________________
బాధపడేవానిదే తప్పు
వ్యక్తి సుఖాలను అనుభవిస్తున్నట్లయితే అది అతని పుణ్యకర్మల ఫలం. కాని ప్రపంచ చట్టం నిమిత్తుణ్ణి (కన్పించే కర్త లేక బాధకు గురి చేసిన వ్యక్తిని) నిందిస్తుంది. భగవంతుని చట్టం, నిజమైన చట్టం, నిజమైన దోషిని పట్టుకొంటుంది.
3
ఈ చట్టం సరియైనది, దీనినెవరూ మార్చలేరు. ఎవరిని గాని అకారణంగా బాధలకు గురిచేయగల చట్టం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రభుత్వ చట్టానికి కూడ అటువంటి శక్తి లేదు.
వల్ల ఏదైన విలువైన వస్తువు పగిలిపోతే నీకు దుఃఖం కల్గుతుందా? అదే వస్తువు నీ కుమారుని చేతి నుండి పడి పగిలిపోతే నీకు చింత, దుఃఖం కలుగుతాయి. నీవు గతంలో చేసిన తప్పుకి ఇది ఫలితం అని అంగీకరిస్తే నీకు చింత, దుఃఖం కలుగుతాయా? ఎదుటివారిలో దోషాలను చూడటం ద్వారా నీవు దుఃఖాన్ని, చింతలను సృష్టించుకొంటావు. ఇదంతా సహించవలసి వచ్చిందని నీవు తలుస్తున్న కారణంగా కలతచెందుతావు. ఏమి జరిగినా అది నీ పూర్వ కర్మలఫలమని గ్రహించినచో నీకు
బాధ కలగదు.
ఎదుటివ్యక్తి నిన్ను నిందిస్తున్నాడంటే అక్కడ నీ దోషం ఎంతో కొంత తప్పక ఉంటుంది. ఆ తప్పుని ఎందుకు సరిచేసుకోకూడదు? వాస్తవంలో ఇంకొకరికి దుఃఖాన్ని కల్గించగలవ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి ప్రాణి స్వతంత్రమైనది. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నట్లయితే గతంలో నీవు చేసిన తప్పులే దానికి కారణం. ఒకసారి ఈ తప్పులన్ని నాశనం చేయబడితే అనుభవించవలసింది ఏమీ మిగిలి వుండదు.
ప్రశ్నకర్త : ఈ విజ్ఞానాన్ని సరిగా అర్ధం చేసికొన్నచో, అన్ని ప్రశ్నలకు పరిష్కారం లభిస్తుంది.
దాదాశ్రీ : సరిగా అదే జరుగుతుంది. దీనిని నేను జ్ఞానంతో తీర్మానించాను, నా బుద్ధితో కాదు.