Book Title: Fault Is Of Sufferer
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ బాధపడేవానిదే తప్పు దాదాశ్రీ : తన తప్పులను తాను కనిపెట్టగల శక్తి ఎవరికీ లేదు. ఆ తప్పులను చూపగల నమ్మకమైన ఒక వ్యక్తి అతనికి కావాలి. ఒకసారి అతని తప్పుల్ని అతనికి చూపిస్తే ఆ తర్వాత తప్పుల్ని గుర్తించగల నైపుణ్యం అతనికి వస్తుంది. 7 జీవితాన్ని ఎలా జీవించాలో ముందుగా నేర్చుకోవాలి. ఒకసారి యింట్లో ఘర్షణలు ఆగిపోతే అపుడు మిగిలిన విషయాలను నేర్చుకోవచ్చు. బాధపడేవానిదే తప్పు అని నీవు గ్రహించినట్లయితే ఇంట్లో పోట్లాటలు ఉండవు. ఒకవేళ మీ అత్తగారు నిన్ను బాధించినట్లయితే, రాత్రి ఆమె గాఢనిద్ర పోతున్నప్పటికీ నీకు నిద్రపట్టక పోతే తప్పునీదేనని నీవు గుర్తించాలి. ఎదుటివ్యక్తి అర్ధం చేసుకోకుంటే? ప్రశ్నకర్త : : మన ప్రవర్తన ఎంత స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కొంత మంది అర్ధం చేసికోరు. దాదా శ్రీ : వారు అర్ధంచేసికొనక పోవుటకు కూడ తప్పు మనదే. goo చేసికొనగల వ్యక్తులు మనకెందుకు దొరకలేదు? వీరి సంయోగమే మనకెందుకు లభించింది? ప్రశ్నకర్త : గతంలో అటువంటి కర్మలు చేసినట్లు గ్రహించాలా? దాదాశ్రీ : తప్పక గ్రహించాలి. నీకు కించిత్ మాత్రం కూడ బాధ కల్గించగలవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒక వేళ ఎవరైన నీకు బాధ కల్గించినచో అతడు కేవలం నిమిత్తుడు (పరికరం) మాత్రమే. ఒక జంట జగడమాడుకొని తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే నిద్రకి ఉపక్రమిస్తారు. భార్య ప్రశాంతంగా నిద్రిస్తుంది. కాని భర్త అశాంతిగా ప్రక్కలో దొర్లుతుంటాడు.దానిని బట్టి అతనిదే తప్పు అని మనం గ్రహించాలి. భార్య బాధపడటం లేదు. ఒకవేళ భార్యప్రక్క మీద దొర్లుతుంటే, భర్త గురకపెట్టి నిద్రిస్తుంటే అపుడు భార్యది తప్పు. తప్పు ఎవరిదైతే వారు బాధపడతారు. ఇది చాలా నిగూఢమైన విజ్ఞానం. ఈ ప్రపంచం ఎపుడూ నిమిత్తుణ్ణి నిందిస్తుంది.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38