Page #1
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
. దాదా భగవాన్
LILL
Page #2
--------------------------------------------------------------------------
________________
IS Telugu translation of the English book
"The Fault is of the sufferer"
a
బాధపడేవానిదే తప్పు
-దాదా భగవాన్
సంపాదకులు : డా|| నీరుబెన్ అమీన్
Page #3
--------------------------------------------------------------------------
________________
Publisher
: Mr. Ajit C. Patel
Dada Bhagwan Aradhana Trust Dada Darshan, 5, Mamtapark Society B/h. Navgujrat College, Usmanpura, Ahmedabad-380014, Gujarat, India. Tel. : +91 79 3983 0100
All Rights reserved - Shri Deepakbhai Desai Trimandir, Simandhar City, Ahmedabad-Kalol Highway, Adalaj, Dist.-Gandhinagar-382421, Gujarat, India. No part of this book may be used or reproduced in any manner whatsoever without written permission from the holder of the copyrights
First Edition : 1500 copies, October 2015
Price
: Ultimate Humility (leads to Universal oneness)
and Awareness of "I Don't Know Anything"
Rs. 10.00
Printer
: Amba Offset
Basement, Parshwanath Chambers, Nr. RBI, Usmanpura, Ahmedabad-380014, Gujarat, India. Tel. : +91 79 27542964
Page #4
--------------------------------------------------------------------------
________________
త్రిమంత్రము (సర్వవిఘ్న నివారణ చేసే త్రిమంత్రములు)
నమో అరిహంతాణం తమ అంత శత్రువులైన క్రోథ, గర్వ, లోభ, మోహములను నాశనము చేసిన
వారందరికి నా నమస్కారము.
నమో సిద్ధాణం ఆత్యంతిక మోక్షమును పొందిన వారందరికీ నేను నమస్కరించుచున్నాను.
నమో ఆయరియాణం ఆత్మసాక్షాత్కారమును పొంది మోక్షమార్గమును చూపిన ఆచార్యులందరికీ నా నమస్కారము.
నమో వజ్జాయాణం ఆత్మ జ్ఞానమును పొందిన ఆధ్యాత్మిక మార్గ గురువులందరికి నా నమస్కారము.
నమో లోయే సవ్వసాహుణం ఆత్మ జ్ఞానమును పొంది ఆ మార్గంలో పురోగమించుచున్న ఈ విశ్వంలోని సాధువులందరికీ నేను నమస్కరించుచున్నాను.
ఏసో పంచ నముక్కారో ఈ ఐదు నమస్కారములు
సవ్వ పావప్పనాశనో సమస్త పాపములను నాశనము చేయును.
మంగళానాం చ సవ్వేసిం మంగళప్రదమైన వాటి అన్నింటిలో పథమం హవయి మంగళం
ఇది సర్వోత్కృష్టము.
ఓం నమో భగవతే వాసుదేవాయ మానవుని నుంచి మాధవునిగా మారిన వారందరికి నా నమస్కారము.
ఓం నమ: శివాయ మానవాళి మోక్షార్థమై సాధనాలుగా మారిన విశ్వంలోని మంగళస్వరూపులందరికీ
నా నమస్కారము.
జై సత్ చిత్ ఆనంద్ శాశ్వతమైన దానియొక్క ఎరుకే ఆనందము.
Page #5
--------------------------------------------------------------------------
________________
జ్ఞాని పురుషుని యొక్క పరిచయం అది 1958వ సంవత్సరం జూన్ నెలలో ఒకనాటి సాయంత్రం సుమారు ఆరు గంటల సమయం, పశ్చిమ భారత దేశంలోని దక్షిణ గుజరాత్ లోని ఒక పట్టణమైన సూరత్ రైల్వే స్టేషను. అంబాలాల్ మూ' భాయ్ పటేల్ నామధేయుడు, వృత్తి రీత్యా కాంట్రాక్టరూ అయిన ఒక గృహస్థుడు జనసమూహంతో రద్దీగా వున్న సూరత్ స్టేషన్లోని మూడవ నెంబరు ప్లాట్‌ఫాం బెంచి పైన కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో నలభై ఎనిమిది నిమిషములపాటు ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అంబాలాల్ మూల్ జీభాయ్ పటేల్ లోని ఆత్మ సాక్షాత్కారమైంది. ఆ సమయంలో అతని అహంకారం సమూలంగా దగ్ధమైపోయింది. ఆ క్షణం నుంచి అతను అంబాలాల్
యొక్క ఆలోచనలు, వాక్కు మరియు క్రియలన్నింటినుంచి పూర్తిగా వేరుచేయబడి, జ్ఞానమార్గం ద్వారా మానవాళికి ముక్తిని ప్రసాదించే నిమిత్తం భగవంతుని చేతిలో సజీవ పరికరంగా మారారు. ఆయన తనకు ప్రకటితమైన పరమాత్మని దాదాభగవాన్ అని పిలిచారు. “ఈ పరమాత్మ, దాదాభగవాన్ నాలో పూర్ణరూపంలో వ్యక్తమైనాడు; మీలో అవ్యక్తంగా ఉన్నాడు. భేదం ఇంతమాత్రమే. ఆయన జీవులందరిలోను విరాజమానుడై ఉన్నాడు.” అని తనను కలిసిన ప్రతి ఒక్కరితోనూ చెప్పేవారు.
మనం ఎవరము? భగవంతుడంటే ఏమిటి? జగత్తును ఎవరు నడిపిస్తున్నారు? కర్మ ఏమిటి? మోక్షం ఏమిటి? ఇత్యాది సమస్త ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఆ సందర్భంలో సమాధానం లభించింది. ప్రకృతి శ్రీ అంబాలాల్ మూజ్ భాయ్ పటేల్ ద్వారా ప్రపంచానికి సంపూర్ణ తత్త్వ రహస్యాన్ని వెల్లడిచేసింది.
శ్రీ అంబాలాల్ జన్మస్థలం బరోడాపట్టణ సమీపంలోని తారాసలి; పెరిగింది గుజరాత్ లోని బాదరణ్ గ్రామం. ఆయన ధర్మపత్ని హీరాబా. వృత్తిరీత్యా కాంట్రాక్టరు అయినప్పటికీ ఆత్మసాక్షాత్కారం పొందటానికి ముందు కూడా అతని వ్యావహారిక జీవనం ఇంట్లోను, చుట్టు ప్రక్కల వారితోను కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేది. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత జ్ఞానిగా ఆయన జీవితం ప్రజలకే అంకితమైంది.
Page #6
--------------------------------------------------------------------------
________________
వ్యాపారంలో ధర్మం ఉండాలి, ధర్మంలో వ్యాపారం ఉండకూడదు అనే నియమాన్ని ఆయన జీవితమంతా అమలుపరచారు. భక్తులచే దాదాశ్రీ గా పిలువబడే ఆయన ఎన్నడూ ఎవరినుంచీ స్వంత ఖర్చుల నిమిత్తం ధనాన్ని స్వీకరించలేదు. పైగా తనకు వ్యాపారంలో లభించిన లాభాలను, భక్తులను భారతదేశంలోని వివిధ యాత్రా స్థలాలకు తీసికొని వెళ్లటానికి వినియోగించేవారు.
దాదాజీ మాటలు అక్రమవిజ్ఞాన్ గా పిలువబడే కొత్త, డైరెక్ట్ మరియు మెట్లదారికాని లిఫ్ట్ మార్గమైన ఆత్మానుభూతి మార్గానికి పునాది అయ్యాయి. అతడు తన దివ్య ప్రాచీన విజ్ఞాన ప్రయోగం (జ్ఞాన విధి) ద్వారా కేవలం రెండు గంటలలో ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందచేశారు. వేలకొలది ముముక్షువులు ఈ విధానం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందినారు, ఇప్పటికీ వేలకొలది ముముక్షువులు పొందుతూనే ఉన్నారు. అక్రమమార్గం అంటే మెట్లు లేనిది, లిఫ్ట్ మార్గం లేక షార్ట్ కట్ మార్గం. క్రమ మార్గం అనగా మెట్టుతర్వాత మెట్టు క్రమంగా ఎక్కే ఆధ్యాత్మిక మార్గం. ఇపుడు అక్రమమార్గం ఆత్మానుభూతి నిమిత్తం డైరెక్ట్, షార్ట్ కట్ మార్గంగా గుర్తింపబడింది.
దాదా భగవాన్ ఎవరు? దాదా భగవాన్ ఎవరు? అనే విషయాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు :
“మీకు కన్పించేది 'దాదాభగవాన్' కాదు. మీరు చూస్తున్నది ఎ.ఎమ్. పటేల్ ని. జ్ఞానిపురుషుడనైనా నాలోపల పూర్ణరూపంలో వ్యక్తమైన భగవంతుడు 'దాదాభగవాన్'. ఆయన చతుర్దశ భువనాలకు ప్రభువు. ఆ దాదాభగవాన్ మీలోను, ప్రతి ఒక్కరిలోను కూడా ఉన్నారు. మీలో అవ్యక్త రూపంలో ఉంటే, ఇక్కడ (ఎ.ఎమ్. పటేల్ దేహంలో) సంపూర్ణంగా అభివ్యక్తమైనాడు. నేను దాదా భగవాన్ కాదు. నాలోపలి దాదాభగవాన్ కి నేను కూడా నమస్కరిస్తాను. -
జ్ఞాన (ఆత్మజ్ఞాన) ప్రాప్తికై వర్తమానలింక్
“నేను స్వయంగా సిద్ధులను (ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులను) కొద్దిమందికి ప్రసాదించబోతున్నాను. నేను వెళ్లిపోయిన తర్వాత వాటి అవసరం ఉండదా ? భవిష్యతరాల ప్రజలకు ఈ మార్గం యొక్క అవసరం ఉంటుంది, అవునా?”
- దాదాశ్రీ
Page #7
--------------------------------------------------------------------------
________________
పరమపూజ్య దాదా శ్రీ గ్రామ గ్రామమూ, దేశవిదేశాలు పర్యటించి ముముక్షువులకు సత్సంగంతోపాటు ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలిగించారు. దానితోపాటు సంఘీభావంతో కూడిన ప్రాపంచిక వ్యవహార జ్ఞానాన్ని కూడా తనను కల్సిన వారందరికీ అందించారు. ఆయన తన అవసానదశలో, 1987 చివర్లో తన కార్యాన్ని కొనసాగించే నిమిత్తం డాక్టరు నీరుబెన్ అమీనికి సిద్ధులను అనుగ్రహించారు.
పరమపూజ్య దాదాశ్రీ జనవరి 2, 1988న దేహత్యాగం చేసిన తర్వాత డా॥ నీరుబెన్ భారతదేశ గ్రామాలలోనూ, పట్టణాలలోనూ, ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలలోనూ పర్యటిస్తూ దాదా శ్రీ కార్యాన్ని కొనసాగించారు. మార్చి 19, 2006న దేహత్యాగం చేసేవరకు ఆమె అక్రమవిజ్ఞాన్కి దాదాశ్రీ ప్రతినిధిగా వున్నారు. దేహ త్యాగానికిముందు ఆమె ఆ కార్యభారాన్ని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్కి అప్పగించారు. ఆధునిక కాలంలో ఆత్మానుభూతికి సరళమూ మరియు డైరెక్ట్ మార్గంద్వారా అక్రమ విజ్ఞానాన్ని వ్యాపింపచేయటంలో డా. నీరుబెన్ సాధనం అయి ప్రముఖ పాత్రను పోషించారు. లక్షల కొలది ముముక్షువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. వారు తమ సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడాస్వేచ్ఛను, శాంతిని, ఆత్మరమణత యొక్క అనుభూతిని పొందుతున్నారు.
అక్రమ విజ్ఞాన సత్సంగం నిర్వహించే నిమిత్తం జ్ఞాని పురుష్ దాదాశ్రీ పూజ్య నీరుబెన్ అమీన్ సమక్షంలో శ్రీ దీపకాయ్ దేశాయ్కి సిద్ధిని ప్రదానం చేశారు. 1988-2006 మధ్యకాలంలో దాదా శ్రీ దిశానిర్దేశానుసారం, డా. నీరుబెన్ అమీన్ నాయకత్వంలో దేశవిదేశాలలో శ్రీ దీపక్ భాయ్ సత్సంగ్ నిర్వహించారు. ఈ అక్రమ విజ్ఞాన్ యొక్క జ్ఞానవిధులు, సత్సంగ్లు ఇపుడు పూర్తిస్థాయిలో ఆత్మజ్ఞాని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ మాద్యమం ద్వారా కొనసాగుతున్నాయి.
శాస్త్రాలలోని శక్తివంతమైన పదాలు మోక్షకాంక్షను వృద్ధి చేయటంలో సహకరిస్తూ ఆ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ముముక్షువులందరికీ ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యం. స్వరూప జ్ఞానం లేకుంటే మోక్షం లేదు. ఈ జ్ఞానం పుస్తకాలలో లభించదు. అది జ్ఞాని హృదయంలో వుంటుంది. కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రత్యక్షజ్ఞాని నుంచి మాత్రమే పొందగలం. అక్రమ విజ్ఞాన్ యొక్క విజ్ఞాన ప్రయోగం ద్వారా ప్రత్యక్ష జ్ఞానినుంచి నేడుకూడ ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఒక జ్యోతి మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు.
