________________
జరిగింది న్యాజీరి
అయితే ఆ వ్యక్తి అతని పూర్వపు కర్మకు ప్రతీకారం తీర్చుకొన్నట్లా? లేక గతజన్మలో చేసిన పుణ్యకర్మల ఫలంగా నిర్దోషిగా విడుదల అయినట్లా?
దాదా: పూర్వపు కర్మకు ప్రతీకారం చేయటం, పుణ్యం రెండూ ఒకటే. అతని పుణ్యఫలంగానే నేరం నుంచి విముక్తి పొందాడు. గత జన్మయొక్క పాపకర్మల ఫలంగా జైలు పాలు అవుతాడు ఒక వ్యక్తి, అతను ఏ నేరమూ చేయకపోయినప్పటికీ, ఎవరూ కర్మఫలాన్ని తప్పించుకోలేరు.
మానవ నిర్మితమైన చట్టపరిధిలో అన్యాయం జరిగితే జరగవచ్చు కానీ ప్రకృతి మాత్రం ఎపుడూ అన్యాయం చేయదు. ప్రకృతి న్యాయ పరిధిని దాటి ఎప్పటికీ పోదు. ప్రకృతిలో ఒక తుఫాను సంభవించనీ, రెండు సంభవించనీ అది న్యాయమే అవుతుంది.
ప్రశ్నకర్త : అయితే మన చుట్టూ మనం చూస్తున్న వినాశమంతా మన శ్రేయస్సు కోసమేనా ?
దాదాశ్రీ : వినాశనాన్ని ఏ విధంగా శ్రేయస్సు అనగలం? కాని వినాశం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రకృతి వినాశం చేయవచ్చు. అది నిజమే. ప్రకృతి పోషణ కూడ చేస్తుంది అదీ నిజమే. ప్రకృతి ఒక పద్ధతి ప్రకారం నియంత్రణ చేస్తుంది. ప్రకృతి చేసే ప్రతికార్యం చాలా స్వచ్ఛమైనది.
కానీ మనిషి తన స్వార్ధంతో ఫిర్యాదు చేస్తాడు. వాతావరణం కారణంగా ఒక రైతు ఫలసాయం నాశనం కావచ్చు. ఇంకొక రైతుకి అదే వాతావరణం లాభకారి కావచ్చు. తత్కారణంగా అతను మంచి ఫలసాయాన్ని పొందవచ్చు. అంటే మనుషులు తమతమ స్వార్ధం కోసమే రోదిస్తుంటారు.
ప్రశ్నకర్త : ప్రకృతి సదా న్యాయమే అని మీరు చెప్తున్నారు. అయితే ఎంద్కు ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు? ఎంద్కు ఇన్ని భూకంపాలు, వరదలు, తుఫానులు వస్తున్నాయి?
దాదాశ్రీ : అంతా న్యాయమే జరుగుతుంది. వర్షం వస్తేనే కదా పంటలు పండేది. భూకంపాలు రావటం కూడ ప్రకృతి నియమం ప్రకారం న్యాయమే.
ప్రశ్నకర్త : అది ఏ విధంగా?