Book Title: Fault Is Of Sufferer
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ బాధపడేవానిదే తప్పు ప్రశ్నకర్త : నేటి పిల్లలు అమర్యాదపూర్వక ప్రవర్తన కలిగి యుంటున్నారు. వారు టీచరు మాటను లెక్కచేయటం లేదు. వారెపుడు బాగుపడతారు? దాదా శ్రీ : వారి ప్రవర్తనవల్ల కలిగే ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారో వారిదే దోషం . తప్పులపట్ల దాదాజీ యొక్క అవగాహన బాధపడే వానిదే తప్పు అనే న్యాయశాసనం మిమ్మల్ని ముక్తుల్ని చేస్తుంది. ఎవరైన నన్ను తనతప్పులను ఎలా గుర్తించాలని అడిగినచో అతడు ఏఏ సందర్భాలలో బాధననుభవించాడో వాటినన్నింటిని నోట్ చేయమని నేనతనికి చెప్తాను. అవే అతని తప్పులు. అతని బాధ వెనుకనున్న తప్పులను అతను కనుక్కోవాలి. ఆయా సందర్భాలలో అతని బాధకు అతని పాట్రెంత ఉన్నదో అతడు పరిశీలించుకోవాలి. ప్రజలెప్పుడూ బాధపడుంటారు, వారు తమ తప్పుల్ని తెలుసుకోవాలి. ఏ బాధలోనైనా తప్పు మనదే అని మనం గుర్తిస్తాం. నేనెన్నడైనా తప్పు చేస్తే చాలా అసౌకర్యాన్ని అనుభవిస్తాను. ఎవరితప్పునైనా నేనెలా గ్రహిస్తాను? అందరిలోను నేను వారి శుద్ధాత్మను (హోమ్ డిపార్ట్ మెంట్ ని) మరియు వారి అనాత్మను (ఫారిన్ డిపార్ట్ మెంట్ ను) వేరుగా చూస్తాను. అనాత్మ విభాగంలో జరుగుచున్న తప్పుల్ని గమనించినా నేనేమీ చెప్పను. ఆ తప్పు శుద్ధాత్మ విభాగంలో జరుగుచున్నట్లు నేను గమనిస్తే అపుడు నేను వారిని హెచ్చరించవలసి వుంటుంది. మనలో చాలా అంతరభాగాలున్నాయి. వాటిలో ఏభాగం బాధను సహిస్తుందో మనం తెల్సుకోగలం. కొన్ని సార్లు అహంకారం బాధపడ్తుంది, అపుడు దోషం అహంకారానిది. కొన్నిసార్లు మనసు బాధననుభవిస్తుంది, అపుడు దోషం మనసుది. కొన్నిసార్లు చిత్తం (వినిన జ్ఞానాన్ని, చూసిన దానిని ఫొటోగ్రఫీ పద్ధతిలో రికార్డు చేయగల మనసు యొక్క సూక్ష్మాంశం) బాధపడ్తుంది. అపుడు తప్పు చిత్తానిది. తన తప్పులనుంచి తాను వేరుగా ఉండటం మనిషికి సాధ్యపడుతుంది. ఈ ముఖ్య విషయాన్ని నీవు అర్ధం చేసికోవలసివుంది, అవునా?

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38