****
6
Page #8
--------------------------------------------------------------------------
________________
అనువాదకుని విజ్ఞప్తి అంబాలాల్ ఎమ్. పటేల్ నామధేయులైన
జ్ఞానిపురుషుని దాదా శ్రీ లేక దాదా లేక దాదాజీ గా భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ విజ్ఞాన సంబంధమైన మరియు ప్రపంచ వ్యవహార జ్ఞాన సంబంధమైన తన సత్సంగాన్ని యధాతధంగా అనువదించటం సాధ్యం కాదని ఆయన తరచూ చెప్పేవారు. అనువాద క్రమంలో లోతైన, సహేతుకమైన అర్ధం ముముక్షువులకు అందకపోవచ్చు అనికూడా దాదాశ్రీ చెప్పేవారు. గుజరాతీ భాషని నేర్చుకోవటంలోని ప్రాముఖ్యతను ఆయన నొక్కి వక్కాణించేవారు. తద్వారానే దాదా శ్రీ అమూల్యమైన బోధల సంపూర్ణసారాన్ని యధాతధంగా గ్రహించే అవకాశం ఉంటుందని దాదా మాటల సారాంశం.
అయినప్పటికీ దాదా శ్రీ తన బోధలను ఇంగ్లీషు మరియు ఇతర భాషలలోకి అనువదించటానికి, తద్వారా ప్రపంచంలోని యావత్తు ప్రజానీకానికి అందించటానికి తమ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. తనలో ప్రకటితమైన ఈ అక్రమ విజ్ఞానాన్ని ప్రపంచంలోని మానవాళి పొంది తమ బాధలనుంచి విముక్తి పొందాలని, జీవన్ముక్తిని అనుభవించాలని దాదాజీ యొక్క ప్రగాఢమైన వాంఛ. ఈ విజ్ఞానం యొక్క అద్భుతమైన శక్తులను ప్రపంచం గుర్తించి ప్రణమిల్లే రోజు వస్తుందని కూడా దాదాజీ చెప్పారు.
జ్ఞానిపురుషులైన దాదా శ్రీ బోధలను తెలుగుభాష ద్వారా తెలుగు ప్రజలకు అందించటం కోసం చేసిన చిన్న ప్రయత్న ఫలమే ఈ పుస్తకం యొక్క అనువాదం. యధాతధంగా అందించలేకపోయినా సత్సంగ సందేశాన్ని, భావాన్ని ఎటువంటి చెఱుపు లేకుండా అందించడం కోసం ఎంతో శ్రద్ధ వహించటం జరిగింది.
అనంతమైన దాదాజీ జ్ఞాన ఖజానాకి ఇది ప్రాధమిక పరిచయం మాత్రమే. ఈ అనువాదంలో ఏమైన తప్పులు దొర్లివుంటే అవి పూర్తిగా అనువాదకులవే అని గమనించగలరు. వాటి నిమిత్తమై మేము మీ క్షమను అర్ధిస్తున్నాము.
*
*
*
*
Page #9
--------------------------------------------------------------------------
________________
సంపాదకీయం తమ తప్పు ఏమీ కన్పించకపోయినప్పటికీ బాధలు వెంబడిస్తుంటే ఎవరి మనసైనా కలత చెందుతుంది. ఎక్కడ పొరపాటు జరిగిందా అని అతడు ఆశ్చర్యానికి గురౌతాడు. నా తప్పేమిటి? అనే ప్రశ్నకు సమాధానం లభించనపుడు లోపల ఉన్న న్యాయవాదుల వాదన ప్రారంభమౌతుంది. ఇందులో నా తప్పేమీ లేదు. తప్పంతా ఎదుటి వ్యక్తిదే అని వారు వాదిస్తారు. తన బాధలకు కారణం ఎదుటి వ్యక్తేనని అంతిమ నిర్ణయానికి అతడు వస్తాడు. ఆవిధంగా అతని స్వంత తప్పులు మరుగునపడి ఎదుటివ్యక్తి యొక్క తప్పులు నిరూపింపబడతాయి. ఈ విధంగా కర్మపరంపర ప్రారంభమవుతుంది. జ్ఞాని పురుషుడు దాదా శ్రీ సాధారణ మానవులకు కూడ అన్నివిధాల సహాయకారియైన ఒక సరళమైన జీవనోపయోగ సూత్రాన్ని ప్రదానం చేసారు? 'బాధపడేవానిదే తప్పు'. తప్పెవరిది? తప్పు దొంగదా లేక దోచుకోబడిన వానిదా? ఇరువురిలో ఎవరు బాధననుభవిస్తున్నారు? సొమ్ము కోల్పోయిన వారే బాధపడతారు అవునా? బాధపడేవానిదే తప్పు. దొంగ పట్టుబడి శిక్షింపబడినపుడు తర్వాత ఎపుడో బాధపడతాడు.
కానీ నేడు దోచుకోబడినవానికి తన తప్పుకి దండన లభించింది, అందుకే అతడు బాధపడుతున్నాడు. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడతడు ఫలితం అనుభవిస్తున్నాడు. అతడెవరిని నిందించగలడు? ఈ దృష్టితో చూస్తే ఎదుటివ్యక్తి (దొంగ) నిర్దోషిగా కన్పిస్తాడు. చైనా టీసెట్ నీచేతి నుంచి పడి పగిలితే ఎవరిని నీవు నిందిస్తావు? అదే టీసెట్ ఒకవేళ పనిమనిషి చేతిలో పగిలితే నీవు పనిమనిషిని నిందిస్తావు. అన్ని విషయాలలో ఇలాగే జరుగుతుంది. ఇంట్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతిచోటా ఎవరు బాధపడ్తున్నారో పరిశీలించు. ఏవ్యక్తి బాధపడితే ఆ వ్యక్తిదే తప్పు. తప్పు ఎంత వరకు ఉంటుందో అంతవరకు బాధ ఉంటుంది. ఒకసారి
నీ తప్పులన్నీ సమాప్తమైతే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికిగాని, ఏ సంఘటనకి గాని నిన్ను బాధించగల శక్తి ఉండదు.
ఈ అమూల్య సూత్రం వెనుకవున్న ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని దాదాశ్రీ ఈ పుస్తకంలో వెల్లడించారు. దైనందిన జీవితంలో ఈ సూత్రాన్ని అన్వయించుకోవటం వల్ల అన్ని చిక్కు ప్రశ్నలూ పరిష్కారమౌతాయి.
- డా. నీరుబెన్ అమీన్
Page #10
--------------------------------------------------------------------------
________________
“బాధపడే వానిదే తప్పు”
ప్రకృతియొక్క న్యాయస్థానంలో ఈ ప్రపంచంలో చాలామంది న్యాయమూర్తులున్నారు. కాని కర్మ ప్రపంచంలో ఒకే ఒక ప్రకృతి న్యాయమూర్తి ఉంటారు. ఒకే ఒక ప్రకృతి న్యాయం ఉంటుంది. 'బాధపడేవానిదే తప్పు.' ఇదే ఏకైక న్యాయం. ఈ న్యాయం సమస్త విశ్వాన్ని పాలిస్తుంది. ప్రపంచం యొక్క న్యాయం భ్రాంతి పూర్వకమైన న్యాయం, ప్రాపంచిక జీవితం శాశ్వతముగ నుండుటకు ఇదే హేతువు.
అన్ని సమయాలలో ప్రకృతి యొక్క న్యాయమే ఈ విశ్వాన్ని పాలిస్తుంది. ఎవరు అర్హులో వారు సన్మానింపబడతారు, ఎవరు అనర్హులో వారు శిక్షింపబడతారు. ప్రకృతి
యొక్క న్యాయపరిధిని దాటి ఏమీ జరగదు. ప్రకృతి శాసనము సంపూర్ణంగా న్యాయపూర్వకమైనది. కాని దానిని అర్ధంచేసికోని కారణంగా ప్రజలు దానిని అంగీకరించరు. ఎపుడు దృష్టి నిర్మలమవుతుందో అపుడు వారు ప్రకృతి యొక్క న్యాయాన్ని అంగీకరించగలుగుతారు. స్వార్ధ దృష్టి ఉన్నంతవరకు న్యాయాన్ని దర్శించలేరు. జగత్ర్పభువుకి బాధపడవలసిన అవసరం ఏమిటి?
ఈ ప్రపంచం యొక్క యాజమాన్యం మనదే. మనమే ఈ విశ్వానికి యజమానులం. అయినా మనమెందుకు బాధపడాలి? గతంలో మనం చేసిన తప్పులే వర్తమానంలోని మన బాధలకు కారణం. మన తప్పులవల్లనే మనం బంధింపబడి వున్నాం. ఒకసారి ఈ తప్పులన్నీ నాశనం గావింపబడితే మనకి ముక్తి లభిస్తుంది. నిజానికి నీవు ముక్తుడవే అయినప్పటికీ నీ తప్పుల కారణంగా బంధనాల ననుభవిస్తున్నావు.
నీవే న్యాయమూర్తివి, నీవే దోషివి, నీవే న్యాయవాదివి అయినప్పుడు న్యాయం ఎవరి పక్షాన ఉంటుంది? ఈ విధమైన న్యాయం నీకు మాత్రమే అనుకూలంగా వుంటుంది. ఎందుకంటే నీ యిష్టాన్ననుసరించే నీవు న్యాయనిర్ణయం చేస్తావు. తప్పులు
Page #11
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
నిరంతరం చేస్తూ సదా బద్ధునిగానే మిగిలిపోతావు. నీలో వున్న న్యాయమూర్తి నీ తప్పులను ఎత్తి చూపుతాడు. నీలో ఉన్న న్యాయవాది ఆతప్పుని సమర్ధిస్తాడు. ఈ విధంగా చేయటం వల్ల నీవు బద్ధుడవవుతావు. మోక్ష ప్రాప్తి నిమిత్తం, ఎవరి దోషం వల్ల ఈ బాధలు కల్గుతున్నాయనే విషయాన్ని నీవు కనిపెట్టాలి. ఎవరు బాధ పడతారో వారే సదా దోషులు. ప్రాపంచిక పరిభాషలో ఇది అన్యాయంగా తోచవచ్చు. కాని భగవంతుని భాషలో న్యాయం 'బాధపడేవానిదే తప్పు' అని చెప్తుంది. భగవంతుని న్యాయంలో బాహ్యంగా ఏ న్యాయాధీశుడూ అవసరం లేదు.
2
ప్రపంచాన్ని గురించిన యదార్ధజ్ఞానం ప్రజలకు లేదు. జన్మ తర్వాత జన్మగా అంతంలేని పరిభ్రమణకు వారిని గురిచేస్తున్న అజ్ఞానం యొక్క, లౌకిక ప్రపంచంయొక్క జ్ఞానం మాత్రమే వారికున్నది. ఎవరైనా మీ క్యాష్ బాగ్ను దొంగిలిస్తే తప్పెవరిది ? నీ క్యాష్ బ్యాగ్ మాత్రమే ఎందుకు దొంగిలించబడింది? వేరెవరిదీ ఎందుకు దొంగిలించబడలేదు? ఇరువురిలో ఇపుడు బాధపడుతున్నది ఎవరు? ఎవరు బాధపడుతున్నారో వారిదే తప్పు. నేను జ్ఞాన దృష్టితో ఉన్నదానిని ఉన్నట్లు దర్శించగలను, బాధపడేవానిదే తప్పు. సహించుటయా లేక పరిష్కారాన్ని కనుగొనుటయా?
సహన శక్తిని పెంచుకోవాలని ప్రజలు చెప్తుంటారు. కాని ఇది ఎంతవరకు నిలుస్తుంది? ఎవరైనా ఎంతవరకు సహించగల్గుతారు? సహనానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ జ్ఞానం ద్వారా కనుగొన్న పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. జ్ఞానం అనంతం. ఈ జ్ఞానం ఎంత గొప్పదంటే నీవు కించిత్ మాత్రం కూడ సహించే అవసరం ఉండదు. సహించటం అంటే లోహాన్ని నేత్ర దృష్టితో కరిగించటమే. సహనానికి చాలా శక్తి కావాలి. కాని జ్ఞానం వల్ల సహనం యొక్క అభ్యాసం లేకుండానే నీకు పరమానందంతో కూడిన ముక్తి ప్రాప్తిస్తుంది. గత కర్మ ఖాతాలు పూర్తి అవుతున్నట్లు, స్వేచ్ఛను పొందుతున్నట్లు నీవు జ్ఞానం వల్ల గ్రహించగలుగుతావు.
