప్పాలి. దీనిని అమలు పరుస్తూ వుంటే ఇక బుద్ధి ఫిర్యాదు చేయటం మానేస్తుంది.
ఆకలితో ఉన్న వ్యక్తికి నువ్వు భోజనం పెట్టావు. తిన్న తర్వాత అతను “నిన్నెవరు అడిగారు భోజనం పెట్టమని, నా సమయం వృధా చేసావు.” అని నీపై కోపగిస్తే అదే న్యాయం.
భార్యా భర్తలలో ఒకరు బుద్ధిని ఉపయోగించటం మానేస్తే ఇంట్లో వ్యవహారాలన్నీ సజావుగా నడుస్తాయి. కాని వారి బుద్ధి వారి మాటను వినకపోతే (వారు బుద్ధికి లొంగిపోతే) వారు భోజనం కూడ ప్రశాంతంగా చేయలేరు. అనావృష్టి సంభవిస్తే అది న్యాయమే. ఆ పరిస్థితుల్లో భగవంతుడు అన్యాయం చేసాడని ఒకరైతు ఫిర్యాదు చేస్తాడు. అతను అజ్ఞానం వల్ల అలా మాట్లాడతాడు. అతని ఫిర్యాదు వర్షాన్ని రప్పించగలదా? అక్కడ వర్షం లేకపోవటమే న్యాయం. కొన్ని
Page #31
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
ప్రాంతాలలో అతివృష్టి కొన్ని ప్రాంతాలలో అనావృష్టి. ప్రకృతి అన్నింటినీ నిర్దిష్టంగా ఉంచుతుంది. అది పక్షపాత రహితము. నిష్పక్షపాతమైన న్యాయాన్నే ప్రకృతి ప్రసాదిస్తుంది.
ఈ విషయాలన్నీ ప్రకృతి సిద్ధాంతాల పైన ఆధారపడివున్నాయి. బుద్ధిని నిర్మూలించటానికి ఇది ఒక్కటే నియమం. ఏమి జరిగినా అదే న్యాయం అని నీవు అంగీకరిస్తే బుద్ధి అంతరించిపోతుంది. బుద్ధి ఎంతవరకు జీవించి ఉ ంటుంది? ప్రతి విషయంలో న్యాయాన్ని వెదుకుతున్నంతవరకు బుద్ధి జీవించే వుంటుంది. దానికి (బుద్ధికి) మనం ప్రాధాన్యం యివ్వకపోతే, ఇక దాని ఆటలు సాగవని గ్రహించి మకాం ఎత్తేస్తుంది.
న్యాయానికై వెతకవద్దు. ప్రశ్నకర్త : బుద్ధిని తొలగించే తీరాలి, ఎందువల్లనంటే దానివల్ల నాకు చాలా బాధలు కల్గుతున్నాయి.
దాదాశ్రీ : బుద్దిని తొలగించుకోవటం అంత తేలిక కాదు. బుద్ది కార్యరూపి; దాని కారణాలను తొలగిస్తే కార్యం తొలగిపోతుంది. దాని కారణాలు ఏమిటి? వాస్తవంలో ఏమి జరుగుతుందో అదే న్యాయమని మనం చెప్పాలి. అపుడు బుద్ధి తొలగిపోతుంది. ప్రపంచం ఏమి చెప్తుంది? వాస్తవంలో ఏమి జరిగితే దానిని స్వీకరించటం (అంగీకరించటం) నేర్చుకోవాలి. న్యాయాన్ని
వెదికే కొద్దీ విభేదాలు, జగడాలు పెరుగుతూ ఉంటాయి. బుద్ధి అంత తేలికగా పోదు.
దానిని వదిలించుకోవటానికి మార్గం ఏమిటి? బుద్ధి చెప్పేదానిని మనం స్వీకరించకుండా ఉంటే అది తొలగిపోతుంది.
ప్రశ్నకర్త : బుద్దిని తొలగించుకోవాలంటే దాని కారణాలను తెలుసుకోవాలి అని మీరు చెప్పారు.
