________________
24
బాధపడేవానిదే తప్పు
న్యాయమూర్తి ఒక కంప్యూటర్ వంటిది. “బాధపడేవానిదే తప్పు” ఇది గుప్త సత్యం. ఇక్కడ బుద్ధిని ప్రయోగించటం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ రహస్య సత్యాన్ని గ్రహించాలంటే నీవు జ్ఞానిపురుషుని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుప్త సత్యాన్ని సూక్ష్మతమ స్థాయి వద్ద తప్పక గ్రహించాలి. న్యాయాన్ని వెల్లడించే మాద్యమం ఒక చేతన స్వరూపం (మనిషి అయినచో అన్యాయానికి, పక్షపాతానికి అవకాశం ఉంటుంది. కాని ప్రకృతి సదా న్యాయమే.
ప్రాపంచిక పరిభాషలో నీకు తెలియజెప్పాలంటే అది ఒక కంప్యూటర్ వంటిది. మనుష్యులు తయారుచేసిన కంప్యూటర్ సంపూర్ణంగా లోపరహితంకాదు. నీవు గనుక రాంగ్ డేటా ఫీడ్ చేస్తే అది తప్పులు చేయగలుగుతుంది. కాని ప్రకృతి యొక్క కంప్యూటర్ దోషరహితమైనది. అది ఈ ప్రపంచంలో న్యాయాన్ని తయారు చేసి వెల్లడించే ప్రత్యేక వస్తువు. అనురాగానికి, పక్షపాతానికి అతీతమైన పూర్ణ స్వేచ్ఛను ప్రకృతి యొక్క కంప్యూటర్ కల్గియున్నది. జ్ఞాని పురుషుని యొక్క ఒకే ఒక్కమాటను నీవు అర్ధంచేసికొని, గ్రహించినచో నీవు మోక్షాన్ని పొందుతావు. తప్పెవరిది అనే విషయంలో నీకు ఎన్నడూ ఎవరి సలహాను తీసికోవలసిన అవసరం రాదు. తప్పు బాధపడేవానిదే.
ఇది పూర్తి విజ్ఞానం. దోషరహితమైనది. ఇదే పరిపూర్ణమైన విజ్ఞానం. ఇది కేవలం భారతీయులకే పరిమితం కాదు, పూర్తి ప్రపంచం కోసం, సమస్త మానవాళికోసం.
నేను మీకు లోపరహితమైన, నిర్మలమైన న్యాయాన్ని చూపిస్తునప్పుడు, న్యాయాన్యాయాలగురించి చర్చించవలసిన అవసరం ఏమిటి? ఇది చాలా లోతైన సూక్ష్మ సత్యము (గుహ్యము). నేను మీకు సమస్త శాస్త్రాల సారాన్ని ప్రసాదిస్తున్నాను మరియు ప్రకృతి శాసనం ఎంత ఖచ్చితంగా పని చేస్తుందో చెప్తున్నాను: “బాధపడే వానిదే తప్పు". ఈ వాక్యం చాలా సరిగా (ఎగ్జాక్ట్ గా) వెలువడింది. దీనిని ఎవరు ఉపయోగించుకొంటారో, అన్వయించుకొంటారో వారికి మోక్షం సిద్ధిస్తుంది.
- జై సచ్చిదానంద్