Book Title: Whatever Happens Justice
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ జరిగింది న్యాజీరి 95%, ఆంగ్లంలో 25% మార్కులు వస్తే, అపుడు పొరపాటు ఎక్కడ జరిగిందో మీకు తెలియదా? అదే విధంగా జీవితంలో మన పొరపాటు ఎక్కడ వుందో, కారణం ఏమిటో పరిణామాన్ని లేక ఫలితాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఫలితం కారణాన్ని ప్రతిబింబింపచేస్తుంది. కొన్ని పరిస్థితుల కలయిక కారణంగానే ఏదైనా లభిస్తుంది. ఆ పరిణామం ఆధారంగానే కారణం ఏమిటో తెలుస్తుంది. బాగా జన సంచారం ఉన్న రహదారిలో ఒక ముల్లు నిలువుగా పడివుంది. జనం వస్తూ పోతూనే ఉన్నారు. కాని ఆ ముల్లు అలాగే వుంది, ఎవరికీ గ్రుచ్చుకోలేదు. ఒకరోజు “దొంగ, దొంగ,” అని ఎవరో అరవటం విని బూటు గాని, చెప్పులు గాని వేసికోకుండా బయటకు పరుగుపెట్టారు. అనుకోకుండా మీ పాదం ముల్లు మీదపడి మీకు గుచ్చుకుంది. అది అలా జరగాలని మీ ఖాతాలో వుంది కాబట్టే జరిగింది. అది వ్యవస్థితమై వుంది అంటే నిర్ణయించబడివుంది (సైంటిఫిక్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్). అందువల్లనే అన్ని పరిస్థితులూ కలిసి ఆ సంఘటనకు దారి తీసాయి. ఆ పరిస్థితుల కూడికకు కారణం వ్యవస్థిత శక్తి. ఎవరో దొంగ దొంగ అని అరవటం, ఎపుడూలేని విధంగా చెప్పులు వేసికోకుండా మీరు పరుగెత్తటం, ఎప్పటినుంచో అక్కడ పడివున్న ముల్లు ఎవరికీ గ్రుచ్చుకోకుండా మీకు గ్రుచ్చుకోవటం అంతా మీ ప్రారబ్దం . చట్టం అంతా ప్రకృతిదే బొంబాయి పట్టణంలో బంగారు గొలుసుతో కూడిన మీ గడియారాన్ని పోగొట్టుకొన్నారు. అది మీకు తిరిగి దొరికే అవకాశం లేదని నిరాశతో యింటికి వచ్చారు. కానీ రెండు రోజుల తర్వాత పోగొట్టుకొన్న గడియారాన్ని గురించిన ప్రకటనను మీరు పేపరులో చూశారు. ఆ వస్తువుకు సంబంధించిన ఆధారాలను చూపించి ఆ గడియారం తనదే అని నిరూపించుకొని, ప్రకటన ఖర్చులను చెల్లించి, యజమాని దానిని తీసికెళ్ళవచ్చునని ఆ ప్రకటనలో వుంది. ప్రకృతి నియమం ప్రకారం ఆ గడియారం మీకు తిరిగి దొరకాలని మీ ఖాతాలో వుంటే దానిని ఎవరూ ఆపలేరు. జరగవలసిన దానిని ఒక సెకనుకాలం కూడ ఎవరూ మార్చలేరు. ప్రపంచం అంత నియమబద్ధమైనది. ప్రకృతి అంతా నియమబద్దంగానే

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37