దాదాశ్రీ : బుద్ధికి కారణం మనం న్యాయంకోసం ప్రాకులాడటమే. మనం న్యాయం కోసం ప్రాకులాడటం మానేస్తే బుద్ది తొలగిపోతుంది. న్యాయం కోసం వెదకటం దేనికి? న్యాయం కోసం ఎందుకు వెదుకుతున్నావని ఒకామెను అడిగినప్పుడు, ఆమె “మా అత్తగారు ఎలాంటిదో మీకు తెలియదు. ఈ ఇంటికి
Page #32
--------------------------------------------------------------------------
________________
జరిగింది న్యాజీరి
వచ్చినప్పటి నుంచి ఆమె నాకు దు:ఖాన్నే కల్గించింది? నా దోషం ఏమిటి?” అని చెప్పింది. తెలియని వ్యక్తిని ఎవరూ బాధపెట్టరు. అది అసంపూర్ణంగా మిగిలిన నీ ఖాతా కావచ్చు అని చెప్పాను. నేను ఎపుడూ ఆమె మొఖం కూడ చూడలేదు అని ఆమె సమాధానం. ఈ జన్మలో నువ్వు ఆమెను చూసి ఉ ండకపోవచ్చు. గత జన్మలో ఆమెతో నీకు గల ఖాతా గురించి తెలుసా? అన్నాను. ఆమె పట్ల ఏమి జరిగినా అది న్యాయమే.
ఇంట్లో నీ కొడుకు నీ పైనే దాదాగిరి చేస్తున్నాడా? అతను దాదాగిరి చేయటం న్యాయమే. కాని బుద్ధి నీకు ఇలా చెప్తుంది. “వాడికెంత ధైర్యం నా మీద తిరుగుబాటు చేయటానికి? నేను అతని తండ్రిని”. జరిగింది. ఏదైనా న్యాయమే.
ఈ అక్రమవిజ్ఞానం ఏమి చెప్తుంది? ఈ న్యాయాన్ని చూడు. మీ బుద్ది ఎలా తొలగిపోయింది అని ప్రజలు నన్ను అడుగుతుంటారు. నేను న్యాయం కోసం వెదకను కనుక అది వెళ్ళిపోయింది. బుద్ధి ఎప్పటివరకు ఉంటుంది? ఎప్పటివరకు మనం న్యాయం కోసం వెదుకుతుంటామో అప్పటి వరకు బుద్ధి నిలిచి వుంటుంది. న్యాయం కోసం మనం వెదకటమే బుద్ధికి ఆధారం.
'నా బాధ్యతను అంత చక్కగా నిర్వర్తించాను కదా! అయినా అధికారులు నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు?' అని బుద్ధి ప్రశ్నిస్తుంది. దానిని మనం స్వీకరించామంటే అదే బుద్ధికి ఆధారం. నువ్వు న్యాయంకోసం వెదుకుతున్నావా? వాళ్లు నీ గురించి ఏమి చెప్పారో అదే కరెక్ట్. ఇప్పటి వరకు నీ గురించి వాళు » నెగెటివ్ గా ఎందుకు చెప్పలేదు? ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? మరి ఇపుడు దేని ఆధారంగా వాళ్ళు నీ గురించి అలా చెప్తున్నారు? ఈ విధంగా నీవు ఆలోచిస్తే పై అధికారులు నిన్ను విమర్శించటం సమంజసమే అని నీకే తెలుస్తుంది. అధికారి నీకు ఇంక్రిమెంట్ ఇవ్వనని చెప్తే అది కూడ న్యాయమే. అది అన్యాయమని ఎలా చెప్పగలవు?
బుద్ధి న్యాయాన్ని వెదుకుతుంది.
