________________
15
బాధపడేవానిదే తప్పు
పర్యంగా
తమ పిల్లల్ని కొట్టరు, పిల్లలు తమ తల్లిదండ్రులకు దు:ఖాన్ని కల్గించరు. ప్రజలంతా తమ యిళ్లలో సుఖంగా ఉండేవారు. ఈ పిల్లలు, భర్తలు, భార్యలు అందరూ యంత్రాలుతప్ప వేరేమీకాదు.
పర్వతాన్ని తిరిగి రాళ్లతో కొద్దామా? ప్రశ్నకర్త : ఎవరైనా మన పై రాతినివిసిరి గాయపరిస్తే మనకి కోపం వస్తుంది. దాదా శ్రీ :
రాయి విసిరింది మనిషి కనుక వారి పై నీవు కోపగిస్తావు. ఒకవేళ ఒకరాయి పర్వత శిఖరం పై నుంచి దొర్లి నీనెత్తి పైపడి రక్తస్రావం మొదలైతే ఏంచేస్తావు.?
ప్రశ్నకర్త : అపుడు, నా కర్మవల్లనే నేను గాయపడ్డానని అర్ధం చేసికొంటాను, ఆ పరిస్థితి వేరు. దాదా శ్రీ : పర్వతంపై నీకు కోపం రాదా?
ప్రశ్నకర్త : లేదు. దానిని ఎవరూ విసరలేదు కనుక కోపగించే ప్రసక్తే లేదు. దాదాశ్రీ : ఈ విషయంలో నీకు వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వివేకం నీకు తనంత తానుగా సహజంగా కల్గింది. నీపై రాళ్లు విసిరినపుడు, నిన్ను కసిరినపుడు, నిన్ను తిట్టినపుడు, నీ సొమ్ము దొంగిలించినపుడు కూడా ఈ ప్రజలంతా ఇదే మాదిరిగా పర్వతంవంటివారే. వారిలో నిజమైన చైతన్యం లేదు. ఇంతమాత్రం నీవు అర్ధం చేసికొంటే నీకెంతో మేలు కల్గుతుంది.
నీ ఆంతరంగిక శత్రువులైన క్రోధం, గర్వం, దురాశ, మోహము నీకు ఇతరులలో దోషాలను చూపిస్తాయి. ఆత్మదృష్టి ఇతరులలో దోషాలను చూడదు. ఇతరుల దోషాలను చూసేలా ఒకరిని తయారు చేసేది ఈ అంతరంగ శత్రువులే. ఎవరిలో అంతరంగ శత్రువులు లేరో, అతనికి యితరుల దోషాలను చూపేవారు ఎవరూ ఉండరు. అంత: శత్రువులు లేని వ్యక్తికి నిజానికి ఇతరులలో ఏ దోషమూ కన్పించదు. వాస్తవానికి దోషులు ఎవరూ లేరు. 'నేను చందూలాల్' అని నీవు తప్పుగా భావించటం వల్ల ఈ శత్రువులు నీలో ప్రవేశించాయి. ఈ అంత: శత్రువులు నీ బలహీనతలు. 'నేను చందూలాల్' అనే రాంగ్ బిలీఫ్ పోయినట్లయితే ఈ బలహీనతలు అదృశ్యమైపోతాయి. ఎంతో కాలంగా ఆక్రమించుకొన్న యింటిని ఖాళీ చేయటానికి వాటికి ఆ తర్వాత కూడా కొంత సమయం పడుంది.