Book Title: Fault Is Of Sufferer
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ బాధపడేవానిదే తప్పు నిరంతరం చేస్తూ సదా బద్ధునిగానే మిగిలిపోతావు. నీలో వున్న న్యాయమూర్తి నీ తప్పులను ఎత్తి చూపుతాడు. నీలో ఉన్న న్యాయవాది ఆతప్పుని సమర్ధిస్తాడు. ఈ విధంగా చేయటం వల్ల నీవు బద్ధుడవవుతావు. మోక్ష ప్రాప్తి నిమిత్తం, ఎవరి దోషం వల్ల ఈ బాధలు కల్గుతున్నాయనే విషయాన్ని నీవు కనిపెట్టాలి. ఎవరు బాధ పడతారో వారే సదా దోషులు. ప్రాపంచిక పరిభాషలో ఇది అన్యాయంగా తోచవచ్చు. కాని భగవంతుని భాషలో న్యాయం 'బాధపడేవానిదే తప్పు' అని చెప్తుంది. భగవంతుని న్యాయంలో బాహ్యంగా ఏ న్యాయాధీశుడూ అవసరం లేదు. 2 ప్రపంచాన్ని గురించిన యదార్ధజ్ఞానం ప్రజలకు లేదు. జన్మ తర్వాత జన్మగా అంతంలేని పరిభ్రమణకు వారిని గురిచేస్తున్న అజ్ఞానం యొక్క, లౌకిక ప్రపంచంయొక్క జ్ఞానం మాత్రమే వారికున్నది. ఎవరైనా మీ క్యాష్ బాగ్ను దొంగిలిస్తే తప్పెవరిది ? నీ క్యాష్ బ్యాగ్ మాత్రమే ఎందుకు దొంగిలించబడింది? వేరెవరిదీ ఎందుకు దొంగిలించబడలేదు? ఇరువురిలో ఇపుడు బాధపడుతున్నది ఎవరు? ఎవరు బాధపడుతున్నారో వారిదే తప్పు. నేను జ్ఞాన దృష్టితో ఉన్నదానిని ఉన్నట్లు దర్శించగలను, బాధపడేవానిదే తప్పు. సహించుటయా లేక పరిష్కారాన్ని కనుగొనుటయా? సహన శక్తిని పెంచుకోవాలని ప్రజలు చెప్తుంటారు. కాని ఇది ఎంతవరకు నిలుస్తుంది? ఎవరైనా ఎంతవరకు సహించగల్గుతారు? సహనానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ జ్ఞానం ద్వారా కనుగొన్న పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. జ్ఞానం అనంతం. ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే నీవు కించిత్ మాత్రం కూడ సహించే అవసరం ఉండదు. సహించటం అంటే లోహాన్ని నేత్ర దృష్టితో కరిగించటమే. సహనానికి చాలా శక్తి కావాలి. కాని జ్ఞానం వల్ల సహనం యొక్క అభ్యాసం లేకుండానే నీకు పరమానందంతో కూడిన ముక్తి ప్రాప్తిస్తుంది. గత కర్మ ఖాతాలు పూర్తి అవుతున్నట్లు, స్వేచ్ఛను పొందుతున్నట్లు నీవు జ్ఞానం వల్ల గ్రహించగలుగుతావు. ఒక వ్యక్తి బాధపడుతున్నట్లయితే దానికి కారణం అతని స్వంత తప్పులే. ఒక

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38