________________
జరిగింది న్యాజీరి
దాదాశ్రీ : న్యాయం గురించి ఇంకొక విధంగా వివరిస్తాను వినండి. నాకు గ్లాసుతో మంచి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చేతులకు కిరోసిన్ అంటి వుంటుంది. నేను ఆ నీళ్ళు త్రాగబోతే నాకు కిరోసిన్ వాసన వచ్చింది. అపుడు నేను జ్ఞాత, ద్రష్టగా ఉండిపోయాను. ఇలా నాకెంద్కు జరిగింది దాని వెనుక కారణం ఏమిటి? ఇంతకు ముందెపుడు ఇలా జరుగలేదు. ఈ రోజు ఎంద్కు జరిగింది? అది నా ఖాతా ప్రకారమే జరిగి ఉంటుందని నిశ్చయానికి వచ్చాను. నా
ఖాతాలో జమచేసికొన్నాను. కాని ఆ విషయం ఎవరికీ తెలియని విధంగా జమచేసికోవాలి. అదే ఘటన మరల మరునాడు జరిగితే ఎటువంటి వివాదానికి చోటుయివ్వకుండా ఆ నీరు త్రాగేవాడిని. ఒక అజ్ఞానికి ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏమి చేస్తాడు?
ప్రశ్నకర్త : పెద్దగా అరచి, గొడవను సృష్టించి వుండేవాడు. దాదాశ్రీ : అపుడు ఇంట్లోని వారందరికీ యజమాని త్రాగే నీళ్ళలో కిరోసిన్ కల్సిందని తెల్సి వుండేది.
ప్రశ్నకర్త : యిల్లంతా ఘర్షణ చెలరేగేది.
దాదాశ్రీ : ఇంట్లో వాళ్ళందర్నీ తన అరుపులతో పిచ్చెక్కించి వుండేవాడు. పాపం అతని భార్య ఈ రోజు టీలో చక్కెర వేయటం కూడ మర్చిపోయింది. ఇంట్లో ఏ కారణంగానైనా గొడవ జరిగి వత్తిడి పెరిగితే ఇంక ఆ రోజు పనులన్నీ మనసు వికలం అయిన కారణంగా, అలాగే జరుగుతాయి.
ప్రశ్నకర్త : దాదా! ఇటువంటి సంఘటన జరిగినపుడు ఇంట్లో వాళ్ళకి ఫిర్యాదు చేయకపోవటం సబబే. కాని ఇంట్లో వాళ్ళకి నీళ్లలో కిరోసిన్ కల్సిందని చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? భవిష్యత్తులో అలా జరగకుండా వాళు , జాగ్రత్త పడాలి కదా!
దాదాత్రీ : వాళ్ళకి నీవు ఎపుడు చెప్పాలి? అందరూ మంచి మూడ్ లో వున్నపుడు ఫలహారం, టీ తీసికొంటున్నపుడు సీరియస్ గా కాకుండా సరదాగా నవ్వుతూ చెప్పాలి.
ప్రశ్నకర్త : అంటే ఎదుటి మనిషికి బాధ కల్గకుండా చెప్పాలనే కదా అర్ధం.