Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ సర్వత్ర సర్దుకొనిపొండి ఉండి చాలా లోతైన అర్ధాన్ని కల్గి వుంటుంది. నా అతిపొదుపు అలవాటుని ప్రజలుకూడ గుర్తించారు. నా పొదుపు సర్దుబాటు చేసికోదగినదిగా ఉంటుంది, సర్వోత్తమమైనది. నీటిని ఉపయోగించే సమయంలో కూడ నేను పొదుపు పాటిస్తాను. నేను స్వాభావికముగా మరియు సహజంగా ఉంటాను. 24 లేనిచో సమస్యలు నీకు అవరోధాలను సృష్టిస్తాయి. ముందుగా మనం ప్రపంచంలో వ్యవహరించే కళను నేర్చుకోవాలి. ఎలా వ్యవహరించాలో తెలియనందువల్లనే ప్రజలు అనేక బాధలు పడతారు. ప్రశ్నకర్త : ఆధ్యాత్మిక విషయాలలో మీ విజ్ఞానం కంటే శ్రేష్ఠమైనది లేదు. ఏది ఏమైనా ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించి కూడ మీ మాటలు అభ్యసింపదగినవి, చాల ఉపయోగకరమైనవి, సర్వోత్తమమైనవి. దాదాశ్రీ : వ్యవహారానికి సంబంధించిన ఈ కళను అర్థం చేసికొనకుండా ఎవ్వరికీ ముక్తి సాధ్యం కాదు. ఎంత అమూల్యమైనదైనప్పటికీ కేవలం ఆత్మజ్ఞానం ఒక్కటే ముక్తికి సహాయం చేయదు. ప్రపంచం కూడ మిమ్మల్ని వదిలిపెట్టాలి. ప్రపంచం మిమ్మల్ని స్వేచ్ఛగా వదలనిచో మీరేమి చేయగలరు? ప్రపంచం మిమ్మల్ని ఒంటరిగా వదిలినచో మాత్రమే మీరు శుద్ధాత్మ. మీరు ప్రపంచంలో చిక్కుకుంటూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఆచిక్కుల్లోనుంచి బయటపడి స్వేచ్ఛని పొందాలని మీకు మీరుగా ఎందుకు యత్నించరు? ఐస్క్రీమ్ కొనితెచ్చే నిమిత్తం నీవు ఒకరిని పంపించావు, అతడు రిక్త హస్తాలతో తిరిగి వచ్చాడు. కారణం అడుగగా, సగం దూరం వెళ్లాక గాడిద కన్పించిందని, అది అపశకునమని తాను నమ్మినందున తిరిగి వచ్చానని చెప్పాడు. ఇటువంటి మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను తొలగించవలసి వున్నది. ఆ గాడిదలో కూడ భగవంతుడు వసించి వున్నాడని అతడు తెలుసుకోవలసి ఉన్నది. అతడేర్పరచుకున్న అభిప్రాయాలు మరియు వంటి నమ్మకాలు కేవలం మూర్ఖత్వం. గాడిద పట్ల అతనికి కల్గిన తిరస్కార భావం దానిలో ఉన్న భగవంతుని చేరుతుంది. అతడొక

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38