అందరూ దు:ఖాన్ని ఆహ్వానించటం వల్లనే బాధపడ్తున్నారు. ఎక్కడైన కొంచెం దు:ఖం కలిగింది అంటే అది బుద్ధికారణంగానే కల్గుతుంది. అందరిలో
Page #33
--------------------------------------------------------------------------
________________
24
జరిగింది న్యాజీవం బుద్ధి ఉంటుంది కదా? డెవలప్ట్ బుద్ధి దు:ఖానికి కారణం అవుతుంది. లేకుంటే దు:
ఖమే లేదు. నా విషయంలో బుద్ధి డెవలప్ అయిన తర్వాతనే వెళ్ళిపోయింది. బుద్ది పూర్తిగా నిర్మూలనమైంది. దాని ఛాయ కూడ మిగలలేదు. “అది ఎలా వెళ్ళిపోయింది. దానిని వెళ్ళిపొమ్మని పదే పదే చెప్పటం వలన వెళ్ళిపోయిందా?” అని ఒకరు నన్ను అడిగారు. ఆ పని చేయకూడదు. మనకు జీవితంలో ఇంతవరకు అది చాలా మేలు చేసింది. క్లిష్ట సమస్యలలో నిర్ణయాలు తీసికోవలసి వచ్చినపుడు ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అని మార్గదర్శనం చేసిందిబుద్ధి. ఎలా బయటకు పొమ్మని చెప్తాం? ఎవరైతే న్యాయం కోసం వెదుకుతుంటారో వారిలో బుద్ధి ఎప్పటికీ వుంటుంది. ఏమి జరిగినా సరే జరిగిందే న్యాయం అని ఎవరు అంగీకరిస్తారో వారు బుద్ధి ప్రభావం నుంచి బయటపడతారు.
ప్రశ్నకర్త : కానీ దాదా, జీవితంలో ఏమి జరిగినా సరే స్వీకరించాలా ? దాదాశ్రీ : బాధ అనుభవించిన తర్వాత స్వీకరించటం కంటే ముందే ఆనందంగా స్వీకరించటం మంచిది.
ప్రశ్నకర్త : సంసారంలో పిల్లలు, కోడళ్ళు ఇంకా ఎన్నో బాంధవ్యాలు, వీళ్ళందరితో సత్సంబంధాలు కల్గి ఉండాలి.
దాదాశ్రీ : అవును. అన్ని బాంధవ్యాలు నిలుపుకోవాలి. ప్రశ్నకర్త : అవును. కానీ ఆ బాంధవ్యాల కారణంగానే మాకు దుఃఖం కల్గితే?
దాదాశ్రీ : సత్సంబంధాలు కల్గి ఉండి కూడా, వారి కారణంగానే బాధ కల్గితే ఆ కష్టాలను అంగీకరించాలి. లేకుంటే మనం చేయకల్గింది ఏముంది? వేరే పరిష్కారం ఏమైనా ఉందా?
ప్రశ్నకర్త : లాయరును ఆశ్రయించటం తప్ప వేరే దారి లేదు.
దాదాశ్రీ : అవును. ఎవరైనా ఏమి చేయగలరు? లాయర్లు రక్షిస్తారా లేక వారి ఫీజు వసూలు చేసికొంటారా? ప్రకృతి న్యాయాన్ని అంగీకరిస్తే బుద్ధి వలాయనం చిత్తగిస్తుంది.
న్యాయంకోసం వెదికే సందర్భం ఎదురైన వెంటనే బుద్ధి లేచి
Page #34
--------------------------------------------------------------------------
________________
నిలబడుతుంది. బుద్ధికి తెల్సు ఆ సమయంలో తన పాత్ర అవసరమని, తనులేకుంటే జరగదని. కాని ఎప్పుడైతే మనం 'ఇది న్యాయమే' అని చెప్తామో అపుడు అది 'ఇక్కడ మన ఆటలు సాగవు' అని గ్రహించి మకాం ఎత్తివేస్తుంది. దాని ఆటలు ఎక్కడ సాగుతాయో ఆ వ్యక్తిని ఆశ్రయిస్తుంది. అశక్తులైనవారే బుద్ధిని ఆశ్రయిస్తారు. బుద్ధిని పెంచటం కోసం ప్రజలు ఎన్నో తపశ్చర్యలు, ఉ పవాసాది వ్రతాలు చేస్తారు. అదే సమయంలో బుద్ది ఎంతగా పెరుగుతుందో అంతగా వేదన కూడ పెరుగుతుంది. బుద్ధిని బాలెన్స్ చేయటానికి అదే మోతాదులో దు:ఖం కూడ ఉండాలి. అపుడే రెండూ సరిసమానంగా ఉంటాయి. నా బుద్ధి నశించిపోయింది. అందువల్లనే నా బాధలు కూడ అంతమైనాయి.
