Book Title: Fault Is Of Sufferer
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ “బాధపడే వానిదే తప్పు” ప్రకృతియొక్క న్యాయస్థానంలో ఈ ప్రపంచంలో చాలామంది న్యాయమూర్తులున్నారు. కాని కర్మ ప్రపంచంలో ఒకే ఒక ప్రకృతి న్యాయమూర్తి ఉంటారు. ఒకే ఒక ప్రకృతి న్యాయం ఉంటుంది. 'బాధపడేవానిదే తప్పు.' ఇదే ఏకైక న్యాయం. ఈ న్యాయం సమస్త విశ్వాన్ని పాలిస్తుంది. ప్రపంచం యొక్క న్యాయం భ్రాంతి పూర్వకమైన న్యాయం, ప్రాపంచిక జీవితం శాశ్వతముగ నుండుటకు ఇదే హేతువు. అన్ని సమయాలలో ప్రకృతి యొక్క న్యాయమే ఈ విశ్వాన్ని పాలిస్తుంది. ఎవరు అర్హులో వారు సన్మానింపబడతారు, ఎవరు అనర్హులో వారు శిక్షింపబడతారు. ప్రకృతి యొక్క న్యాయపరిధిని దాటి ఏమీ జరగదు. ప్రకృతి శాసనము సంపూర్ణంగా న్యాయపూర్వకమైనది. కాని దానిని అర్ధంచేసికోని కారణంగా ప్రజలు దానిని అంగీకరించరు. ఎపుడు దృష్టి నిర్మలమవుతుందో అపుడు వారు ప్రకృతి యొక్క న్యాయాన్ని అంగీకరించగలుగుతారు. స్వార్ధ దృష్టి ఉన్నంతవరకు న్యాయాన్ని దర్శించలేరు. జగత్ర్పభువుకి బాధపడవలసిన అవసరం ఏమిటి? ఈ ప్రపంచం యొక్క యాజమాన్యం మనదే. మనమే ఈ విశ్వానికి యజమానులం. అయినా మనమెందుకు బాధపడాలి? గతంలో మనం చేసిన తప్పులే వర్తమానంలోని మన బాధలకు కారణం. మన తప్పులవల్లనే మనం బంధింపబడి వున్నాం. ఒకసారి ఈ తప్పులన్నీ నాశనం గావింపబడితే మనకి ముక్తి లభిస్తుంది. నిజానికి నీవు ముక్తుడవే అయినప్పటికీ నీ తప్పుల కారణంగా బంధనాల ననుభవిస్తున్నావు. నీవే న్యాయమూర్తివి, నీవే దోషివి, నీవే న్యాయవాదివి అయినప్పుడు న్యాయం ఎవరి పక్షాన ఉంటుంది? ఈ విధమైన న్యాయం నీకు మాత్రమే అనుకూలంగా వుంటుంది. ఎందుకంటే నీ యిష్టాన్ననుసరించే నీవు న్యాయనిర్ణయం చేస్తావు. తప్పులు

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38