ఒక వ్యక్తి బాధపడుతున్నట్లయితే దానికి కారణం అతని స్వంత తప్పులే. ఒక
Page #12
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
వ్యక్తి సుఖాలను అనుభవిస్తున్నట్లయితే అది అతని పుణ్యకర్మల ఫలం. కాని ప్రపంచ చట్టం నిమిత్తుణ్ణి (కన్పించే కర్త లేక బాధకు గురి చేసిన వ్యక్తిని) నిందిస్తుంది. భగవంతుని చట్టం, నిజమైన చట్టం, నిజమైన దోషిని పట్టుకొంటుంది.
3
ఈ చట్టం సరియైనది, దీనినెవరూ మార్చలేరు. ఎవరిని గాని అకారణంగా బాధలకు గురిచేయగల చట్టం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రభుత్వ చట్టానికి కూడ అటువంటి శక్తి లేదు.
వల్ల ఏదైన విలువైన వస్తువు పగిలిపోతే నీకు దుఃఖం కల్గుతుందా? అదే వస్తువు నీ కుమారుని చేతి నుండి పడి పగిలిపోతే నీకు చింత, దుఃఖం కలుగుతాయి. నీవు గతంలో చేసిన తప్పుకి ఇది ఫలితం అని అంగీకరిస్తే నీకు చింత, దుఃఖం కలుగుతాయా? ఎదుటివారిలో దోషాలను చూడటం ద్వారా నీవు దుఃఖాన్ని, చింతలను సృష్టించుకొంటావు. ఇదంతా సహించవలసి వచ్చిందని నీవు తలుస్తున్న కారణంగా కలతచెందుతావు. ఏమి జరిగినా అది నీ పూర్వ కర్మలఫలమని గ్రహించినచో నీకు
బాధ కలగదు.
ఎదుటివ్యక్తి నిన్ను నిందిస్తున్నాడంటే అక్కడ నీ దోషం ఎంతో కొంత తప్పక ఉంటుంది. ఆ తప్పుని ఎందుకు సరిచేసుకోకూడదు? వాస్తవంలో ఇంకొకరికి దుఃఖాన్ని కల్గించగలవ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి ప్రాణి స్వతంత్రమైనది. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నట్లయితే గతంలో నీవు చేసిన తప్పులే దానికి కారణం. ఒకసారి ఈ తప్పులన్ని నాశనం చేయబడితే అనుభవించవలసింది ఏమీ మిగిలి వుండదు.
ప్రశ్నకర్త : ఈ విజ్ఞానాన్ని సరిగా అర్ధం చేసికొన్నచో, అన్ని ప్రశ్నలకు పరిష్కారం లభిస్తుంది.
దాదాశ్రీ : సరిగా అదే జరుగుతుంది. దీనిని నేను జ్ఞానంతో తీర్మానించాను, నా బుద్ధితో కాదు.
Page #13
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
దోషం ఎవరిది? నేరస్తునిదా లేక
నేరానికి బలియైన వానిదా? ప్రతిరోజూ వార్తాపత్రికలలో దొంగతనాలు, దోపిడీల గురించి నీవు చదువుతుంటావు. వాటిని చదివి మనకి కూడ అలా జరుగుతుందేమోనని చింతించవలసిన పనిలేదు. చదివిన విషయాలను గురించిగాని, వేరే విషయాలను గురించిగాని నెగెటివ్ ఆలోచనలను రానీయకూడదు. ఇది చాలా తప్పు, మనోవికల్ప దోషం. దీనికి బదులుగా నిశ్చింతగా,
సహజంగా ఎందుకు జీవించకూడదు? నీ గతకర్మఖాతాలో ఉంటేనే నీవు దోపిడీకి గురవుతావు. నీ ఖాతాలో లేనిచో, ఈ ప్రపంచంలో ఎవరూ నీ జోలికి రాలేరు. అందువల్ల నిర్భయుడవై యుండు. వార్తాపత్రికలు ఏ విషయాలనైనా వ్రాస్తాయి. నీవు వాటికి భయపడకూడదు. వేలకొలది ప్రజలు దోపిడీకి గురి అయినప్పటికీ ఆ విషయం నిన్ను కలవర పెట్టకూడదు.
నీపై ఏ ఒక్కరికీ అధికారం లేదు. ఒకవేళ నీవు దోపిడికి గురికావటం జరిగితే బాధపడుతున్నది ఎవరు? అని నీవు ప్రశ్నించుకోవాలి; సాగిపోవాలి. దొంగ కలిసాడు, దోచుకున్నాడు. దానికి బాధపడకుండా పూర్వపు ఖాతా పూర్తయిందని గ్రహించి నీవు ముందుకు సాగిపోవాలి.
ఈ ప్రపంచం దు:ఖానుభవం కోసం కాదు. సుఖానుభవం కోసం ఉద్దేశింపబడింది. ప్రజలు తమతమ కర్మఖాతాలననుసరించి ఫలాలను పొందుతారు. కొంత మంది సదా సుఖాన్నే అనుభవిస్తు ఉండగా మరికొంతమంది కేవలం దు:ఖాలను అనుభవిస్తారు. దీనికి కారణం ఏమిటి? వారు తమతో తెచ్చుకొన్న కర్మఖాతాలే కారణం.
“బాధపడే వానిదే తప్పు" అనే ఈ సూత్రాన్ని చాలా మంది పెద్ద పెద్ద అక్షరాలతో తమ యిళ్లలో గోడల పై వ్రాసుకొన్నారు. ఎపుడైనా వారికి దు:ఖానుభవం కలిగితే తప్పు ఎవరిది? అనే విషయాన్ని ఈ సూత్రం వారికి గుర్తు చేస్తుంది.
ఎవరైనా సరే జీవితాంతం, జీవితంలోని ప్రతి సందర్భంలో ఈ వాక్యాన్ని గుర్తుంచుకొని, సరైన అవగాహనతో దీనిని అన్వయించుకొన్నచో అతనికి వేరే గురువు యొక్క అవసరం లేదు. అతనిని మోక్షానికి తీసికెళ్లటానికి ఈ వాక్యం చాలు.
Page #14
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
మహావాక్యం “బాధపడేవానిదే తప్పు” ఈ వాక్యం చాల శక్తివంతమైనది. పుణ్యఫలంగా ఈ వాక్యం సహజంగా దానంతట అదే నాకు అంతరంగం నుంచి లభించింది. ఇది చాలా శ్రేష్ఠమైనది మరియు చాలా అర్ధవంతమైనది. ఈ వాక్యం పై ఒక పుస్తకమే వ్రాయవచ్చు.
ఈ వాక్యం సగం పజిల్ ని పరిష్కరిస్తుంది, మిగిలిన అర్ధభాగాన్ని 'సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్' (వ్యవస్థిత్) పరిష్కరిస్తుంది. ఒకవేళ నీకు బాధ కలిగితే దానికి కారణం నీ దోషమే, ఎవరినీ నిందించకూడదు. లౌకిక దృష్టిలో దు:ఖాన్ని కల్గించినవాడు దోషిగా పేర్కొనబడతాడు. కాని భగవంతుని చట్టం ప్రకారం బాధపడేవానిదే తప్పు; దుఃఖాన్ని అనుభవిస్తున్నది ఎవరో వారే దోషి.
ప్రశ్నకర్త : కాని బాధను కలిగిస్తున్న వ్యక్తి కూడ ఏదో ఒక రోజు బాధపడవలసి ఉంటుందా? దాదాశ్రీ : అతడు బాధపడే రోజున దోషిగా పరిగణింపబడతాడు.
కానీ ఈ రోజు నీ దోషం నిన్ను పట్టుకొన్నందువల్ల నీవు బాధపడ్తున్నావు.
తప్పు తండ్రిదా లేక కొడుకుదా? ఒక ధనవంతుడైన వ్యాపారికి అర్ధరాత్రి త్రాగి ఇంటికొచ్చే తన కుమారుని వల్ల సమస్య ఏర్పడింది. కుమారుని రాకకోసం తండ్రి రోజూ ఎదురు చూస్తు ఉంటాడు. ఎపుడైనా కొడుకుని ఇదేమిటని ప్రశ్నించబోతే, అతడు గట్టిగా అరుస్తూ తండ్రిని తిడుతూ తన గదిలోకి వెళ్లిపోతాడు. కొడుకు హాయిగా గాఢనిద్రపోతాడు. తండ్రి మాత్రం అతని గురించి చింతిస్తూ రాత్రంతా మేల్కొనే ఉంటాడు. ఈ సమస్యతో ఆ వ్యాపారి నా దగ్గరకు వచ్చాడు. నేనతనికి ఇలా చెప్పాను: “బాధపడుతున్నది నీవే కనుక తప్పు నీదే". తప్పు కొడుకుది కాదు, ఎందువల్లనంటే అతనుగాని, మిగిలిన కుటుంబ సభ్యులుగాని బాధపడటం లేదు. అతని తల్లి (వ్యాపారి భార్య) కూడ ప్రశాంతంగా నిద్రిస్తుంది. 'నీ పూర్వ జన్మలో నీవతనికి బాధ కల్గించినందున ఇపుడు నీకు కుమారుడై దానిని నీకు తిరిగి చెల్లిస్తున్నాడు. నిన్ను గౌరవించే మిగిలిన ముగ్గురు కుమారుల వల్ల నీవు ఆనందాన్ని ఎందుకు పొందకూడదు?' అని నేను వ్యాపారికి చెప్పాను. ఈ దు:ఖాలు
Page #15
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
బాధలు అన్నీ ఎవరికి వారు కోరి తెచ్చుకొన్నవే. ఈ ప్రపంచాన్ని అర్ధం చేసికోవటం చాలా ముఖ్యం.
ఒకరోజు నేను అతని కొడుకుని యిలా అడిగాను: 'నీ తండ్రికి అంత దు:ఖాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? అలా చేస్తున్నందుకు ఏ
రోజైనా పశ్చాత్తాపం చెందావా?” దానికతడు తనకి కావలసినంత సమయం ఉన్నదని, తండ్రి సంపదని అనుభవించే అదృష్టం లభించినపుడు సంతోషంగా ఉండటంలో తప్పేమిటని సమాధానమిచ్చాడు. ఏమైనప్పటికీ ఇతడు సమయం వచ్చినపుడు తన తప్పులకు ఫలితం అనుభవిస్తాడు. ప్రస్తుతం ఎవరు బాధపడుతున్నారో, చింతిస్తున్నారో వారే దోషి. ప్రకృతి యొక్క ఈ ఒక్క శాసనాన్ని అర్ధం చేసికొన్నచో మీ కోసం మోక్షమార్గం తెరవబడుతుంది.
కుమారుని మంచి దారిలో పెట్టడానికి, అతనికి హాని కల్గించనిది, లాభదాయకం అయినదీ అయిన ఏదైనా మార్గాన్ని కనిపెట్టమని నేను ఆవ్యాపారికి చెప్పాను. ఆ మార్గంలో కుమారునికి కావలసిన ఆర్ధిక సహాయంగానీ, వేరే సహాయం గానీ చేయమని కూడ చెప్పాను.
ప్రశ్నకర్త : పిల్లలపట్లగల మమత, బాధ్యత వల్లనే తల్లిదండ్రులు బాధపడుతున్నారా? దాదాశ్రీ : వారి బాధలకు ప్రధాన కారణం వారి తప్పులే. వారికి గల మమత, బాధ్యత కూడ కొంతవరకు కారణం. ఇంకా ఎన్నో యితర కారణాలున్నాయి. నీవు బాధపడుతున్నట్లయితే అది నీ దోషమే అని గ్రహించటం అత్యంత ముఖ్యం. అందువల్ల ఎవరి దోషాలనూ చూడవద్దు, లేనిచో రాబోయే జన్మకి నీవు కొత్త ఖాతాలను సృష్టించుకొంటావు.
రెండు రకాలైన శాసనాలున్నాయి : ఒకటి ప్రకృతి శాసనం, రెండవది మానవశాసనం. ప్రకృతి శాసనాన్ని నీవు అంగీకరించినచో జీవితం సరళము, సులభమూ అవుతుంది. మానవ శాసనాన్ని నీవు స్వీకరిస్తే చిక్కులు, బాధలు తప్పవు.
ప్రశ్నకర్త : దాదా! ఎవరైనాగాని తమ తప్పుల్ని తాము గుర్తించవలసి వున్నదా లేదా ?
Page #16
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
దాదాశ్రీ : తన తప్పులను తాను కనిపెట్టగల శక్తి ఎవరికీ లేదు. ఆ తప్పులను చూపగల నమ్మకమైన ఒక వ్యక్తి అతనికి కావాలి. ఒకసారి అతని తప్పుల్ని అతనికి చూపిస్తే ఆ తర్వాత తప్పుల్ని గుర్తించగల నైపుణ్యం అతనికి వస్తుంది.
