Book Title: Whatever Happens Justice
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ Co జరిగింది న్యాజీరి వుంటుంది. మానవ నిర్మితమైన చట్టాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానం జరిమానా విధిస్తుంది. ప్రకృతి నియమాలను ఎప్పుడూ మనం ఉల్లంఘించకూడదు. అంతా మీ స్వయం కృతమే అంతా మీ స్వయం కృతమే మరి ఇతరులను నిందించటం దేనికి? ప్రశ్నకర్త : ఇది మన క్రియలకు ప్రతిక్రియా? దాదాత్రీ : దీనిని ప్రతిక్రియ అనరు. కానీ దీని ప్రాజెక్షన్ అంతా మీదే. దీనిని మీరు ప్రతిక్రియ అంటే అపుడు యాక్షన్ మరియు రియాక్షన్ రెండూ సమానంగా, వ్యతిరేకంగా ఉండాలి. దీనికి పూర్తి బాధ్యత మీదే ఎవరి ప్రమేయమూ లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. అపుడు ఎంత జాగ్రత్తగా వుండాలో తెలుస్తుంది. పూర్తి బాధ్యత మీ భుజస్కందాల పైనే వుందని అర్ధమవుతుంది. దీనిని గ్రహించిన తర్వాత ఇంట్లో మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ప్రశ్నకర్త : ఆ ప్రకారమే ప్రవర్తించవలసి వుంటుంది. దాదాశ్రీ : వ్యక్తి తన బాధ్యతను తాను గుర్తించాలి. కొంతమంది భగవంతుని ప్రార్ధించటం ద్వారా కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. ఎంత భ్రమ! ప్రజలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి భగవంతుని పేరు వాడుకొంటారు. మీ ప్రతి చర్యకు పూర్తి బాధ్యత మీదే, యు ఆర్ సూల్ & సోల్ రెస్పాన్సిబుల్. దాని సృష్టికర్తలు మీరే కదా. ఎవరైనా మీ మనసుని గాయపరిస్తే లేక మీకు దు:ఖాన్ని కల్గిస్తే దానిని మీరు అంగీకరించి మీ ఖాతాలో జమచేసికోవాలి. కారణం లేకుండా ఒకరు ఇంకొకరికి దు:ఖాన్ని కల్గించలేరు. దాని వెనుక తప్పక కారణం ఉండి తీరాలి. అందువల్ల మనకి ఏదైనా జరిగితే దానిని మన ఖాతాలో జమవేసికోవాలి. సంసారం నుంచి విముక్తి పొందాలంటే ఎపుడైనా కూరలో ఉప్పు ఎక్కువైతే అది కూడ న్యాయమే! ప్రశ్నకర్త : ఏది జరిగినా దానిని చూస్తుండమని మీరు చెప్పారు. ఇంక అలాంటప్పుడు న్యాయం కోసం ప్రాకులాడే అవసరం ఏముంది?

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37