Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ 26 సర్వత్ర సర్దుకొనిపొండి దాదాజీ యొక్క అద్భుత విజ్ఞానం ప్రశ్నకర్త : ఈ సర్దుబాటు వెనుకవున్న ఉద్దేశ్యం ఏమిటి? ఏ మేరకు మేము ఎడ్జస్ట్ కావలసి వున్నది? దాదా శ్రీ : దీని ఉద్దేశ్యం మరియు లక్ష్యం శాంతి. అశాంతిని తప్పించుకొనుటకు ఇది తాళం చెవి. ఇది దాదా యొక్క సర్దుబాటు విజ్ఞానం. ఈ ఎడ్జస్ట్ మెంట్ సుప్రసిద్ధమైనది. ఎడ్జస్ట్ కానిచో ఏమి జరుగుతుందో మీకు అనుభవమే. అననుకూలత మూర్ఖత్వం. సర్దుబాటు (అనుకూలత) న్యాయం. ఏ విధమైన మూర్ఖపు పట్టుదల అయినా (తన అభిప్రాయాన్నే గట్టిగా పట్టుకొని ఉండటం) న్యాయం అనిపించుకోదు. మీ దృష్టికోణమే సరైనదని ఏ విషయంలోనూ ఎన్నడూ ఇతరులను నిర్బంధించరాదు. నేనూ ఏ విషయంలోనూ మొండితనంగా వ్యవహరించను. జీవితంలో, విషయాలను త్వరగా ముగించుకోగలిగే మార్గాన్ని మీరు అనుసరించాలి. నాతో ఎవ్వరూ ఎన్నడూ ఎడ్జస్ట్ కాలేకపోవడం జరగలేదు. ఇక్కడ ఇంట్లో నలుగురు మాత్రమే ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు ఎడ్జస్ట్ కాలేరు. ఎలా ఎడ్జస్ట్ కావాలో మీరు నేర్చుకొంటారా? ఎడ్జస్ట్ కావటం అసాధ్యమా?నీవు గమనించిన వాటినుంచే నువ్వు నేర్చుకుంటావు. నువ్వు ఏమి చూస్తావో వాటినుంచి నువ్వు నేర్చుకోవాలనేది ప్రపంచ న్యాయం. ఎవరూ నీకు బోధించవలసిన పని లేదు. ఇందులో నేర్చుకోవటానికి కష్టమైనది ఏమైనా ఉన్నదా? నా ఉపదేశాన్ని నీవు అర్ధం చేసుకోలేక పోవచ్చు. కానీ నా ప్రవర్తనను గమనించినట్లయితే నీవు తేలికగా నేర్చుకొంటావు. నీకు ఇంట్లో ఎలా ఎడ్జస్ట్ కావాలో తెలియదు, కానీ కూర్చుని వేద పఠనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలని యత్నిస్తున్నావు. మిగిలిన విషయాలన్నీ విడిచి పెట్టు. మొదట ఎడ్జస్ట్ కావటం నేర్చుకో. ఇంట్లో ఏ విధంగా ఎడ్జస్ట్ కావాలనే ప్రధమ విషయం నీకు తెలియదు. ఇదే ప్రపంచం యొక్క సంక్లిష్ట లక్షణం. నీకు ఈ ప్రపంచంలో ఏమీ తెలియకపోయినా అది పెద్ద సమస్యకాదు. నీవు చేసే పనికి సంబంధించిన పరిజ్ఞానం కూడ నీకేమాత్రం లేకపోవచ్చు. అయినా ఫర్వాలేదు. కానీ ఎలా ఎడ్జస్ట్ కావాలనే విషయాన్ని తెలుసుకోవటం అవసరం. దీనిని నీవు నేర్చుకోవాలి. లేకుంటే బాధపడతావు. ఈ సందేశాన్ని ఉపయోగించుకుని అత్యధిక ప్రయోజనాన్ని పొందు. - జై సచ్చిదానంద్

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38