________________
నవకలమ్ (తొమ్మిది ప్రగాఢ అంతరంగ భావనలు) ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! దేహధారియైన ఏ జీవాత్మ యొక్క అహంకారము కించిత్ మాత్రము కూడా గాయపడుటకు నేను కర్తను, కారయితను, ప్రేరకుడను, అనుమోదకుడను కాకుండునట్లు నాకు పరమ శక్తిని ప్రసాదించు. ఏ దేహధారి జీవాత్మ యొక్క అహంకారమును ఏ మాత్రమూ గాయపరచకుండు నట్టి సాత్విక వాణి, వర్తన, విచారము కల్గియుండునట్లు నాకు అనంతమైన ఆంతరంగిక శక్తిని అనుగ్రహించు. ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్ ! ఎవరి ధర్మ ప్రమాణములు కించిత్ మాత్రము కూడా కించపడుటకు నేను కర్తను, కారయితను, ప్రేరకుడను, అనుమోదకుడను కాకుండునట్లు నాకు పరమశక్తిని ప్రసాదించు. ఎవరి ధర్మము యొక్క ప్రమాణమును అణుమాత్రమైన కించపరచకుండుటకు తగిన, అందరికి ఆమోదయోగ్యమైన సాత్విక వాణి, వర్తన, భావన కల్గి
యుండునట్లు నాకు అనంతమైన అంతరశక్తిని ప్రసాదించు. 3. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ఉపదేశకులైన ఏ దేహధారి సన్యాసిని
గాని, సన్యాసినిని గాని లేక ఆచార్యుని గాని విమర్శించకుండునట్లు, వారికి అపరాధము చేయకుండునట్లు, వారి పట్ల అవినయముగా ప్రవర్తించకుండునట్లు
నాకు పరమశక్తిని అనుగ్రహించు. 4. ప్రియాతి ప్రియమైన దాదా భగవాన్ ! ఏ దేహధారి జీవాత్మ పట్ల కూడా నేను
ద్వేషము, తిరస్కారము కలిగియుండకుండునట్లు, ఇతరులు అట్లు ద్వేషించుటకు, తిరస్కరించుటకు నేను కారణము కాకుండునట్లు; ద్వేషించుటను, తిరస్కరించుటను నేను ఆమోదించకుండునట్లు నాకు అనంతమైన శక్తిని
అనుగ్రహించు. 5. ప్రియాతి ప్రియమైన దాదాభగవాన్ ! ఏ దేహధారి జీవాత్మ విషయంలో కూడా ఎప్పుడు
గాని పరుషవాక్యాలను, హృదయాన్ని గాయపరిచే మాటలను నేను పలుకకుండునట్లు,