________________
జరిగిందే న్యాయం
విశ్వం యొక్క విశాలత శబ్దాతీతం .... శాస్త్రాలలో జగత్తును గురించి వర్ణించబడినది చాలా స్వల్పం, అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. జగత్తు వాస్తవంలో శబ్దాలలో వర్ణించటానికి, వ్యక్తం చేయటానికి వీలులేనిది. శబ్దాతీతమైన జగత్తును ఏ విధంగా వర్ణించగలరు? నేను స్వయంగా విశ్వవిశాలతను దర్శించాను. గనుక దాని గురించి మీకు చెప్పగలుగుతున్నాను.
ప్రకృతి సదా న్యాయమే
ప్రకృతి యొక్క న్యాయంలో ఇసుమంతైనా అన్యాయం అనేది జరగనే జరగదు. ప్రకృతి సదా న్యాయమే. కోర్టులో అన్యాయం జరిగితే జరగవచ్చును గాక కాని ప్రకృతి న్యాయం చాలా ఖచ్చితంగా వుంటుంది. ప్రకృతి న్యాయం
యొక్క ప్రకృతి ఏమిటి? ఒక నిజాయితీపరుడైన వ్యక్తి అంతకుముందెప్పుడూ ఏ నేరమూ చేయకుండా, ఈ రోజు దొంగతనానికి పాల్పడితే అతను వెంటనే పట్టుబడిపోతాడు. అవినీతి పరుడైన, నేరాలకు అలవాటుపడిన వ్యక్తి నేరానికి పాల్పడితే ప్రకృతి అతనిని స్వేచ్ఛగా వదలి పెడ్తుంది. నిజాయితీ పరుడైన వ్యక్తి నేరస్తునిగా మారటాన్ని ప్రకృతి సమర్ధించదు. అతని నిజాయితీని పవిత్రతను రక్షించే ఉద్దేశ్యంతో అతను మొదటి ప్రయత్నంలోనే పట్టుబడేలా చేస్తుంది. అవినీతిపరుడైన వ్యక్తికి ప్రకృతి సహకరిస్తూనే వుంటుంది. ఒకానొకదశలో ప్రకృతి అతనిని ఎటువంటి దెబ్బ కొడుందంటే అతను తిరిగి ఎప్పటికీ పైకి లేవలేడు, అధోగతికి పోతాడు. ప్రకృతి ఇసుమంతైనా అన్యాయం చేయదు,