________________
బాధపడేవానిదే తప్పు
మహావాక్యం “బాధపడేవానిదే తప్పు” ఈ వాక్యం చాల శక్తివంతమైనది. పుణ్యఫలంగా ఈ వాక్యం సహజంగా దానంతట అదే నాకు అంతరంగం నుంచి లభించింది. ఇది చాలా శ్రేష్ఠమైనది మరియు చాలా అర్ధవంతమైనది. ఈ వాక్యం పై ఒక పుస్తకమే వ్రాయవచ్చు.
ఈ వాక్యం సగం పజిల్ ని పరిష్కరిస్తుంది, మిగిలిన అర్ధభాగాన్ని 'సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్' (వ్యవస్థిత్) పరిష్కరిస్తుంది. ఒకవేళ నీకు బాధ కలిగితే దానికి కారణం నీ దోషమే, ఎవరినీ నిందించకూడదు. లౌకిక దృష్టిలో దు:ఖాన్ని కల్గించినవాడు దోషిగా పేర్కొనబడతాడు. కాని భగవంతుని చట్టం ప్రకారం బాధపడేవానిదే తప్పు; దుఃఖాన్ని అనుభవిస్తున్నది ఎవరో వారే దోషి.
ప్రశ్నకర్త : కాని బాధను కలిగిస్తున్న వ్యక్తి కూడ ఏదో ఒక రోజు బాధపడవలసి ఉంటుందా? దాదాశ్రీ : అతడు బాధపడే రోజున దోషిగా పరిగణింపబడతాడు.
కానీ ఈ రోజు నీ దోషం నిన్ను పట్టుకొన్నందువల్ల నీవు బాధపడ్తున్నావు.
తప్పు తండ్రిదా లేక కొడుకుదా? ఒక ధనవంతుడైన వ్యాపారికి అర్ధరాత్రి త్రాగి ఇంటికొచ్చే తన కుమారుని వల్ల సమస్య ఏర్పడింది. కుమారుని రాకకోసం తండ్రి రోజూ ఎదురు చూస్తు ఉంటాడు. ఎపుడైనా కొడుకుని ఇదేమిటని ప్రశ్నించబోతే, అతడు గట్టిగా అరుస్తూ తండ్రిని తిడుతూ తన గదిలోకి వెళ్లిపోతాడు. కొడుకు హాయిగా గాఢనిద్రపోతాడు. తండ్రి మాత్రం అతని గురించి చింతిస్తూ రాత్రంతా మేల్కొనే ఉంటాడు. ఈ సమస్యతో ఆ వ్యాపారి నా దగ్గరకు వచ్చాడు. నేనతనికి ఇలా చెప్పాను: “బాధపడుతున్నది నీవే కనుక తప్పు నీదే". తప్పు కొడుకుది కాదు, ఎందువల్లనంటే అతనుగాని, మిగిలిన కుటుంబ సభ్యులుగాని బాధపడటం లేదు. అతని తల్లి (వ్యాపారి భార్య) కూడ ప్రశాంతంగా నిద్రిస్తుంది. 'నీ పూర్వ జన్మలో నీవతనికి బాధ కల్గించినందున ఇపుడు నీకు కుమారుడై దానిని నీకు తిరిగి చెల్లిస్తున్నాడు. నిన్ను గౌరవించే మిగిలిన ముగ్గురు కుమారుల వల్ల నీవు ఆనందాన్ని ఎందుకు పొందకూడదు?' అని నేను వ్యాపారికి చెప్పాను. ఈ దు:ఖాలు