________________
బాధపడేవానిదే తప్పు
నష్టాన్ని లెక్కవేసుకొంటాడు, “ఒక్కొక్కటి ఐదురూపాయలు చొప్పున పది కప్పులు ఏభై రూపాయలు. నాకు యాభై రూపాయలు నష్టం వచ్చింది". అతడు మేల్కొని వుంటాడు. అందు వల్ల అతడే ఎక్కువ బాధపడ్తున్నాడని, తప్పు అతనిదే అని నీవు గ్రహించవచ్చు.
ఎవరూ తప్పులను వెదకకూడదు. “బాధపడేవానిదే తప్పు” అనే సూత్రాన్ని మాత్రం ధర్మామీటరువలె ఉపయోగించుకోవాలి. ఈ విధంగా పరిస్థితులను మీరు పరిశీలించటం కొనసాగిస్తే, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. మరియు మోక్షాన్ని
పొందుతారు.
తప్పెవరిది? డాక్టరుదా లేక రోగిదా? ఒక యింటి నుంచి డాక్టరుకి ఫోను వస్తుంది. డాక్టరు రోగికి నొప్పి తగ్గించే నిమిత్తం ఒక యింజక్షన్ యిచ్చి యింటికి వెళ్లి హాయిగా నిద్రపోతాడు. కాని రోగి యింజక్షన్ వల్ల చాలా బాధననుభవిస్తూ రాత్రంతా అశాంతితో గడుపుతుంది. ఇక్కడ తప్పెవరిది?
రోగిది.
వ్యాధిగ్రస్తుడైన ఒక
పిల్లవాడి నిమిత్తం ఇంకొక డాక్టరుకి ఒక యింటి నుంచి ఫోన్ వస్తుంది. డాక్టరు పిల్లవాడిని పరీక్షించినపుడు అతనికి నాడి దొరకదు. తనను ఎందుకు పిలిపించారని తల్లిదండ్రులను డాక్టరు అడుగుతాడు. అతడు పరీక్షించే ముందు వరకు పిల్లవాడు జీవించే వున్నాడని వారు చెప్తారు. తల్లిదండ్రుల పై డాక్టరుకి కోపం వస్తుంది. ఇంటికి వచ్చినందుకు ఫీజు కూడా వసూలు చేస్తాడు. ప్రపంచం ఇలాగే వుంది. ఈ కాలంలో న్యాయానికై వెదకవద్దు.
ప్రశ్నకర్త : ప్రజలు వైద్యం నిమిత్తం డాక్టరు వద్దకు వెళ్లి డాక్టరు పై కోపగిస్తుంటారు. ఇది నా అనుభవం.
దాదాశ్రీ : అలా కూడా జరుగుతుంది. నీవు ఎదుటివ్యక్తిని నిందిస్తే తప్పు నీదవుతుంది. ప్రకృతి సదా న్యాయమే చేస్తుంది.
ఆపరేషన్ సమయంలో రోగి మరణిస్తే తప్పెవరిది ? తడి నేల పైనీవు కాలుజారిపడితే తప్పెవరిది ?