________________
సంపాదకీయం తమ తప్పు ఏమీ కన్పించకపోయినప్పటికీ బాధలు వెంబడిస్తుంటే ఎవరి మనసైనా కలత చెందుతుంది. ఎక్కడ పొరపాటు జరిగిందా అని అతడు ఆశ్చర్యానికి గురౌతాడు. నా తప్పేమిటి? అనే ప్రశ్నకు సమాధానం లభించనపుడు లోపల ఉన్న న్యాయవాదుల వాదన ప్రారంభమౌతుంది. ఇందులో నా తప్పేమీ లేదు. తప్పంతా ఎదుటి వ్యక్తిదే అని వారు వాదిస్తారు. తన బాధలకు కారణం ఎదుటి వ్యక్తేనని అంతిమ నిర్ణయానికి అతడు వస్తాడు. ఆవిధంగా అతని స్వంత తప్పులు మరుగునపడి ఎదుటివ్యక్తి యొక్క తప్పులు నిరూపింపబడతాయి. ఈ విధంగా కర్మపరంపర ప్రారంభమవుతుంది. జ్ఞాని పురుషుడు దాదా శ్రీ సాధారణ మానవులకు కూడ అన్నివిధాల సహాయకారియైన ఒక సరళమైన జీవనోపయోగ సూత్రాన్ని ప్రదానం చేసారు? 'బాధపడేవానిదే తప్పు'. తప్పెవరిది? తప్పు దొంగదా లేక దోచుకోబడిన వానిదా? ఇరువురిలో ఎవరు బాధననుభవిస్తున్నారు? సొమ్ము కోల్పోయిన వారే బాధపడతారు అవునా? బాధపడేవానిదే తప్పు. దొంగ పట్టుబడి శిక్షింపబడినపుడు తర్వాత ఎపుడో బాధపడతాడు.
కానీ నేడు దోచుకోబడినవానికి తన తప్పుకి దండన లభించింది, అందుకే అతడు బాధపడుతున్నాడు. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడతడు ఫలితం అనుభవిస్తున్నాడు. అతడెవరిని నిందించగలడు? ఈ దృష్టితో చూస్తే ఎదుటివ్యక్తి (దొంగ) నిర్దోషిగా కన్పిస్తాడు. చైనా టీసెట్ నీచేతి నుంచి పడి పగిలితే ఎవరిని నీవు నిందిస్తావు? అదే టీసెట్ ఒకవేళ పనిమనిషి చేతిలో పగిలితే నీవు పనిమనిషిని నిందిస్తావు. అన్ని విషయాలలో ఇలాగే జరుగుతుంది. ఇంట్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతిచోటా ఎవరు బాధపడ్తున్నారో పరిశీలించు. ఏవ్యక్తి బాధపడితే ఆ వ్యక్తిదే తప్పు. తప్పు ఎంత వరకు ఉంటుందో అంతవరకు బాధ ఉంటుంది. ఒకసారి
నీ తప్పులన్నీ సమాప్తమైతే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికిగాని, ఏ సంఘటనకి గాని నిన్ను బాధించగల శక్తి ఉండదు.
ఈ అమూల్య సూత్రం వెనుకవున్న ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని దాదాశ్రీ ఈ పుస్తకంలో వెల్లడించారు. దైనందిన జీవితంలో ఈ సూత్రాన్ని అన్వయించుకోవటం వల్ల అన్ని చిక్కు ప్రశ్నలూ పరిష్కారమౌతాయి.
- డా. నీరుబెన్ అమీన్