7
జీవితాన్ని ఎలా జీవించాలో ముందుగా నేర్చుకోవాలి. ఒకసారి యింట్లో ఘర్షణలు ఆగిపోతే అపుడు మిగిలిన విషయాలను నేర్చుకోవచ్చు. బాధపడేవానిదే తప్పు అని నీవు గ్రహించినట్లయితే ఇంట్లో పోట్లాటలు ఉండవు. ఒకవేళ మీ అత్తగారు నిన్ను బాధించినట్లయితే, రాత్రి ఆమె గాఢనిద్ర పోతున్నప్పటికీ నీకు నిద్రపట్టక పోతే తప్పునీదేనని నీవు గుర్తించాలి.
ఎదుటివ్యక్తి అర్ధం చేసుకోకుంటే?
ప్రశ్నకర్త : : మన ప్రవర్తన ఎంత స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కొంత మంది అర్ధం
చేసికోరు.
దాదా శ్రీ : వారు అర్ధంచేసికొనక పోవుటకు కూడ తప్పు మనదే. goo చేసికొనగల వ్యక్తులు మనకెందుకు దొరకలేదు? వీరి సంయోగమే మనకెందుకు లభించింది?
ప్రశ్నకర్త : గతంలో అటువంటి కర్మలు చేసినట్లు గ్రహించాలా?
దాదాశ్రీ : తప్పక గ్రహించాలి. నీకు కించిత్ మాత్రం కూడ బాధ కల్గించగలవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒక వేళ ఎవరైన నీకు బాధ కల్గించినచో అతడు కేవలం నిమిత్తుడు (పరికరం) మాత్రమే.
ఒక జంట జగడమాడుకొని తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే నిద్రకి ఉపక్రమిస్తారు. భార్య ప్రశాంతంగా నిద్రిస్తుంది. కాని భర్త అశాంతిగా ప్రక్కలో దొర్లుతుంటాడు.దానిని బట్టి అతనిదే తప్పు అని మనం గ్రహించాలి. భార్య బాధపడటం లేదు. ఒకవేళ భార్యప్రక్క మీద దొర్లుతుంటే, భర్త గురకపెట్టి నిద్రిస్తుంటే అపుడు భార్యది తప్పు. తప్పు ఎవరిదైతే వారు బాధపడతారు. ఇది చాలా నిగూఢమైన విజ్ఞానం. ఈ ప్రపంచం ఎపుడూ నిమిత్తుణ్ణి నిందిస్తుంది.
Page #17
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
8
దీనిలో న్యాయం ఎక్కడ ?
ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎంతో నియమబద్ధంగా నడుస్తుంది. ఇది అబద్ధంకాదు. ప్రకృతి శాసనాలు ప్రపంచాన్ని క్రమబద్ధంగా ఉంచుతాయి. ఒక బస్సు బస్సు స్టాపుని సమీపిస్తున్న సమయంలో డ్రైవరు బస్సుపై నియంత్రణను కోల్పోయినందువల్ల బస్సుకై ఎదురుచూస్తున్న ఒక స్త్రీ మీదుగా బస్సు వెళ్లింది. ఆమె అక్కడికక్కడే మరణించింది. ప్రజాసమూహం అచ్చట చేరి బస్సు డ్రైవరుని నిందించటం, అతనిపై అరవటం ప్రారంభించారు. తన దోషం ఏమీలేకుండానే ఆ స్త్రీ చనిపోయిందని, డ్రైవరు యొక్క నిర్లక్ష్యానికి అతనిని ఖైదు చేయాలని ఉద్రిక్తులైన ప్రజలు చెప్తారు. ఆ స్త్రీ తన పూర్వ జన్మలో చేసిన తప్పు కారణంగానే మరణించిందని, ఆమె తప్పే ఆమెను ఈ రోజు పట్టుకొని శిక్షించిందని ప్రజలు గ్రహించరు. డ్రైవరుని అతని దోషం పట్టిచ్చినపుడు డ్రైవరు శిక్షింపబడతాడు.
అతడికి న్యాయస్థానం వుంది. అక్కడ అతను దోషిగా నిరూపించబడవచ్చు, లేకపోవచ్చు. పూర్వపు ఖాతా లేకుండా ఎవరూ ఎవరినీ బాధించలేరు. ఆ స్త్రీ తన పూర్వపు ఖాతాను సెటిల్ చేసికొంది, అనగా గతంలో చేసిన కర్మకు ఫలం అనుభవించింది. ఈ సంఘటనలో బాధపడింది స్త్రీకనుక దోషం ఆమెదే అని నీవు గ్రహించాలి. డ్రైవరు పట్టుబడినపుడు అతను దోషి అవుతాడు. ఈ రోజున ఎవరు పట్టుబడితే వారిదే దోషం.
ఇటువంటి సంఘటనలను చూసినపుడు కొంతమంది భగవంతుడు లేడనే నిర్ణయానికొస్తారు. మరి కొంతమంది భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోతారు. భగవంతుడు ఇలా ఎందుకు జరగనివ్వాలి? అని వారు ప్రశ్నిస్తారు. ఈ ప్రజలు సత్యాన్ని గ్రహించటంలేదు. ఇవన్నీ వారివారి ఖాతాల ప్రకారమే జరుగుతున్నాయని, వారి వారి దోషాలనుంచి ముక్తులౌతున్నారని ప్రజలు అర్థం చేసికోవటం లేదు. ఈ ఖాతాలు కేవలం ఈ ఒక్క జన్మకి సంబంధించినవి కావు. ప్రకృతి శాసనాలు న్యాయపూర్ణమైనవి. ఆ స్త్రీ బస్సు క్రింద నలిగి చనిపోవటం కూడా న్యాయమే. ఈ ప్రపంచం పూర్తిగా న్యాయబద్ధమైనది.
Page #18
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు ఒకవేళ ప్రకృతి న్యాయం ప్రకారం డ్రైవరుది తప్పు అయినచో అతడు వెంటనే అరెస్టు చేయబడేవాడు. ఇపుడు వాస్తవానికి తప్పు అతనిది కాదు, కాని అతడు క్రొత్త తప్పుని సృష్టించుకొన్నాడు. అతను శిక్షింపబడినపుడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ స్త్రీ తన తప్పునుంచి విముక్తి పొందటానికి డ్రైవరు కారణభూతుడయ్యాడు; ఈ సంఘటనలో అతడు స్వయంగా బందీ అయ్యాడు.
యాక్సిడెంట్ అనగా ఈ ప్రస్తుత కాలంలో ఎన్నో సంఘటనలు, యాక్సిడెంట్లు ప్రజలను కలవరపరుస్తున్నాయి. యాక్సిడెంట్ అనగా నేమి ? అసంఖ్యాకమైన కారణాలు ఒకే సమయంలో కలిస్తే అది యాక్సిడెంటు అనబడుతుంది. ఒకే సమయంలో చాలా కారణాలు కలిస్తే అది సంఘటన ఇన్సిడెంట్) అవుతుంది. అందువల్లనే నేను 'బాధపడేవానిదే తప్పు' అని చెప్తాను. ఎదుటి వ్యక్తి పట్టుబడినపుడు అది అతని తప్పు అని గ్రహించాలి.
ఒకవ్యక్తి దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రజలతనిని దొంగ అని పిలుస్తారు. ఒక ఆఫీసులో ఒక వ్యక్తి మాత్రమే దొంగతనం చేస్తూ దొరికితే, ఆ ఆఫీసులో వేరెవరూ దొంగలు లేరని అర్ధమా ?
ప్రశ్నకర్త : కాదు. దాదా శ్రీ : పట్టుబడేవరకు నిజాయితీ పరులుగానే వారు పరిగణించబడతారు. ప్రకృతి యొక్క చట్టాన్ని ఇంతవరకు ఎవరూ నిర్వచించలేదు. ఈ చట్టం సంక్షిప్తమైనది మరియు స్పష్టమైనది. అందువల్ల వెంటనే పరిష్కారమవుతుంది. బాధపడేవానిదే తప్పు అని కేవలం అర్ధం చేసికొన్నచో ప్రాపంచిక జీవిత భారం చాలా వరకు తగ్గిపోతుంది.
భగవంతుని శాసనం ఏమి చెప్తుందంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వ్యక్తి బాధపడతాడో అతడే దోషి. ఒక వ్యక్తి యొక్క పర్సును దొంగిలించినపుడు జేబు దొంగ సంతోషంగా ఉంటాడు. దొంగిలించిన ఆ డబ్బుతో అతడు జెల్సా చేస్తాడు, కాని పర్సు పోగొట్టుకొన్నవాడు బాధ పడుతుంటాడు. అందువల్ల తప్పు పర్సు పోగొట్టుకొన్న వానిదే. అతడు గతజన్మలో దొంగతనం చేసి ఉంటాడు, అందువల్ల ఈ జన్మలో పట్టుబడి
Page #19
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
తన తప్పులకు మూల్యం చెల్లిస్తున్నాడు. ప్రకృతి శాసనం ప్రకారం పర్సు పోగొట్టుకొన్నవాడే ఈ రోజు దోషిగా పరిగణింపబడతాడు. పర్సును దొంగిలించిన వ్యక్తి పట్టుబడిన రోజున దొంగగా పిలవబడతాడు.
నేను మీలో తప్పులను చూడను. కానీ ప్రజలు తమ బాధలకు ఇతరులను నిందిస్తారు. తమ బాధలకు ఇతరులను బాధ్యులుగా తలంచటంవల్ల, నిందించటం వల్ల వారి తప్పులు రెట్టింపు అవుతాయి, అంతేకాక జీవితంలో వారి సమస్యలు కూడా పెరుగుతూవుంటాయి. దీనిని నీవు అర్ధం చేసుకొంటే సమస్యలు తగ్గుతాయి.
ప్రకృతి వైపరీత్యాలకు కారణం గుజరాత్ లోని మోర్బీ పట్టణంలో సంభవించిన వరదలకు కారణం ఎవరు? దీనిని కనుక్కోండి. స్పష్టమైన అవగాహన కొరకు ఈ సంఘటనను మీరు రెండు కోణాలలో చూడాలి. బాధపడేవారు అది తమ గత దోషాలకు ఫలం అని గ్రహించాలి. ఈ వైపరీత్యాన్ని దర్శించేవారు బాధితులకు అన్ని విధాలైన సహాయసహకారం అందించాలని తలంచాలి, బాధితులకు చేయూత నివ్వ ప్రయత్నించాలి.
మానవ చట్టం కళ్ళతో చూచినదానిని బట్టి దోషాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతి చట్టం బాధకు గురైనవానిని దోషిగా నిర్ణయిస్తుంది. ప్రజలు ప్రభావితమయ్యేది జ్ఞానంవల్లనా లేక బుద్ధి వల్లనా ?
ప్రశ్నకర్త : మనం వార్తాపత్రికలలో వరదలు, ఇంకా ఇతర విపత్తుల గురించి చదివినపుడు ఆ వార్తలు మనల్ని కలవరపరుస్తాయి. ఒకవేళ అటువంటి వార్తలు మన పై ఏమాత్రం ప్రభావం చూపలేదంటే అది మన జడత్వం అని తలచాలా ? దాదాశ్రీ : చెడ్డవార్తల వల్ల ప్రభావితం కాకపోవటం జ్ఞాన మనబడుతుంది. ప్రశ్న కర్త : ఒకవేళ అది మనల్ని ప్రభావితం చేస్తే, దానినే మనాలి ? దాదా శ్రీ : అది బుద్ధి అనబడుతుంది. బుద్ధివల్లనే ఈ సంసారం ఏర్పడింది. బుద్ధి వల్ల కార్యసిద్ధి ఏమీ జరగదు. అది నిన్ను ఉద్వేగానికి గురిచేస్తుంది అంతే.
Page #20
--------------------------------------------------------------------------
________________
11
బాధపడేవానిదే తప్పు
భారత - పాకిస్థాన్ యుద్ధసమయంలో ప్రజలు బాంబులు పడతాయేమోనని భీతిచెందారు. అటువంటి భయాలు బుద్ధికారణంగానే కలుగుతాయి. ఈ ప్రాపంచిక జీవితానికి కారణం బుద్ధి. దుర్వార్తలు విన్న సమయంలో కూడా జ్ఞానం మీకు ప్రశాంతతని, సమాధానాన్ని కల్గిస్తుంది. నీ చుట్టు ప్రక్కల జరుగుచున్న ప్రతి విషయానికి నీవు 'జ్ఞాత' మరియు 'ద్రష్ట'గా మాత్రమే వుండాలి. ఏదీ నిన్ను ప్రభావితం చేయకూడదు.
నీవు కేవలం తెల్సుకోవాలి మరియు చూడాలి అంతే. వార్తలు వివరాలతో సహా తెలుసు కోవటాన్ని తెల్సుకోవడమంటారు. విస్తృత వివరణ లేకుండా కేవలం హెడ్ లైన్స్ మాత్రమే చూస్తే దానిని చూడటం అంటారు. ఎవరినీ దోషులుగా భావించరాదు.
ప్రశ్నకర్త : ఇవి ప్రస్తుత కాలచక్రం యొక్క దోషాలా?
