________________
బాధపడేవానిదే తప్పు
తన తప్పులకు మూల్యం చెల్లిస్తున్నాడు. ప్రకృతి శాసనం ప్రకారం పర్సు పోగొట్టుకొన్నవాడే ఈ రోజు దోషిగా పరిగణింపబడతాడు. పర్సును దొంగిలించిన వ్యక్తి పట్టుబడిన రోజున దొంగగా పిలవబడతాడు.
నేను మీలో తప్పులను చూడను. కానీ ప్రజలు తమ బాధలకు ఇతరులను నిందిస్తారు. తమ బాధలకు ఇతరులను బాధ్యులుగా తలంచటంవల్ల, నిందించటం వల్ల వారి తప్పులు రెట్టింపు అవుతాయి, అంతేకాక జీవితంలో వారి సమస్యలు కూడా పెరుగుతూవుంటాయి. దీనిని నీవు అర్ధం చేసుకొంటే సమస్యలు తగ్గుతాయి.
ప్రకృతి వైపరీత్యాలకు కారణం గుజరాత్ లోని మోర్బీ పట్టణంలో సంభవించిన వరదలకు కారణం ఎవరు? దీనిని కనుక్కోండి. స్పష్టమైన అవగాహన కొరకు ఈ సంఘటనను మీరు రెండు కోణాలలో చూడాలి. బాధపడేవారు అది తమ గత దోషాలకు ఫలం అని గ్రహించాలి. ఈ వైపరీత్యాన్ని దర్శించేవారు బాధితులకు అన్ని విధాలైన సహాయసహకారం అందించాలని తలంచాలి, బాధితులకు చేయూత నివ్వ ప్రయత్నించాలి.
మానవ చట్టం కళ్ళతో చూచినదానిని బట్టి దోషాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతి చట్టం బాధకు గురైనవానిని దోషిగా నిర్ణయిస్తుంది. ప్రజలు ప్రభావితమయ్యేది జ్ఞానంవల్లనా లేక బుద్ధి వల్లనా ?
ప్రశ్నకర్త : మనం వార్తాపత్రికలలో వరదలు, ఇంకా ఇతర విపత్తుల గురించి చదివినపుడు ఆ వార్తలు మనల్ని కలవరపరుస్తాయి. ఒకవేళ అటువంటి వార్తలు మన పై ఏమాత్రం ప్రభావం చూపలేదంటే అది మన జడత్వం అని తలచాలా ? దాదాశ్రీ : చెడ్డవార్తల వల్ల ప్రభావితం కాకపోవటం జ్ఞాన మనబడుతుంది. ప్రశ్న కర్త : ఒకవేళ అది మనల్ని ప్రభావితం చేస్తే, దానినే మనాలి ? దాదా శ్రీ : అది బుద్ధి అనబడుతుంది. బుద్ధివల్లనే ఈ సంసారం ఏర్పడింది. బుద్ధి వల్ల కార్యసిద్ధి ఏమీ జరగదు. అది నిన్ను ఉద్వేగానికి గురిచేస్తుంది అంతే.