Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ సర్వత్ర సర్దుకొనిపొండి “ఇది నీకు ఎక్కడనుంచి వచ్చింది?” అని అడగవద్దు. దానికి బదులుగా, ప్రేమతో “బాబూ! నీ కొత్త టోపీ చాలా బాగుంది. ఎక్కడిది? దీని ఖరీదు చాలా ఎక్కువా?” అని అడగండి. ఈ విధంగా మీరు ఎడ్జస్ట్ కావాలి. అసౌకర్యంలో సౌకర్యాన్ని చూడమని మన ధర్మం మనకి బోధిస్తున్నది. నాకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ప్రక్కదుప్పటి మురికిగా ఉన్నదనే భావన నాకు కల్గింది. అపుడు మనసులోనే ఎడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ దుప్పటి చాలా మెత్తగా ఉంది అనుకొన్నాను. దుప్పటి మురికిని పట్టించుకోకుండా దాని మృదుత్వాన్ని భావించటం వల్ల అపుడు నాకు చాలా సౌకర్యంగా అన్పించింది. పంచేంద్రియాలవల్ల లభించే జ్ఞానం మనకు అసౌకర్యాన్ని, దోషాలను చూపిస్తుంది. ఆత్మజ్ఞానం సౌకర్యాన్ని, సుగుణాలను చూపిస్తుంది. అందువల్ల ఆత్మలోనే వుండాలి. అనుకూలంకాని ప్రజలతో సర్దుబాటు. మురుగు కాలువనుంచి దుర్గంధం వస్తే మనం ఫిర్యాదు చేస్తామా? దానితో పోట్లాటకు దిగుతామా? అదే విధంగా అననుకూలురు, వ్యతిరేకులు అయిన ఈ ప్రజలంతా దుర్గంధాన్ని వ్యాపింపజేస్తుంటారు. దుర్గంధాన్ని యిస్తే దానిని మురుగుకాలువ అంటున్నాం. మనోహరమైన సువాసనలు వెదజల్లేదానిని పుష్పం అంటున్నాము. రెండింటికి ఎడ్జస్ట్ కావాలి. వీతరాగస్థితిని (రాగద్వేషాలకు అతీతమైన స్థితిని) పొందమని అవి మనకు బోధిస్తున్నాయి. మంచి, చెడు అనే నీ అభిప్రాయాలే నీ బాధలకు కారణం. రెంటినీ సమానంగా భావించటం నేర్చుకోవాలి. మన భావాలను సదా పరిశీలించుకోవాలి. ఏదైనా ఒక వస్తువును మంచిదని మనం చెప్పినపుడు, దానితో పోల్చిచూస్తే మిగిలిన వస్తువులు చెడ్డవిగా తోస్తాయి. మనల్ని బాధించటం మొదలు పెడతాయి. మంచి, చెడు అనే అభిప్రాయాలకు అతీతమైన స్థితిని మనం చేరినట్లయితే బాధ అనేదే ఉండదు. “సర్వత్ర సర్దుకొని పోవాలి” (Adjust every where) అనేది నేను కని పెట్టిన సూత్రము. ప్రజలు ఏమి చెప్పినా, అది అబద్ధమైనా, నిజమైనా మనం ఎడ్జస్ట్ కావాలి. ఎవరైనా నన్ను “నీకు వివేకం లేదు” అన్నచో వెంటనే నేను యిలా చెప్పి ఎడ్జస్ట్ అవుతాను. “మీరు చెప్పింది నిజమే. నేనెప్పుడూ కొంచెం మందబుద్ధినే. దానిని మీరీ రోజే గుర్తించారు. కానీ నా కీ విషయం నా చిన్నప్పటి నుంచే తెలుసు.” మీరీ విధమైన ప్రత్యుత్తరమిచ్చినచో

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38