దాదాశ్రీ : కాలాన్ని మాత్రం ఎందుకు నిందించాలి? ఆ తప్పు బాధపడే వానిదే. కాలం సదా పరివర్తన చెందుతూనే వుంటుంది. మంచి కాలంలో మాత్రం మనం లేకుంటిమా ? ఇరువది నాల్గుమంది తీర్థంకరుల కాలంలో మనం లేకుంటిమా?
ప్రశ్నకర్త : మనం ఉన్నాం. దాదాశ్రీ : ఆ సమయంలో మనం ప్రాపంచిక సుఖాలలో మునిగిపోయాం. దానితో కాలానికి ప్రమేయం ఏమిటి ? కాలం దానంతట అదే సాగిపోతుంటుంది. నువ్వు పగటిపూట ఏపనీ చేయకపోయినంతమాత్రాన,
రాత్రిరాకుండా ఉంటుందా ?
ప్రశ్నకర్త :
రాత్రి అవుతుంది. దాదాశ్రీ : నీవు రెట్టింపు ధర చెల్లించటానికి యిష్టపడినప్పటికీ,
రాత్రి 2 గంటల వేళ ఎవరైనా నీకు బరాణీలు అమ్మటానికి సిద్ధపడతారా ?
ప్రజల దృష్టిలో ఇది అన్యాయము ఒక వ్యక్తి మోటారు బైక్ పై రోడ్డుకి రాంగ్ సైడులో వెళ్తూ ఒక సైక్లిస్టుని గుద్దుతాడు. ఆ సైక్లిస్టు కాలు విరుగుతుంది. ఇపుడు బాధపడేది ఎవరు ?
ప్రశ్నకర్త : సైక్లిస్టు.
Page #21
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
12
దాదా శ్రీ : అవును. అతని పూర్వపు ఖాతా వల్లనే అలా జరిగింది.
ప్రశ్నకర్త : కానీ గాయపడిన సైక్లిస్టు దోషం ఏమిటి? దాదా శ్రీ : ఆ దోషం అతని పూర్వ జన్మలోనిది, ఈ రోజు అది సెటిల్ అవుతున్నది. పూర్వపు ఖాతాలవల్ల మాత్రమే ఎవరైనా బాధలనుభవిస్తారు. గత కర్మ ఖాతాలు ఎప్పుడు ఫలంయిస్తే అపుడు బాధకల్గుతుంది. ఈ ప్రపంచంలో చాలా మంది ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు ఎందువల్ల? కర్మఫలం లేకుండా ఏమీ జరగబోదనే విషయం వారికి తెలుసు.
ప్రశ్నకర్త : ఈ బాధలను ఆపుచేయటకు ఏదైనా ఉపాయం ఉన్నదా? దాదాశ్రీ : ఒకే ఒక్క ఉపాయం వుంది అది మోక్షం; జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందటం. నీవు యితరులకు కించిత్ మాత్రం కూడా బాధను కలుగచేయకుండా ఉంటూ, యితరులు నీకు కల్గించే బాధలను స్వీకరించినచో నీ పూర్వపు ఖాతాలు సెటిల్ అయిపోతాయి. నీవు ముక్తి పొందుతావు.
ప్రశ్నకర్త : సైక్లిస్టు దానిని తన కర్మఫలంగా భావించి, స్కూటరు వ్యక్తి నుంచి నష్టపరిహారాన్ని కోరకుండా ఉండాలా?
దాదాశ్రీ : అతను ఏమీ చేయకూడదని చెప్పటం లేదు. ఆ కారణంగా అతని మనస్సు పై ఎటువంటి పరిణామం కలుగకూడదని మాత్రమే చెప్తున్నాను. వ్యవహారిక దృష్టిలో చేయవలసినది ఏదైతే ఉందో దానినతడు చేయాలి. కాని స్కూటరిస్టు పట్ల ఏవిధమైన రాగద్వేషాలు చోటుచేసికోకూడదు. ఎవరు తమ తప్పుని ఒప్పుకొంటారో వారికి రాగద్వేషాలు కలుగవు.
ప్రాపంచిక వ్యవహారంలో చేయవలసినదంతా తప్పక చేయాలి. పోలీసు నీ పేరు అడిగితే పేరు చెప్పాలి. ప్రపంచంలో నీ పాత్రని నీవు పోషించాలి, బాధ్యతలను కూడా నెరవేర్చాలి. కాని ఏ విధమైన రాగద్వేషాలు లేకుండా నాటకంలోని నటునిలా వీటిని నీవు నిర్వర్తించాలి. ప్రపంచం తన కళ్లతో చూసిన దానిని మాత్రమే అంగీకరిస్తుంది. కనుక ఒక సాక్షిగా నీవు నీ సాక్ష్యాన్ని చెప్పాలి. స్కూటరిస్టుపట్ల నీకే విధమైన రాగద్వేషాలు
Page #22
--------------------------------------------------------------------------
________________
13
బాధపడేవానిదే తప్పు
ఉండకూడదు. ప్రజలు తాము చూచినదానినిబట్టి స్కూటరిస్టుని నిందిస్తారు. అజ్ఞానం వల్ల వారు దీనిని అన్యాయంగా దర్శిస్తారు.
ప్రశ్నకర్త : నిజమే. దాదా శ్రీ : ఒకవ్యక్తి నీకు బాధ కల్గిస్తుంటే, అది అతని తప్పు కాదు. బాధపడ్తున్నది నీవైనచో ఆ తప్పునీదే. ఇది ప్రకృతి యొక్క శాసనము. ప్రపంచ శాసనం ఏమి చెప్తుంది అంటే ఎవరు దు:ఖాన్ని కలుగచేస్తున్నారో వారిదే తప్పు. ఈ సూక్ష్మ విషయాన్ని అర్ధం చేసికొన్నచో మనిషి యొక్క కఠిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.
నిన్ను కర్మబంధాలనుంచి విడిపించిన వ్యక్తిపట్ల కృతజ్ఞత ఒక అత్తగారు ఎపుడూ తన కోడల్ని వేధిస్తూ ఉంటుంది. అత్తగారు తనతో ఎలా వ్యవహరించినప్పటికీ కోడలు దిగమ్రింగుతుంది. పగలూ రాత్రి ఆమె అత్తగారితిట్ల గురించే ఆలోచిస్తుంది. ఇది ఆమె జీవితాన్నే దు:ఖమయం చేయదా?
ప్రశ్నకర్త : అవును. దాదా శ్రీ : ఆమె దు:ఖం ఆమె శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నిరాదరణవల్ల ఆమె సరిగా ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఆమెకు ఏ విధంగా సహాయ పడగలం? అది ఆమె పూర్వజన్మ కర్మఫలమని, ప్రస్తుత పరిస్థితులను ఆమె సహించుకోవాలని మనం ఆమెకు వివరించాలి. మనం ఆమెకు తన ఖాతాలను ఎలా సెటిల్ చేసికోవాలో చూపించాలి. తప్పు అత్తగారిది కాదు, బాధపడేవారిదే. వివరించి చెప్పటం వల్ల ఆమె తన అత్తగార్ని నిందించటం మానివేస్తుంది, ప్రశాంతంగా ఉండగల్గుతుంది. తనను కర్మబంధాలనుంచి విడిపిస్తున్నందుకు అత్తగారి పట్ల కృతజ్ఞతా భావం ఏర్పడుతంది.
ఈ విశ్వంలో ఎవరూ దోషులుకారు. ఇతరులను నిందించేవారిదే తప్పు. ఇతరులను దోషులుగా చూచేవారే దోషులు. ప్రతి ఒక్కరూ తమ కర్మానుసారం ఎవరు దేనికి అర్హులో దానిని పొందుతారు. వారు కొత్తగా తప్పులను ఈ రోజు సృష్టించుకోవటం లేదు. ఇప్పటి స్థితి గతకర్మల ఫలస్వరూపం. ఈ రోజు అతడు పశ్చాత్తాప పడుండవచ్చు;
Page #23
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
కాని క్రిందటి జన్మలో ముందుగానే అతడు కాంట్రాక్టు ఏర్పరచుకొన్నందున దానిని పూర్తిచేయటం తప్ప అతనికి వేరే దారిలేదు.
ఈ ప్రపంచంలో తప్పెవరిదో నీవు తెలుసుకోదల్చుకొంటే బాధపడేది ఎవరో కనుక్కో. తప్పు బాధపడేవానిదే. అత్తాకోడళ్ల మధ్య సమస్యలు వస్తుంటాయి. వారు ఒకరినొకరు నిందించుకొంటూనే ఉంటారు. అత్తగారు కోడల్ని వేధిస్తుందా లేక కోడలు అత్తగార్ని బాధిస్తుందా? ఒకవేళ అత్తగారు బాధపడున్నట్లయితే ఆమె దానిని తన కర్మఫలంగా భావించాలి; అలాగే కోడలుకూడ తాను బాధపడుతున్నప్పుడు. వారిరువురు ఒకరినొకరు నిందించుకోవటం కొనసాగితే వారు కొత్త ఖాతాలు సృష్టించుకొంటారు. వాటిని మరుజన్మలో అనుభవించవలసి వస్తుంది. జ్ఞాని చెప్పిన “బాధపడేవానిదే తప్పు” అనే జ్ఞానవాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవటం ద్వారా మాత్రమే ఖాతాలు ముగిసిపోతాయి.
నీవు ఈ ప్రపంచం నుంచి విముక్తి పొందగోరితే మీకు లభించింది ఏదైనా స్వీకరించాలి, అది మంచి కావచ్చు లేక చెడు కావచ్చు. ఈ విధంగా నీ ఖాతాలు పూర్తవుతాయి. ఈ ప్రపంచంలో ఒకరి చూపు ఇంకొకరి చూపుతో కలవటం కూడా ఖాతాలో లేకుండా జరగదు. దీనిని బట్టి గత జన్మఖాతాలు లేకుండా ఏ సంఘటనయినా చోటు చేసికోదని స్పష్టమవుతుంది. వాటిని సంతోషంగా స్వీకరిస్తే ఖాతాలు పూర్తి అవుతుంటాయి. నీవు వాటిని అంగీకరించనిచో బాధపడవలసివస్తుంది.
“బాధపడేవానిదే తప్పు”. చాలా ప్రయోజనకరమైన వాక్యంగా ప్రజలు దీనిని గుర్తించారు. దీనిని కని పెట్టినందుకు దిగ్రమ కూడా చెందారు.
శారీరక గాయాలు-తప్పెవరిది? జీవితంలో ఒకరు కర్త అయినపుడు దాని ఫలితాలను అనుభవించాలి. కర్తృత్వ భావన తప్పుడు విశ్వాసం.
ఒక యంత్రం గేర్లలో నీవేలు చిక్కుకుంటే, ఆ తప్పు యంత్రానిదా? ఆ తప్పు నీదేనని నీవు గుర్తిస్తావు. అదే విధంగా నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక యంత్రం వంటివారు. వారు అస్వతంత్రమైన మెషీన్ గేర్ల వంటివారు కానిచో ఏ భార్యలూ తమ భర్తలను బాధించరు. ఏ భర్తలూ తమ భార్యలను గాయపర్చరు. ఏ తల్లిదండ్రులూ
Page #24
--------------------------------------------------------------------------
________________
15
బాధపడేవానిదే తప్పు
పర్యంగా
తమ పిల్లల్ని కొట్టరు, పిల్లలు తమ తల్లిదండ్రులకు దు:ఖాన్ని కల్గించరు. ప్రజలంతా తమ యిళ్లలో సుఖంగా ఉండేవారు. ఈ పిల్లలు, భర్తలు, భార్యలు అందరూ యంత్రాలుతప్ప వేరేమీకాదు.
పర్వతాన్ని తిరిగి రాళ్లతో కొద్దామా? ప్రశ్నకర్త : ఎవరైనా మన పై రాతినివిసిరి గాయపరిస్తే మనకి కోపం వస్తుంది. దాదా శ్రీ :
రాయి విసిరింది మనిషి కనుక వారి పై నీవు కోపగిస్తావు. ఒకవేళ ఒకరాయి పర్వత శిఖరం పై నుంచి దొర్లి నీనెత్తి పైపడి రక్తస్రావం మొదలైతే ఏంచేస్తావు.?
ప్రశ్నకర్త : అపుడు, నా కర్మవల్లనే నేను గాయపడ్డానని అర్ధం చేసికొంటాను, ఆ పరిస్థితి వేరు. దాదా శ్రీ : పర్వతంపై నీకు కోపం రాదా?
ప్రశ్నకర్త : లేదు. దానిని ఎవరూ విసరలేదు కనుక కోపగించే ప్రసక్తే లేదు. దాదాశ్రీ : ఈ విషయంలో నీకు వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వివేకం నీకు తనంత తానుగా సహజంగా కల్గింది. నీపై రాళ్లు విసిరినపుడు, నిన్ను కసిరినపుడు, నిన్ను తిట్టినపుడు, నీ సొమ్ము దొంగిలించినపుడు కూడా ఈ ప్రజలంతా ఇదే మాదిరిగా పర్వతంవంటివారే. వారిలో నిజమైన చైతన్యం లేదు. ఇంతమాత్రం నీవు అర్ధం చేసికొంటే నీకెంతో మేలు కల్గుతుంది.
