________________
జరిగింది న్యాజీరి
విభేదాలను సృష్టిస్తున్నది బుద్ధే. వాస్తవానికి (బుద్ధి యొక్క జోక్యం లేకుంటే) పగ, ప్రతీకారం అనే సందర్భమే రాదు. నా మటుకు నాకు ఎవరినీ ఒకమాట అనవలసిన సందర్భం ఎదురుకాలేదు. ఎవరు క్రోథాన్ని వదలి పెడ్తారో వారు జయిస్తారు. ఎవరైతే క్రోధంతో ఎదురుదాడికి సిద్ధపడతారో వారు రిస్క్ ని కోరితెచ్చుకొన్నట్లే. బుద్ధి యొక్క ఉనికిని (బుద్ధినశించిందని) ఎలా తెల్సుకోవాలి? న్యాయం కోసం వెదకకుండా 'ఏది జరిగితే అదే న్యాయం' అని అంగీకరించగల్గితే అపుడు బుద్ధి వెళ్ళిపోయిందని అర్ధం. బుద్ధి ఏమి చేస్తుంది? అది ఎపుడూ న్యాయాన్ని వెదుకుతూ వుంటుంది. దాని కారణంగానే జనన మరణ రూప సంసారం కొనసాగుతుంది. అందువల్ల న్యాయంకోసం వెదుకవద్దు.
న్యాయంకోసం వెదకవలసిన పని ఉందా? “ఏమి జరిగితే అదే న్యాయం” సదా ఈ జ్ఞానం జ్ఞప్తిలో ఉండాలి. ఎందుకంటే వ్యవస్థిత్ (విధి) పరిధిని
దాటి ఏమీ జరగదు.
నీకు రావలసిన ఖాతాలే నిన్ను పట్టుకొంటాయి. బుద్ది భారీ తుఫానును సృష్టించి అంతా పాడు చేస్తుంది. బుద్ధి అంటే ఏమిటి? న్యాయాన్ని వెదికేది ఏదో అదే బుద్ధి. నువ్వు విక్రయించిన వస్తువులకు ఎవరైనా సొమ్ము చెల్లించకపోతే 'అతను వస్తువులను తీసికొన్నాడు కదా, డబ్బు ఎంద్కు యివ్వడు?” అని బుద్ధి పదే పదే నిన్ను అడుగుతుంది. ఎందుకు ఇవ్వలేదు అని అడిగేది ఏదో అదే బుద్ధి. ప్రపంచ దృష్టిలో అన్యాయం జరిగినా, నిజానికి అది న్యాయమే. నీకు రావలసిన డబ్బును రాబట్టుకోవటానికి నీవు ప్రయత్నించవచ్చు. 'నాకు ఆర్ధిక యిబ్బందులు ఉన్నాయి డబ్బు కావాలి' అని ప్రశాంతంగా అడగాలి. 'నువ్వు డబ్బు ఎలా యివ్వవో చూస్తాను' అని చెప్పవలసిన పని, శత్రుత్వాన్ని సృష్టించుకోవలసిన పని లేదు. అలా చేస్తే సత్సంగాన్కి రావటానికి బదులు లాయరుని వెదుక్కొని కోర్టు చుట్టూ తిరగటంలో సమయం అంతా వృధా అవుతుంది. జరిగిందే న్యాయం అని నీవు చెప్పుకోవాలి అపుడు బుద్ధి వెళ్ళిపోతుంది.
ఏది జరిగితే అదే న్యాయం అన్న ధృఢ విశ్వాసం నీకు ఉండాలి. అందువల్ల వ్యవహారంలో ఇంకొక వ్యక్తికి ఇలా అప్పుఇవ్వవలసి వచ్చినపుడు నీకు కోపంగాని, వ్యాకులత గాని కలగవు. నిత్య జీవితంలో నీకు రావలసిన