________________
బాధపడేవానిదే తప్పు
బాధలు అన్నీ ఎవరికి వారు కోరి తెచ్చుకొన్నవే. ఈ ప్రపంచాన్ని అర్ధం చేసికోవటం చాలా ముఖ్యం.
ఒకరోజు నేను అతని కొడుకుని యిలా అడిగాను: 'నీ తండ్రికి అంత దు:ఖాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? అలా చేస్తున్నందుకు ఏ
రోజైనా పశ్చాత్తాపం చెందావా?” దానికతడు తనకి కావలసినంత సమయం ఉన్నదని, తండ్రి సంపదని అనుభవించే అదృష్టం లభించినపుడు సంతోషంగా ఉండటంలో తప్పేమిటని సమాధానమిచ్చాడు. ఏమైనప్పటికీ ఇతడు సమయం వచ్చినపుడు తన తప్పులకు ఫలితం అనుభవిస్తాడు. ప్రస్తుతం ఎవరు బాధపడుతున్నారో, చింతిస్తున్నారో వారే దోషి. ప్రకృతి యొక్క ఈ ఒక్క శాసనాన్ని అర్ధం చేసికొన్నచో మీ కోసం మోక్షమార్గం తెరవబడుతుంది.
కుమారుని మంచి దారిలో పెట్టడానికి, అతనికి హాని కల్గించనిది, లాభదాయకం అయినదీ అయిన ఏదైనా మార్గాన్ని కనిపెట్టమని నేను ఆవ్యాపారికి చెప్పాను. ఆ మార్గంలో కుమారునికి కావలసిన ఆర్ధిక సహాయంగానీ, వేరే సహాయం గానీ చేయమని కూడ చెప్పాను.
ప్రశ్నకర్త : పిల్లలపట్లగల మమత, బాధ్యత వల్లనే తల్లిదండ్రులు బాధపడుతున్నారా? దాదాశ్రీ : వారి బాధలకు ప్రధాన కారణం వారి తప్పులే. వారికి గల మమత, బాధ్యత కూడ కొంతవరకు కారణం. ఇంకా ఎన్నో యితర కారణాలున్నాయి. నీవు బాధపడుతున్నట్లయితే అది నీ దోషమే అని గ్రహించటం అత్యంత ముఖ్యం. అందువల్ల ఎవరి దోషాలనూ చూడవద్దు, లేనిచో రాబోయే జన్మకి నీవు కొత్త ఖాతాలను సృష్టించుకొంటావు.
రెండు రకాలైన శాసనాలున్నాయి : ఒకటి ప్రకృతి శాసనం, రెండవది మానవశాసనం. ప్రకృతి శాసనాన్ని నీవు అంగీకరించినచో జీవితం సరళము, సులభమూ అవుతుంది. మానవ శాసనాన్ని నీవు స్వీకరిస్తే చిక్కులు, బాధలు తప్పవు.
ప్రశ్నకర్త : దాదా! ఎవరైనాగాని తమ తప్పుల్ని తాము గుర్తించవలసి వున్నదా లేదా ?