నీ ఆంతరంగిక శత్రువులైన క్రోధం, గర్వం, దురాశ, మోహము నీకు ఇతరులలో దోషాలను చూపిస్తాయి. ఆత్మదృష్టి ఇతరులలో దోషాలను చూడదు. ఇతరుల దోషాలను చూసేలా ఒకరిని తయారు చేసేది ఈ అంతరంగ శత్రువులే. ఎవరిలో అంతరంగ శత్రువులు లేరో, అతనికి యితరుల దోషాలను చూపేవారు ఎవరూ ఉండరు. అంత: శత్రువులు లేని వ్యక్తికి నిజానికి ఇతరులలో ఏ దోషమూ కన్పించదు. వాస్తవానికి దోషులు ఎవరూ లేరు. 'నేను చందూలాల్' అని నీవు తప్పుగా భావించటం వల్ల ఈ శత్రువులు నీలో ప్రవేశించాయి. ఈ అంత: శత్రువులు నీ బలహీనతలు. 'నేను చందూలాల్' అనే రాంగ్ బిలీఫ్ పోయినట్లయితే ఈ బలహీనతలు అదృశ్యమైపోతాయి. ఎంతో కాలంగా ఆక్రమించుకొన్న యింటిని ఖాళీ చేయటానికి వాటికి ఆ తర్వాత కూడా కొంత సమయం పడుంది.
Page #25
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
16
మంచి సంస్కృతి విలువలు
ప్రశ్నకర్త : ఒక వ్యక్తి తన స్వంత తప్పుల కారణంగా బాధపడ్తుంటాడు. ప్రజలు అతనిపై దయచూపి, ప్రశ్నలవర్షం కురిపిస్తారు. నిజానికి వారు అనావశ్యకంగా జోక్యం చేసుకొంటున్నారు. ఎందువల్లనంటే వారు అతని బాధను తొలగించలేరు. స్వకర్మ ఫలాన్ని అతడు అనుభవిస్తున్నాడు.
దాదాశ్రీ : మన మంచి సంప్రదాయ విలువల కారణంగా ప్రజలు దయ చూపటం, పరామర్శించటం చేస్తారు. వ్యాధిగ్రస్తుణ్ణి అతని ఆరోగ్యం గురించి ప్రశ్నించటం ద్వారా వారతనికి ఓదార్పునిస్తారు. వారి దయ అతనికి ఊరటనిస్తుంది. అది ఎంతో విలువైనది, అతని బాధను మరిపింపజేస్తుంది.
గుణించటం లేదా భాగించటం
కలపటం మరియు తీసివేయటం ఇవి రెండూ సహజమైన సర్దుబాట్లు. ప్రజలు తమ బుద్ధిని ఉపయోగించి సదా గుణించడం, భాగించటం చేస్తుంటారు. వారు తమ సంపదని వృద్ధి చేయటంలో నిమగ్నమై ఉంటారు. తమ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలా మరియు సంపదను ఎలా వృద్ధి చేయాలా అని చింతిస్తూనే వారు నిద్రిస్తారు. అలా చేయటం ద్వారా వారు సుఖాలను గుణిస్తున్నారు, దుఃఖాలను భాగిస్తున్నారు.
సుఖాలను గుణించుకోవటం ద్వారా భయంకర దుఃఖప్రాప్తి కల్గుతుంది. దు:ఖాలను భాగించినప్పటికీ అతని బాధలు తగ్గవు. కలపటం మరియు తీసివేయటం అనేవి ప్రకృతి యొక్క సర్దుబాట్లు. ఒకరు డబ్బుపోగొట్టుకొన్నపుడు, వ్యాపారంలో నష్టం వచ్చినపుడు లేదా ధనం దొంగలించబడినపుడు, యివి అన్నీ ప్రకృతి యొక్క సర్దుబాట్లు, దోషం బాధపడేవానిది. దీనిని నేను జ్ఞానదృష్టితో దర్శించి పూర్ణ నిశ్చయంతో చెప్తున్నాను.
ప్రశ్నకర్త : సుఖాన్ని గుణించుకోవటం వల్ల తప్పేమిటి ?
దాదాశ్రీ : నీవు దేనినైనా గుణించదల్చుకొంటే నీ బాధలను గుణించుకో. సుఖాన్ని
Page #26
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
గుణించుకొంటే భయంకరమైన కష్టాలను ఎదుర్కొనవలసివస్తుంది. గుణకారం నీకు యిష్టమైతే నీ బాధల్ని గుణించు. నీవు ఒకరిని ఒక దెబ్బకొట్టినప్పుడు, అతడు తిరిగి నిన్ను రెండు దెబ్బలు కొడితే నిన్ను నీవు అదృష్టవంతునిగా భావించు. నిన్ను బాధించేవారు నీకు దొరికితే అది నీకు మేలు చేస్తుంది. కారణమేమంటే నీ జ్ఞానం వృద్ధిపొందుతుంది. బాధలను గుణించుకోవటాన్ని నీవు అంగీకరించలేకపోయినా ఫర్వాలేదు. కానీ ఏ పరిస్థితుల్లోనూ నీ సంతోషాన్ని మాత్రం గుణించకు. భగవంతుని దృష్టిలో దోషి
17
"బాధపడేవానిదే తప్పు” ఇది భగవంతుని యొక్క భాష. కాని ప్రపంచంలోని మానవ చట్టం ప్రకారం నేరం చేసినవాడిదే తప్పు.
భగవంతుని దృష్టిలో దోషివి అయ్యే విధంగా ప్రవర్తించవద్దు. అనగా ఇతరులలో దోషాలు చూడవద్దు. ఇది మరు జన్మకోసం నీకు బంధాలను ఏర్పరుస్తుంది. ఇది అంతరంగ దోషం. బాహ్య దోషాలు అంత ప్రమాదం కాదు. ఎందువల్లనంటే నీవేదైనా తప్పు చేస్తే కొంతకాలం నిన్ను ఖైదు చేసి వదిలిపెడతారు. కాని భగవంతుని న్యాయ స్థానంలో దోషిగా నిర్ధారింపబడితే ఫలితం తీవ్రంగా ఉంటుంది. నీవు దీనిని గ్రహించావా? ఈ సూక్ష్మసందేశాన్ని నీవు గ్రహిస్తే అది నీకెంతో మేలు చేస్తుంది. చాలా మంది ప్రజలు “బాధపడేవానిదే తప్పు” అనే సూత్రాన్ని అర్థం చేసికొన్నారు. వారంతా సాధారణ ప్రజలుకారు, విచారశీలురైన మేధావులు.
ఇపుడు నేను మీకు ఈ సూత్రాన్ని వివరించాను. ప్రజలు వెంటనే దీనిని తమ పరిస్థితులకు అన్వయించుకొంటారు. కోడలి వేధింపులవల్ల బాధపడే అత్తగారు “బాధపడేవానిదే తప్పు” అనే వాక్యాన్ని విన్నవెంటనే ఈ విధంగా కోడలిచే నిరాదరింపబడటానికి కారణం తన తప్పే అని అంగీకరిస్తుంది. ఈ అవగాహన ప్రాపంచిక జీవిత సంకెళ్లనుంచి ఆమెకు స్వేచ్ఛని ప్రసాదిస్తుంది.
అర్ధం చేసుకోవటం కష్టం కాని ఇది వాస్తవం.
ఎవరూ దోషులు కారు. తప్పు ఏదైనా వుంటే, అది మన స్వంత తప్పే. మన స్వయంకృతాపరాధాల కారణంగానే మనం ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. ఈ సంసారంలో ప్రతి దానికి ఆధారం మన స్వంత తప్పులే.
Page #27
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
ప్రశ్నకర్త : నా జీవితంలో ఆలస్యంగానైనా నేను దీనిని గ్రహించాను. దాదాశ్రీ : ఇపుడైనా అర్ధం చేసుకొన్నారు అదే మేలు. ఆలస్యంగానైనా అర్ధం చేసికోవటం మంచిది. నీవయసు మీద పడినప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సూత్రాన్ని నీవు చాలా త్వరగానే గ్రహించావు. ఇదెంత ప్రయోజనకారి! నీవు వయసులో ఉన్నపుడు, బలంగా ఉన్నపుడు దీనిని నీవు తెల్సుకొని వుంటే అది నీకు ఎంత మేలు చేసి వుండేదో ఊహించు.
“బాధపడే వానిదే తప్పు” అనే ఈ ఒక్క సూత్రంలో నేను మీకు సమస్త శాస్త్రాల సారాన్ని అందించాను.
బొంబాయిలోని వేలకుటుంబాలు ఈ వాక్యాన్ని తమదైనందిన జీవితాలలో చేర్చుకొన్నారు. వారియిళ్లలో గోడల పై ఈ సూత్రం పెద్ద అక్షరాలలో వ్రాసి ఉండటాన్ని మీరు చూడవచ్చు. యింట్లో ఏదైన పగిలిపోయినపుడు పిల్లలు తల్లి ముఖకవళికలను బట్టి తప్పు ఆమెదే అని తమ తల్లికి గుర్తుచేస్తారు. కూరలో ఉప్పు చాలా ఎక్కువైనపుడు తప్పు ఎవరిదో తెలుసుకోవటానికి భుజించేవారి ముఖవికారాలను గమనించాలి. ఎవరి ముఖం వికృతమైతే వారిదే తప్పు. చారుగిన్నె చేయిజారి క్రింద పడితే, ఎవరిముఖంలో విసుగు కన్పిస్తుందో వారిదే తప్పు. బాధపడే వానిదే తప్పు.
ఎవరిముఖమైనా చాలా కోపంగా ఉన్నట్లు నీకు కన్పిస్తే అది నీ తప్పు. ఆ సమయంలో ఆ వ్యక్తిలోని శుద్ధాత్మను ప్రార్ధించి, మరల మరల క్షమాపణకై అర్ధించాలి. అపుడు ఆ వ్యక్తితో నీకుగల ఋణానుబంధం నుంచి నీవు విడుదలపొందుతావు. ప్రజలు తమ స్వంత తప్పుల కారణంగానే బాధపడతారు.
రాయివిసిరిన వ్యక్తిది తప్పుకాదు, దానివల్ల గాయపడినవానిదే తప్పు. నీ చుట్టూ ఎంత అల్లరి పిల్లలు ఉన్నప్పటికీ, వారెంత కుచేష్టలు చేసినప్పటికీ అవి నిన్ను బాధించకపోతే అపుడు తప్పు నీది కాదు. అవి నిన్ను ప్రభావితం చేస్తే అపుడు తప్పు నీదని నీవు నిశ్చయంగా గ్రహించాలి.
Page #28
--------------------------------------------------------------------------
________________
19
బాధపడేవానిదే తప్పు
జమ - అప్పుల కొత్త రీతి ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదం ఏర్పడి వారిలో ఒకరు రెండో వ్యక్తి తనను మోసగించాడని నేరారోపణ చేస్తే, నేరం మోపబడిన వ్యక్తికి రాత్రి నిద్రపట్టదు. నేరం మోపిన వ్యక్తి గాఢ నిద్రపోతాడు.
ఎవరైనా నీ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి యివ్వకపోతే ఏం చేయాలి? అతనికి డబ్బు యిచ్చింది నిజంగా నీ అహంకారమే అని గుర్తించు. అతను డబ్బుకోసం అర్ధిస్తూ నీ అహంకారాన్ని పొగిడినందువల్ల అతని పై జాలితో నీవతనికి డబ్బుయిచ్చావు.
యిప్పుడు తిరిగి రాకుంటే దానిని వదిలేయి. అతనితో నీకుగల పూర్వపుఖాతాలో జమ వేసికో మరియు అహంకారం యొక్క ఖాతాలో అప్పు వ్రాసుకో.
ఈ విధంగా పరిశీలించు ఎవరి దోషాలు ఎక్కువగా వుంటే వారే ప్రపంచంలో ఎక్కువగా బాధపడతారు. దోషం ఎవరిదో తెలుసుకొనుటకు ఎవరు బాధపడునది నీవు గమనించాలి.
నీవు ఎంత బాధను సహించవలసి వస్తున్నదో అనే దానిని బట్టి నీ దోషం ఎంతవున్నదో నీవు నిర్ణయించుకోవచ్చు.
పదిమంది సభ్యులున్న ఒక కుటుంబంలో కొంతమంది ఇంటి ఖర్చులు ఎలాగడుస్తున్నాయో అని కూడా ఆలోచించరు. ఇక కొందరు ఇంటి ఖర్చుల్లో పాలుపంచుకోవాలని తలుస్తారు. కాని వారిలో యిద్దరు మాత్రమే ఆ విధంగా సహాయం చేస్తారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తితప్ప మిగిలినవారంతా రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రించగల్గుతారు. ఆ వ్యక్తి మాత్రం నిరంతరం కుటుంబాన్ని నడిపే విషయమై చింతిస్తాడు. ఎక్కువగా బాధపడుతున్నది అతడే కాబట్టి తప్పు అతనిదే. మిగిలినవారంతా ఏ విచారం లేకుండా ప్రశాంతంగా నిద్రిస్తారు.