నందేహాల అంతమే మోక్ష మార్గం. 'ఏమి జరిగితే అదే న్యాయం' అని నీకు నీవు చెప్పుకుంటే నీవు నిర్వికల్పస్థితిని పొందుతావు. సందేహమే తలెత్తదు. కానీ మనుష్యులు ఒక వైపు న్యాయం కోసం వెదుకుతూనే, మోక్షం కూడ కావాలని కోరుకొంటారు. ఇది పరస్పర విరుద్ధం. రెండూ కావాలంటే సాధ్యం కాదు. ప్రశ్నలు ఎపుడు అంతమౌతాయో అపుడు మోక్షం మొదలౌతుంది. ఈ అక్రమ విజ్ఞాన మార్గంలో వికల్పం (ప్రశ్న) అన్నదే తలెత్తదు. అందువల్లనే ఇది చాలా సులువైన మార్గం. ఏమి జరిగితే అదే న్యాయం అన్న సూత్రం వల్ల బుద్ధి నిర్వివాదం అవుతుంది. బుద్ధి ఎంతగా నిర్వివాదం అయితే అంతగా నిర్వికల్పస్థితి కల్గుతుంది. అన్ని టెన్షన నుంచి విముక్తి కల్గుతుంది.
సమస్త ప్రపంచం న్యాయంకోసం వెదుకుతూనే వుంది. దానికి బదులు జరిగిందే న్యాయం అని మనం స్వీకరిస్తే లాయర్లు, జ, ఎవరూ అవసరం లేదు. ఎంత ప్రాకులాడినా చివరకు బాధ అనుభవించక తప్పదు కదా?
ఏ న్యాయస్థానంలోనూ తృప్తి లభించదు. ఒక వ్యక్తి న్యాయాన్ని కోరుతూ క్రింది కోర్టుకు వెళ్ళాడు. లాయరు వాదించాడు. జడ్జిమెంటు వచ్చింది. న్యాయం వెలువడింది. ఆ వ్యక్తికి ఆ న్యాయం వల్ల తృప్తి లభించలేదు. అందువల్ల జిల్లా కోర్టుకు వెళ్ళాడు. అక్కడ
Page #35
--------------------------------------------------------------------------
________________
కూడ అతనికి నిరాశే కలిగింది. తర్వాత హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడ అతనికి సంతోషం కలగలేదు. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. అక్కడా అతనికి తృప్తి లేదు. ఆఖరుగా ప్రసిడెంట్ కి అప్పీల్ చేశాడు. అక్కడ కూడ అతనికి మేలు కల్గలేదు. ఇన్ని కోర్టుల్లోనూ వ్యవహారం నడిపినంద్కు లాయరు తన ఫీజును డిమాండ్ చేశాడు. లాయరుకి ఫీజు చెల్లించలేదు. అది కూడ న్యాయమే.
న్యాయం : సహజం మరియు అసహజము
న్యాయం రెండురకాలు. ప్రశ్నలను పెంచి బాధలను కల్గించేది ఒకరకం. ప్రశ్నలను నిర్మూలించేది రెండవరకం. పరిపూర్ణమైన న్యాయం ఏమంటే, జరిగిందేన్యాయం, ఇది వికల్పాలను తొలగిస్తుంది. మనం న్యాయం కోసం
ప్రాకులాడే కొద్దీ ప్రశ్నలు పెరుగుతూ ఉంటాయి. ప్రకృతి న్యాయం ప్రశ్నలను తొలగించి నిర్వికల్ప స్థితిని కల్గిస్తుంది. జరిగినది, జరుగుచున్నది ఏదైనా న్యాయమే. దీనిని స్వీకరించకుండా అతను ఎంతమందిని ఆశ్రయించినా ఎవరు చెప్పిన న్యాయాన్నీ అతను అంగీకరించలేడు. ఆ విధంగా అతని సమస్యలు మరింతగా పెరుగుతాయి. తనకు తానే స్వయంగా సమస్యల వలయంలో చిక్కుకుని అధిక దు:ఖానికి గురి అవుతాడు. ముందే జరిగిన దానిని న్యాయంగా స్వీకరించటం అన్నిటికంటే ఉత్తమం.
