Book Title: Fault Is Of Sufferer
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ బాధపడేవానిదే తప్పు గుణించుకొంటే భయంకరమైన కష్టాలను ఎదుర్కొనవలసివస్తుంది. గుణకారం నీకు యిష్టమైతే నీ బాధల్ని గుణించు. నీవు ఒకరిని ఒక దెబ్బకొట్టినప్పుడు, అతడు తిరిగి నిన్ను రెండు దెబ్బలు కొడితే నిన్ను నీవు అదృష్టవంతునిగా భావించు. నిన్ను బాధించేవారు నీకు దొరికితే అది నీకు మేలు చేస్తుంది. కారణమేమంటే నీ జ్ఞానం వృద్ధిపొందుతుంది. బాధలను గుణించుకోవటాన్ని నీవు అంగీకరించలేకపోయినా ఫర్వాలేదు. కానీ ఏ పరిస్థితుల్లోనూ నీ సంతోషాన్ని మాత్రం గుణించకు. భగవంతుని దృష్టిలో దోషి 17 "బాధపడేవానిదే తప్పు” ఇది భగవంతుని యొక్క భాష. కాని ప్రపంచంలోని మానవ చట్టం ప్రకారం నేరం చేసినవాడిదే తప్పు. భగవంతుని దృష్టిలో దోషివి అయ్యే విధంగా ప్రవర్తించవద్దు. అనగా ఇతరులలో దోషాలు చూడవద్దు. ఇది మరు జన్మకోసం నీకు బంధాలను ఏర్పరుస్తుంది. ఇది అంతరంగ దోషం. బాహ్య దోషాలు అంత ప్రమాదం కాదు. ఎందువల్లనంటే నీవేదైనా తప్పు చేస్తే కొంతకాలం నిన్ను ఖైదు చేసి వదిలిపెడతారు. కాని భగవంతుని న్యాయ స్థానంలో దోషిగా నిర్ధారింపబడితే ఫలితం తీవ్రంగా ఉంటుంది. నీవు దీనిని గ్రహించావా? ఈ సూక్ష్మసందేశాన్ని నీవు గ్రహిస్తే అది నీకెంతో మేలు చేస్తుంది. చాలా మంది ప్రజలు “బాధపడేవానిదే తప్పు” అనే సూత్రాన్ని అర్థం చేసికొన్నారు. వారంతా సాధారణ ప్రజలుకారు, విచారశీలురైన మేధావులు. ఇపుడు నేను మీకు ఈ సూత్రాన్ని వివరించాను. ప్రజలు వెంటనే దీనిని తమ పరిస్థితులకు అన్వయించుకొంటారు. కోడలి వేధింపులవల్ల బాధపడే అత్తగారు “బాధపడేవానిదే తప్పు” అనే వాక్యాన్ని విన్నవెంటనే ఈ విధంగా కోడలిచే నిరాదరింపబడటానికి కారణం తన తప్పే అని అంగీకరిస్తుంది. ఈ అవగాహన ప్రాపంచిక జీవిత సంకెళ్లనుంచి ఆమెకు స్వేచ్ఛని ప్రసాదిస్తుంది. అర్ధం చేసుకోవటం కష్టం కాని ఇది వాస్తవం. ఎవరూ దోషులు కారు. తప్పు ఏదైనా వుంటే, అది మన స్వంత తప్పే. మన స్వయంకృతాపరాధాల కారణంగానే మనం ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. ఈ సంసారంలో ప్రతి దానికి ఆధారం మన స్వంత తప్పులే.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38