తప్పెవరిది? ఎవరు బాధపడ్తున్నారో కనుక్కో. ఒక పనిమనిషి వల్ల యింట్లో పది టీ కప్పులు పగిలితే, యింట్లో ఎవరో ఒకరు దాని వల్ల ప్రభావితులవుతారు. యింట్లో పిల్లలు దానిని పట్టించుకోరు కనుక వారు బాధపడరు. తల్లిదండ్రులకి కోపం వచ్చినప్పటికీ, తల్లి ఎలాగో కొంచెం సేపటికి నిద్రించగల్గుతుంది. తండ్రి తనకు కల్గిన
Page #29
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
నష్టాన్ని లెక్కవేసుకొంటాడు, “ఒక్కొక్కటి ఐదురూపాయలు చొప్పున పది కప్పులు ఏభై రూపాయలు. నాకు యాభై రూపాయలు నష్టం వచ్చింది". అతడు మేల్కొని వుంటాడు. అందు వల్ల అతడే ఎక్కువ బాధపడ్తున్నాడని, తప్పు అతనిదే అని నీవు గ్రహించవచ్చు.
ఎవరూ తప్పులను వెదకకూడదు. “బాధపడేవానిదే తప్పు” అనే సూత్రాన్ని మాత్రం ధర్మామీటరువలె ఉపయోగించుకోవాలి. ఈ విధంగా పరిస్థితులను మీరు పరిశీలించటం కొనసాగిస్తే, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. మరియు మోక్షాన్ని
పొందుతారు.
తప్పెవరిది? డాక్టరుదా లేక రోగిదా? ఒక యింటి నుంచి డాక్టరుకి ఫోను వస్తుంది. డాక్టరు రోగికి నొప్పి తగ్గించే నిమిత్తం ఒక యింజక్షన్ యిచ్చి యింటికి వెళ్లి హాయిగా నిద్రపోతాడు. కాని రోగి యింజక్షన్ వల్ల చాలా బాధననుభవిస్తూ రాత్రంతా అశాంతితో గడుపుతుంది. ఇక్కడ తప్పెవరిది?
రోగిది.
వ్యాధిగ్రస్తుడైన ఒక
పిల్లవాడి నిమిత్తం ఇంకొక డాక్టరుకి ఒక యింటి నుంచి ఫోన్ వస్తుంది. డాక్టరు పిల్లవాడిని పరీక్షించినపుడు అతనికి నాడి దొరకదు. తనను ఎందుకు పిలిపించారని తల్లిదండ్రులను డాక్టరు అడుగుతాడు. అతడు పరీక్షించే ముందు వరకు పిల్లవాడు జీవించే వున్నాడని వారు చెప్తారు. తల్లిదండ్రుల పై డాక్టరుకి కోపం వస్తుంది. ఇంటికి వచ్చినందుకు ఫీజు కూడా వసూలు చేస్తాడు. ప్రపంచం ఇలాగే వుంది. ఈ కాలంలో న్యాయానికై వెదకవద్దు.
ప్రశ్నకర్త : ప్రజలు వైద్యం నిమిత్తం డాక్టరు వద్దకు వెళ్లి డాక్టరు పై కోపగిస్తుంటారు. ఇది నా అనుభవం.
దాదాశ్రీ : అలా కూడా జరుగుతుంది. నీవు ఎదుటివ్యక్తిని నిందిస్తే తప్పు నీదవుతుంది. ప్రకృతి సదా న్యాయమే చేస్తుంది.
ఆపరేషన్ సమయంలో రోగి మరణిస్తే తప్పెవరిది ? తడి నేల పైనీవు కాలుజారిపడితే తప్పెవరిది ?
Page #30
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
ఇతరులలో దోషాలను చూడటం చాలా తప్పు. నీకు బాధను కలుగచేసే నిమిత్తుణ్ణి ఎదుర్కోవటం నీ తప్పు. నిమిత్ ఒక వ్యక్తి అయితే నీవతనిని నిందిస్తావు. కాని నిమిత్ ఒక ముల్లు అయితే అది నీకు గుచ్చుకొంటే నీవేమి చేస్తావు ? వందలకొద్దీ ప్రజలు ఆ మార్గంలో నడుస్తారు. కాని వారిలో ఎవరికీ ఆ ముల్లు గుచ్చుకోకుండా చందూభాయ్ పాదంలో గుచ్చుకొంది. వ్యవస్థిత్ చాలా ఖచ్చితమైనది. ఎవరికి పూర్వపుఖాతాలున్నాయో వారికే అది బాధను కల్గిస్తుంది. నిమిత్ని (సాధనాన్ని) మరియు బాధపడవలసిన వ్యక్తితో సహా మిగిలిన పరిస్థితుల నన్నింటినీ వ్యవస్థిత్ ఒక్కచోట చేరుస్తుంది. కాని నిమిత్ (ముల్లు) దోషం ఏమిటి ?
21
ఒక వ్యక్తి మనపై మిరియాల పొడివంటి ఘాటైన స్ప్రే చేస్తే మనకి దగ్గు వస్తుంది. అతనిపై కోపం కూడా వస్తుంది. నిమిత్తుణ్ణి నిందిస్తాము. కాని ఎవరైన ఎండుమిర్చి వేయించుకొంటున్నందువల్ల మనకి దగ్గువస్తే అపుడు కోపం వస్తుందా? కర్త ఎవరు? అన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి అనే సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, దాని గురించి మనం పోట్లాటకు దిగుతామా? బాణం వేసిన విలుకానిది తప్పు కాదు. ఎవరు ఆ బాణం వల్ల గాయపడ్డారో వారిది తప్పు. విలుకాడు తన కర్మకి ఫలాన్ని అనుభవించేటపుడు దోషిగా పరిగణింపబడతాడు. ఈ క్షణంలో ఏ వ్యక్తి బాణం వల్ల గాయపడ్డాడో అతడు తన దోషానికి పట్టుబడ్డాడు. అనగా అతని పూర్వకర్మ అతనిని ఈ బాణం రూపంలో పట్టుకొని శిక్షించింది. పట్టుబడిన వ్యక్తే ప్రథమ దోషి. విలుకాడు తన కర్మఫలాన్ని అనుభవించేటపుడు దోషిగా పరిగణింపబడతాడు.
ప్రజలు సదా పిల్లలను నిందిస్తారు.
దాదాశ్రీ : నీవు స్కూలులో చదివే సమయంలో ఏమైనా కష్టాలు అనుభవించవలసి వచ్చిందా ?
ప్రశ్నకర్త : అవును.
దాదాశ్రీ : నీ తప్పుల కారణంగానే నీవు బాధపడ్డావు. టీచర్ని గాని మరెవరినిగాని
నిందించరాదు.
Page #31
--------------------------------------------------------------------------
________________
బాధపడేవానిదే తప్పు
ప్రశ్నకర్త : నేటి పిల్లలు అమర్యాదపూర్వక ప్రవర్తన కలిగి యుంటున్నారు. వారు టీచరు మాటను లెక్కచేయటం లేదు. వారెపుడు బాగుపడతారు? దాదా శ్రీ : వారి ప్రవర్తనవల్ల కలిగే ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారో వారిదే దోషం .
తప్పులపట్ల దాదాజీ యొక్క అవగాహన బాధపడే వానిదే తప్పు అనే న్యాయశాసనం మిమ్మల్ని ముక్తుల్ని చేస్తుంది. ఎవరైన నన్ను తనతప్పులను ఎలా గుర్తించాలని అడిగినచో అతడు ఏఏ సందర్భాలలో బాధననుభవించాడో వాటినన్నింటిని నోట్ చేయమని నేనతనికి చెప్తాను. అవే అతని తప్పులు. అతని బాధ వెనుకనున్న తప్పులను అతను కనుక్కోవాలి. ఆయా సందర్భాలలో అతని బాధకు అతని పాట్రెంత ఉన్నదో అతడు పరిశీలించుకోవాలి. ప్రజలెప్పుడూ బాధపడుంటారు, వారు తమ తప్పుల్ని తెలుసుకోవాలి.
ఏ బాధలోనైనా తప్పు మనదే అని మనం గుర్తిస్తాం. నేనెన్నడైనా తప్పు చేస్తే చాలా అసౌకర్యాన్ని అనుభవిస్తాను.
ఎవరితప్పునైనా నేనెలా గ్రహిస్తాను? అందరిలోను నేను వారి శుద్ధాత్మను (హోమ్ డిపార్ట్ మెంట్ ని) మరియు వారి అనాత్మను (ఫారిన్ డిపార్ట్ మెంట్ ను) వేరుగా చూస్తాను. అనాత్మ విభాగంలో జరుగుచున్న తప్పుల్ని గమనించినా నేనేమీ చెప్పను. ఆ తప్పు శుద్ధాత్మ విభాగంలో జరుగుచున్నట్లు నేను గమనిస్తే అపుడు నేను వారిని హెచ్చరించవలసి వుంటుంది.
మనలో చాలా అంతరభాగాలున్నాయి. వాటిలో ఏభాగం బాధను సహిస్తుందో మనం తెల్సుకోగలం. కొన్ని సార్లు అహంకారం బాధపడ్తుంది, అపుడు దోషం అహంకారానిది. కొన్నిసార్లు మనసు బాధననుభవిస్తుంది, అపుడు దోషం మనసుది. కొన్నిసార్లు చిత్తం (వినిన
జ్ఞానాన్ని, చూసిన దానిని ఫొటోగ్రఫీ పద్ధతిలో రికార్డు చేయగల మనసు యొక్క సూక్ష్మాంశం) బాధపడ్తుంది. అపుడు తప్పు చిత్తానిది. తన తప్పులనుంచి తాను వేరుగా ఉండటం మనిషికి సాధ్యపడుతుంది. ఈ ముఖ్య విషయాన్ని నీవు అర్ధం చేసికోవలసివుంది, అవునా?
Page #32
--------------------------------------------------------------------------
________________
23
బాధపడేవానిదే తప్పు
తప్పుకి మూలం ఎక్కడ? ఇది ఎవరి తప్పు? తప్పు బాధపడేవానిది. ఆ తప్పు ఏమిటి? 'నేను చందూలాల్' అనే నమ్మకమే ఆ తప్పు. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ దోషులుకారు కనుక ఎవరిని నిందించకూడదు. ఇది నిజం.
ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏమీ చేయగల శక్తి లేదు. ఒకరు ఇంతకు పూర్వమే ఏఏ ఖాతాలను (కర్మలను) సృష్టించుకొన్నారో అవే అతనిని బంధిస్తాయి. నీవు ఏఏ ఖాతాల చిక్కులను సృష్టించుకొన్నావో అవి వాటి ఫలాలను యిచ్చేవరకు నిన్ను వదలి పెట్టవు. కాని యిప్పటినుంచి కొత్తగా ఏ చిక్కు ఖాతాలను సృష్టించుకోకు. నీకు ఇది తెలిసింది కనుక ఇపుడు ఆ సృష్టిని ఆపగలవు. నీవు యిప్పటికే సృష్టించుకొన్న పాత ఖాతాలను పూర్తి చేసికొనవలసి ఉన్నది. కానీ కొత్త వాటిని సృష్టించుకోకుండా జాగ్రత్తపడు. నీకు సంబంధించినంతవరకు పూర్తి బాధ్యత నీదే. అది భగవంతుని బాధ్యత కాదు. భగవంతుడు దీనిలో జోక్యం చేసికోడు కనుక భగవంతుడు కూడా క్షమాభిక్షను ప్రసాదించలేడు. చాలామంది భక్తులు తాము పాపం చేసినప్పటికీ భగవంతుడు తమని క్షమిస్తాడని విశ్వసిస్తారు. భగవంతుని నుంచి క్షమ అనేది
ఉండదు. దయార్ద్రహృదయులు క్షమిస్తారు, నీవు దయార్ద్రహృదయుడైన ఒక వ్యక్తిపట్ల గావించిన ఘోరఅపరాధాన్ని ఆ వ్యక్తి వద్ద ఒప్పుకొన్నచో అతడు నిన్ను వెంటనే క్షమిస్తాడు.
నీకు బాధను కలుగచేసిన వ్యక్తి కేవలం నిమిత్త మాత్రుడు. ప్రధాన దోషం మీదే. నిన్ను గాయపరచినవారు లేక నీకు సంతోషాన్ని కల్గించినవారు ఇరువురూ నిమిత్తమాత్రులే. ప్రతిదీ నీగత ఖాతాల కారణంగానే జరుగుతుంది.
