Book Title: Fault Is Of Sufferer
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ 13 బాధపడేవానిదే తప్పు ఉండకూడదు. ప్రజలు తాము చూచినదానినిబట్టి స్కూటరిస్టుని నిందిస్తారు. అజ్ఞానం వల్ల వారు దీనిని అన్యాయంగా దర్శిస్తారు. ప్రశ్నకర్త : నిజమే. దాదా శ్రీ : ఒకవ్యక్తి నీకు బాధ కల్గిస్తుంటే, అది అతని తప్పు కాదు. బాధపడ్తున్నది నీవైనచో ఆ తప్పునీదే. ఇది ప్రకృతి యొక్క శాసనము. ప్రపంచ శాసనం ఏమి చెప్తుంది అంటే ఎవరు దు:ఖాన్ని కలుగచేస్తున్నారో వారిదే తప్పు. ఈ సూక్ష్మ విషయాన్ని అర్ధం చేసికొన్నచో మనిషి యొక్క కఠిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. నిన్ను కర్మబంధాలనుంచి విడిపించిన వ్యక్తిపట్ల కృతజ్ఞత ఒక అత్తగారు ఎపుడూ తన కోడల్ని వేధిస్తూ ఉంటుంది. అత్తగారు తనతో ఎలా వ్యవహరించినప్పటికీ కోడలు దిగమ్రింగుతుంది. పగలూ రాత్రి ఆమె అత్తగారితిట్ల గురించే ఆలోచిస్తుంది. ఇది ఆమె జీవితాన్నే దు:ఖమయం చేయదా? ప్రశ్నకర్త : అవును. దాదా శ్రీ : ఆమె దు:ఖం ఆమె శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నిరాదరణవల్ల ఆమె సరిగా ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఆమెకు ఏ విధంగా సహాయ పడగలం? అది ఆమె పూర్వజన్మ కర్మఫలమని, ప్రస్తుత పరిస్థితులను ఆమె సహించుకోవాలని మనం ఆమెకు వివరించాలి. మనం ఆమెకు తన ఖాతాలను ఎలా సెటిల్ చేసికోవాలో చూపించాలి. తప్పు అత్తగారిది కాదు, బాధపడేవారిదే. వివరించి చెప్పటం వల్ల ఆమె తన అత్తగార్ని నిందించటం మానివేస్తుంది, ప్రశాంతంగా ఉండగల్గుతుంది. తనను కర్మబంధాలనుంచి విడిపిస్తున్నందుకు అత్తగారి పట్ల కృతజ్ఞతా భావం ఏర్పడుతంది. ఈ విశ్వంలో ఎవరూ దోషులుకారు. ఇతరులను నిందించేవారిదే తప్పు. ఇతరులను దోషులుగా చూచేవారే దోషులు. ప్రతి ఒక్కరూ తమ కర్మానుసారం ఎవరు దేనికి అర్హులో దానిని పొందుతారు. వారు కొత్తగా తప్పులను ఈ రోజు సృష్టించుకోవటం లేదు. ఇప్పటి స్థితి గతకర్మల ఫలస్వరూపం. ఈ రోజు అతడు పశ్చాత్తాప పడుండవచ్చు;

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38