________________
జరిగింది న్యాజీరి
ప్రకృతి న్యాయానికి ఆధారం ఏమిటి? ప్రశ్నకర్త : ప్రకృతి న్యాయ స్వరూపమే అనటానికి ఆధారం ఏమిటి? న్యాయమే అని చెప్పటానికి ఒక ఆధారం ఉండాలి కదా!
దాదాశ్రీ : అది న్యాయమే. ఇది చాలు నీకు తెలియటానికి. ప్రకృతిది న్యాయమే అని నీకు విశ్వాసం కల్గించవచ్చు. కాని మిగిలిన ప్రజలు ప్రకృతి సదా న్యాయస్వరూపమే అని విశ్వసించరు. దానికి కారణం వారికి జ్ఞానదృష్టి లేకపోవటమే.
ప్రపంచము న్యాయ స్వరూపమే. అందులో అణుమాత్రమైనా సందేహం లేదు. పరిపూర్ణమైన న్యాయ స్వరూపము.
ప్రకృతిలో రెండు పదార్థాలు ఉన్నాయి. ఒక భాగం శాశ్వతం, సనాతనమైనది. రెండవది అశాశ్వతమైనది, మార్పుకు గురి అయ్యేది. ప్రకృతి నియమానుసారం అశాశ్వత వస్తువు యొక్క అవస్థ మారుతూనే ఉంటుంది. ఆ మార్పును దర్శించే వ్యక్తి తన వ్యక్తిగత బుద్ధితో దర్శిస్తాడు. అనేకాంతిక బుద్ధితో ఎవరూ ఆలోచించరు కేవలం తమ స్వార్ధంతోనే చూస్తారు.
ఒక వ్యక్తి యొక్క ఒక్కగానొక కుమారుడు మరణిస్తే అది న్యాయమే. ఇందులో ఎవరూ అన్యాయం చేయలేదు. భగవంతుడు గాని, ఇతరులెవ్వరు గాని అన్యాయం చేయలేదు. అది న్యాయమే. అందుకే జగత్తు న్యాయస్వరూపమే అని చెప్తున్నాను. నిరంతరం న్యాయస్వరూపమే.
ఎవరికైనా ఒక్కగానొక్క కుమారుడు మరణిస్తే ఆ కుటుంబసభ్యులు మాత్రమే దు:ఖితులౌతారు. వారి ఇరుగుపొరుగు వారు ఎంద్కు దు:ఖించరు? కుటుంబసభ్యులు తమ స్వార్ధం కారణంగా దు:ఖిస్తారు. ఆ సంఘటనను సనాతనతత్వంలో (ఆత్మ దృష్టితో) దర్శించగలిగితే ప్రకృతిది న్యాయమే.
నేను చెప్పిన విషయం చెప్పినట్లు అర్ధం చేసికొన్నావా! అర్ధం చేసికొంటే వాస్తవాన్ని గ్రహించు.
జ్ఞానాన్ని జీవితంలో ఎంతగా అన్వయించుకొంటే దు:ఖం అంతగా తగ్గిపోతుంది. ఒక్క సెకను కాలం కూడ న్యాయంలో తేడా రాదు. ఒకవేళ ప్రకృతి అన్యాయ స్వరూపమే అయితే ఒక్కరు కూడ ముక్తిని పొందలేరు.