ప్రకృతి సదా న్యాయమే చేస్తుంది. ఆ న్యాయం నిరంతరమూ స్థిరమూ. కాకపోతే అది న్యాయమేనని ప్రకృతి నిరూపించలేదు. అది ఏ విధంగా న్యాయం అనే విషయాన్ని జ్ఞాని మాత్రమే నిరూపించగలడు. నిన్ను సమాధానపరచగలడు. ఒకసారి సమాధానపడితే నీ పని పూర్తి అయినట్లే. ప్రశ్నలన్నీ పరిష్కరింపబడితే, నీవు నిర్వికల్పస్థితిని పొందుతావు.
జయ సచ్చిదానంద్
Page #36
--------------------------------------------------------------------------
________________
English Books of Akram Vignan of Dada Bhagwan
Adjust Everywhere (English & Telugu)
1.
2. Ahimsa Non-Violence
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
Pratikraman: The master key that resolves all conflicts
22.
Pure Love
23. Right Understanding to Help Others
24. Science of Karma
25.
Science of Speech
26.
Shree Simandhar Swami: The Living God
27. The Essence Of All Religion
29.
30.
31.
32.
33.
Anger
Aptavani - 1
Aptavani - 2
Aptavani - 4
Aptavani - 5
Aptavani - 6
Aptavani - 8
Aptavani - 9
Autobiography of Gnani Purush A.M.Patel
Avoid Clashes (English & Telugu)
Brahmacharya: Celibacy Attained With Understanding
Death Before, During & After...
Flawless Vision
Generation Gap
Harmony In Marriage
Life Without Conflict
Money
Noble Use of Money
28. The Fault Is Of the Sufferer (English & Telugu)
The Guru and The Disciple
Tri Mantra: The mantra that removes all worldly obstacles Whatever Happened is Justice (English & Telugu)
Who Am I? (English & Telugu)
Worries
'Dadavani' Magazine is published Every month
Page #37
--------------------------------------------------------------------------
________________ జరిగిందే న్యాయం ప్రకృతి న్యాయాన్ని అంగీకరించగలిగితే, జరిగింది ఏదైనా న్యాయమే" అని అర్ధం చేసికోగలిగితే మీరు ముక్తిని పొందుతారు. ప్రకృతి న్యాయాన్ని అన్యాయమని అణుమాత్రమైన భావించినట్లయితే జీవితంలో బాధలను, సమస్యలను మీరు ఆహ్వానించినట్లే ప్రకృతి సదా న్యాయమే అని నమ్మటమే నిజమైన జ్ఞానం. ఉన్నదానిని ఉన్నట్లు స్వీకరించకపోవటమే అజ్ఞానం. జరిగిందే న్యాయం' అనే జ్ఞానం అనుభవంలోకి వస్తే మనకి సుఖము, శాంతి దొరుకుతాయి. దీనిని అంగీకరిస్తే సంసారసాగరాన్ని సులభంగా దాటవచ్చు. ప్రపంచంలో ఒక క్షణకాలం కూడ అన్యాయం జరగనే జరగదు. న్యాయం మాత్రమే జరుగుతుంది. కాని ఇది ఎలా న్యాయంగా" అని బుద్ధి ప్రకృతి న్యాయాన్ని ప్రశ్నిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక మాట సరిగా చెప్పదల్చుకొన్నాను. అది ఏమంటే న్యాయం ప్రకృతికి చెందినది. మీరు బుద్ధినుంచి వేరుగా ఉండాలి. ఒకసారి దీనిని అర్ధం చేసికొన్న తర్వాత మనం బుద్ధి చెప్పేదానిని పట్టించుకోకూడదు. జరిగిందే న్యాయం. ISBN 978-81-8993620-3 97881891933203 Printed in India dadabhagwan.org