నీ జీవితంలో జోక్యం చేసుకొనే శక్తి ఎవ్వరికీ లేదు, దీనిని నేను చాలా స్పష్టంగా, నిష్కపటంగా చెప్తున్నాను. కాని నీ దోషం ఉన్నట్లయితే అపుడు ఎవరైనా జోక్యం చేసుకోగల్గుతారు. వారు నిన్ను కొట్టినా కొట్టవచ్చు. మీ బాధల వెనుక ఉన్న కారణాలు నాకు తెలుసు. ఈ కారణాలకు బాధ్యుడవు నీవే, వాటి సృష్టికర్తవు నీవే. ఎవరూ నిన్ను గాయపరచలేదు. నిన్ను నీవే గాయపర్చుకొన్నావు. నీ ప్రాపంచిక జీవితానికి నీవే పూర్తిగా బాధ్యుడవు.
Page #33
--------------------------------------------------------------------------
________________
24
బాధపడేవానిదే తప్పు
న్యాయమూర్తి ఒక కంప్యూటర్ వంటిది. “బాధపడేవానిదే తప్పు” ఇది గుప్త సత్యం. ఇక్కడ బుద్ధిని ప్రయోగించటం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ రహస్య సత్యాన్ని గ్రహించాలంటే నీవు జ్ఞానిపురుషుని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుప్త సత్యాన్ని సూక్ష్మతమ స్థాయి వద్ద తప్పక గ్రహించాలి. న్యాయాన్ని వెల్లడించే మాద్యమం ఒక చేతన స్వరూపం (మనిషి అయినచో అన్యాయానికి, పక్షపాతానికి అవకాశం ఉంటుంది. కాని ప్రకృతి సదా న్యాయమే.
ప్రాపంచిక పరిభాషలో నీకు తెలియజెప్పాలంటే అది ఒక కంప్యూటర్ వంటిది. మనుష్యులు తయారుచేసిన కంప్యూటర్ సంపూర్ణంగా లోపరహితంకాదు. నీవు గనుక రాంగ్ డేటా ఫీడ్ చేస్తే అది తప్పులు చేయగలుగుతుంది. కాని ప్రకృతి యొక్క కంప్యూటర్ దోషరహితమైనది. అది ఈ ప్రపంచంలో న్యాయాన్ని తయారు చేసి వెల్లడించే ప్రత్యేక వస్తువు. అనురాగానికి, పక్షపాతానికి అతీతమైన పూర్ణ స్వేచ్ఛను ప్రకృతి యొక్క కంప్యూటర్ కల్గియున్నది. జ్ఞాని పురుషుని యొక్క ఒకే ఒక్కమాటను నీవు అర్ధంచేసికొని, గ్రహించినచో నీవు మోక్షాన్ని పొందుతావు. తప్పెవరిది అనే విషయంలో నీకు ఎన్నడూ ఎవరి సలహాను తీసికోవలసిన అవసరం రాదు. తప్పు బాధపడేవానిదే.
ఇది పూర్తి విజ్ఞానం. దోషరహితమైనది. ఇదే పరిపూర్ణమైన విజ్ఞానం. ఇది కేవలం భారతీయులకే పరిమితం కాదు, పూర్తి ప్రపంచం కోసం, సమస్త మానవాళికోసం.
నేను మీకు లోపరహితమైన, నిర్మలమైన న్యాయాన్ని చూపిస్తునప్పుడు, న్యాయాన్యాయాలగురించి చర్చించవలసిన అవసరం ఏమిటి? ఇది చాలా లోతైన సూక్ష్మ సత్యము (గుహ్యము). నేను మీకు సమస్త శాస్త్రాల సారాన్ని ప్రసాదిస్తున్నాను మరియు ప్రకృతి శాసనం ఎంత ఖచ్చితంగా పని చేస్తుందో చెప్తున్నాను: “బాధపడే వానిదే తప్పు". ఈ వాక్యం చాలా సరిగా (ఎగ్జాక్ట్ గా) వెలువడింది. దీనిని ఎవరు ఉపయోగించుకొంటారో, అన్వయించుకొంటారో వారికి మోక్షం సిద్ధిస్తుంది.
- జై సచ్చిదానంద్
Page #34
--------------------------------------------------------------------------
________________
నవకలమ్ (తొమ్మిది ప్రగాఢ అంతరంగ భావనలు) ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! దేహధారియైన ఏ జీవాత్మ యొక్క అహంకారము కించిత్ మాత్రము కూడా గాయపడుటకు నేను కర్తను, కారయితను, ప్రేరకుడను, అనుమోదకుడను కాకుండునట్లు నాకు పరమ శక్తిని ప్రసాదించు. ఏ దేహధారి జీవాత్మ యొక్క అహంకారమును ఏ మాత్రమూ గాయపరచకుండు నట్టి సాత్విక వాణి, వర్తన, విచారము కల్గియుండునట్లు నాకు అనంతమైన ఆంతరంగిక శక్తిని అనుగ్రహించు. ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్ ! ఎవరి ధర్మ ప్రమాణములు కించిత్ మాత్రము కూడా కించపడుటకు నేను కర్తను, కారయితను, ప్రేరకుడను, అనుమోదకుడను కాకుండునట్లు నాకు పరమశక్తిని ప్రసాదించు. ఎవరి ధర్మము యొక్క ప్రమాణమును అణుమాత్రమైన కించపరచకుండుటకు తగిన, అందరికి ఆమోదయోగ్యమైన సాత్విక వాణి, వర్తన, భావన కల్గి
యుండునట్లు నాకు అనంతమైన అంతరశక్తిని ప్రసాదించు. 3. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ఉపదేశకులైన ఏ దేహధారి సన్యాసిని
గాని, సన్యాసినిని గాని లేక ఆచార్యుని గాని విమర్శించకుండునట్లు, వారికి అపరాధము చేయకుండునట్లు, వారి పట్ల అవినయముగా ప్రవర్తించకుండునట్లు
నాకు పరమశక్తిని అనుగ్రహించు. 4. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ఏ దేహధారి జీవాత్మ పట్ల కూడా నేను
ద్వేషము, తిరస్కారము కలిగియుండకుండునట్లు, ఇతరులు అట్లు ద్వేషించుటకు, తిరస్కరించుటకు నేను కారణము కాకుండునట్లు; ద్వేషించుటను, తిరస్కరించుటను నేను ఆమోదించకుండునట్లు నాకు అనంతమైన శక్తిని
అనుగ్రహించు. 5. ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్ ! ఏ దేహధారి జీవాత్మ విషయంలో కూడా ఎప్పుడు
గాని పరుషవాక్యాలను, హృదయాన్ని గాయపరిచే మాటలను నేను పలుకకుండునట్లు,
Page #35
--------------------------------------------------------------------------
________________
ఎవరైన అట్లు పలుకుటకు నేను కారణము కాకుండునట్లు, ఎవరుగాని అట్లు పలుకుటను నేను ఆమోదించకుండునట్లు నాకు పరమశక్తిని ప్రసాదించు.
ఎవరైనా పరుషవాక్యాలను గాయపరిచే విధంగా పలికినప్పటికీ నేను మృదుభాషను, సరళమైన భాషను పలుకుటకు నాకు శక్తినిమ్ము.
6. ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్! స్త్రీ, పురుషుడు, నపుంసకుడు ఏ లింగధారియైనప్పటికి, ఏ దేహధారి జీవాత్మపట్ల కూడా నాకు కించిత్ మాత్రమైన విషయవికార సంబంధమైన దోషములు, వాంఛలు, చేష్టలు, విచారములు కలుగకుండునట్లు; ఇతరులకు అవి కల్గుటకు నేను కారణము కాకుండునట్లు, ఎవరుగాని వాటిని కలిగియుండుటను నేను ఆమోదించకుండునట్లు నాకు పరమశక్తిని అనుగ్రహించు.
నిరంతరము నిర్వికారిగా ఉండుటకు నాకు అనంతమైన శక్తినిమ్ము.
7. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ఆహార విషయంలో నాకు జిహ్వాచాపల్యము లేకుండునట్లు శక్తినిమ్ము. సాత్వికమైన సమతులాహారము తీసికొనుటకు నాకు పరమశక్తినిమ్ము.
8. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని, జీవించి ఉన్న లేక మృతుడైన ఏ దేహధారి జీవాత్మనుగాని నేను విమర్శించకుండునట్లు, వారి పట్ల అపరాధము చేయకుండుటకు, అవినయముగా ప్రవర్తించకుండునట్లు, ఇంకొకరు ఆవిధముగా ప్రవర్తించుటకు నేను కారణము కాకుండునట్లు, వారిని నేను ఆమోదించకుండునట్లు నాకు పరమశక్తినిమ్ము.
9. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్! జగత్ కళ్యాణ కార్యములో సాధనముగ మారుటకు నాకు పరమశక్తినిమ్ము, శక్తినిమ్ము, శక్తినిమ్ము
(దాదా భగవాన్ జీవులందరిలో విరాజమానుడైన పరమాత్మ, పై విధంగా భగవంతుని అర్ధించాలి. ఇది ప్రతి దినముయాంత్రికంగా చదువుటకు కాదు, హృదయంలో నిలుపుకోవాలి. దైనందిన జీవితంలో వీటిని అమలుపరచాలన్న దృఢ నిశ్చయంకలిగి దీనిని ప్రతిరోజూ చదవాలి. ఈ అమూల్య నవరత్నాలలో సమస్త శాస్త్రాల సారము ఇమిడి ఉన్నది.)
Page #36
--------------------------------------------------------------------------
________________
1.
2.
3.
4.
English Books of Akram Vignan of Dada Bhagwan
(English & Telugu)
(English & Telugu) (English & Telugu) (English & Telugu) (English & Telugu)
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
Adjust Everywhere
Avoid Clashes
The Fault Is Of the Sufferer Whatever Happened is Justice
Who Am I?
Ahimsa Non-Violence
Anger
Aptavani - 1
Aptavani - 2
Aptavani - 4
Aptavani - 5
Aptavani - 6
Aptavani - 8
Aptavani - 9
Autobiography of Gnani Purush A.M.Patel
Brahmacharya: Celibacy Attained With Understanding
Death Before, During & After...
Flawless Vision
Generation Gap
Harmony In Marriage
Life Without Conflict
Money
Noble Use of Money
22.
23.
24.
25.
26.
Right Understanding to Help Others
27.
Science of Karma
28.
Science of Speech
29. Shree Simandhar Swami: The Living God
30.
The Essence Of All Religion
31. The Guru and The Disciple
32.
33.
Pratikraman: The master key that resolves all conflicts
Pure Love
Tri Mantra The mantra that removes all worldly obstacles Worries
'Dadavani' Magazine is published Every month in Hindi, Gujrati & English
Page #37
--------------------------------------------------------------------------
________________
Adalaj
Persons to Contact
Dada Bhagwan Parivar : Trimandir, Simandhar City, Ahmedabad-Kalol Highway, Adalaj, Dist.: Gandhinagar - 382421, Gujarat, India. Tel : (079) 39830100, Email: info@dadabhagwan.org
Ahmedabad: Dada Darshan, 5, Mamtapark Society,
Behind Navgujarat College, Usmanpura, Ahmedabad-380 014. Tel. : (079) 27540408
Rajkot Trimandir : 9274111393 Bhuj Trimandir : (02832) 290123 Godhra Trimandir : (02672) 262300 Morbi Trimandir : (02822) 297097 Amreli Trimandir : 9924344460 Surendranagar Trimandir : 9879232877 Vadodara Dada Mandir : 9924343335
Hyderabad : 9989877786 Hubli : 9739688818 Bangalore : 9590979099 Mumbai : 9323528901 Chennai : 9380159957 Delhi : 9810098564 USA-Canada : DBVI
Tel. : +1 877-505-DADA (3232) Email : USA email - info@us.dadabhagwan.org
Canada email - info@ca.dadabhagwan.org U.K.:
AVDBF Tel. :+44 330-111-DADA (3232)
info@uk.dadabhagwan.org Kenya : +254 722 722 063 Singapore : +65 81129229 Australia : +61 421127947 New Zealand : +64 21 0376434 UAE : +971 557316937 Germany : +49 700 32327474
www.dadabhagwan.org
Page #38
--------------------------------------------------------------------------
________________ బాధపడే వానిదే తప్పు 'నీ పొకెట్ కత్తిరించబడింది. ఈ తప్పెవరిది? నీజేబే ఎలా కత్తిరించబడింది, నీ స్నేహితునిది ఎందుకు కత్తిరించబడలేదు? ఇపుడు బాధపడున్నది ఎవరు? నీవా లేక జేబు దొంగా? బాధపడేవానిదే తప్పు? "బాధపడేవానిదే తప్పు" అనే ఈ సూత్రం నిన్ను ముక్తుణ్ణి చేస్తుంది. ఎవరైనా 'నా తప్పుల్ని నేనెలా గుర్తించగలను?” అని అడిగితే 'నీ జీవితంలో నీవు బాధననుభవించే సందర్భాలనన్నింటినీ కనిపెట్టు. అవే నీ తప్పులు' అని చెప్తాను. మన తప్పులవల్లనే మనం బంధింపబడ్డాం. ప్రపంచం మనలను బంధించలేదు. ఒకసారి ఈ తప్పులు తొలగించబడితే మనం స్వేచ్ఛను పొందుతాం. Printed in India dadabhagwan.org